రివ్యూ

భయపెట్టని భూత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * భూత్ (ది హాంటెడ్ షిప్)
తారాగణం: విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్, అశుతోష్ రాణా తదితరులు
బాణీలు: అఖిల్ సచిదేవ్
బీజీఎం: కేతన్ సోదా
సినిమాటోగ్రఫీ: పుష్కర్ సింగ్
నిర్మాతలు: యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ కేతన్
దర్శకత్వం: భాను ప్రతాప్ సింగ్
*
మనిషన్నాక -కొన్ని నమ్మకాలుంటాయి. విశ్వాసాలుంటాయి. కల్పనలుంటాయి. భయాలుంటాయి. ఇలాంటివాటి జాబితాలో -ఇంకా ఇంకా చాలాచాలానే ఉన్నాయి, ఉంటాయి కూడా. చిత్రమేమంటే -వీటిలో దేనికీ రూపముండదు. ఒకవేళవున్నా -మనిషి కంటికి కనిపించదు. జస్ట్ అదొక ఫీలింగ్. ఈ జాబితాలో మరొకటీ ఉంటుంది. అదే -దెయ్యం. అసలది -ఉందా? లేదా? అన్నది ఎప్పుడూ చర్చే. భయమే దెయ్యం అనే వాళ్లు కొందరైతే, దెయ్యం భయంతో ఉలిక్కిపడేవాళ్లు ఇంకొందరు.
ఒకవేళ దెయ్యమనేది ఉంటే..? తనకు నచ్చినోళ్లని ఆవహిస్తే..? తన దగ్గరే పెట్టుకుని తిండిపెట్టి పోషిస్తే..? ఈ ప్రశ్నలకు సమాధాన ఎపిసోడ్‌ని -్భత్ అనాలి. ధర్మ ప్రొడక్షన్స్‌పై యాష్ జోహార్ నిర్మాణ పర్యవేక్షణలో దర్శకుడు భానుప్రతాప్ సింహ తెరకెక్కించిన కథనమే భూత్.
కథలోకెళ్తే
-పృథ్వీ (విక్కీకౌశల్) ఓ షిప్పింగ్ ఆఫీసర్. అతని భార్య (్భమి ఫడ్నవీస్), కూతురితో బోటింగ్ చేస్తుండగా.. ప్రమాదం సంభవించి భార్య, కూతురు చనిపోతారు. అయితే అతనికి తన భార్య, కూతురు అప్పుడప్పుడూ కనిపిస్తుంటారు. ఇదంతా భ్రమ అని అతనికి తెలుసు. డాక్టర్ దగ్గర ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటుంటాడు.
అనుకోకుండా ఓ రోజు ముంబయి సముద్ర తీరంలోకి ఓ భారీ ఓడ వచ్చి చేరుతుంది. దాంట్లో ఎవరూ ఉండరు. దాంతో ఎన్నో పుకార్లు పుట్టుకొస్తాయి. అది శ్రత్రుదేశం మన దేశంపైకి పంపించినదని, దెయ్యాల ఓడ అని.. ఇలా రకరకాలుగా! నిజంగానే దాంట్లో రెండు దెయ్యాలుంటాయి. పైగా దాంట్లోకి వెళ్లినవాళ్లు కనిపించకుండా పోయి.. కొంతకాలానికి శవాలుగా దొరుకుతుంటారు. షిప్పింగ్ ఆఫీసర్ అయిన పృథ్వీకీ ఎన్నో ప్రమాదాలు. కానీ అతడిని మాత్రం చంపదు, కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకు తనని వదిలేస్తుందో పృథ్వీకి అర్థంకాదు. ఆ క్రమంలో ఓ ప్రొఫెసర్ (అశుతోష్ రాణా) పరిచయమవుతాడు. ‘నీతో ఏదో పని చేయించుకోవాలని అనుకుంటుంది. నీ సాయం దానికి కావాలి’ అంటాడు. అప్పుడే పృథ్వీ పరిశోధన మొదలెడతాడు. అతనికి కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి.
పేరుకే అది షిప్ అని, దాని ద్వారా ప్రజలను చేరవేయడంకంటే డ్రగ్స్ చేరవేయడమే ఎక్కువని తెలుసుకుంటాడు. దాని కెప్టెన్ కథ, అతని భార్య, కూతురు, పని మనుషులు ఇలా.. ఆ అధ్యయనంలో ఎన్నో పొరలు. అయితే ఆ షిప్‌లో ఉన్నది ఒక దెయ్యమని, అది తనకు ఇష్టమైన ఓ పాపని పట్టి తన దగ్గర ఉండేలా చేసుకుందని గ్రహిస్తాడు. ఆ దెయ్యం ఆ పాపని పట్టి తన దగ్గరే ఎందుకు ఉంచుకుంది? పృథ్వీ -ఆ దెయ్యం బారినుంచి పాపని కాపాడాడా? కాపాడితే ఎలా? అనేది రెండు గంటల భూత్ సినిమా.
విక్కీకౌశల్ మంచి నటుడు. తన పరిథిమేరకు పాత్రను చేసుకుంటూ పోయాడు. కాకపోతే -అతని పూర్తి స్టామినా చూపించేంత కథా సన్నివేశాలు, సంఘటనలు లేవు ఇందులో. భార్య, కూతురు తనవల్లే చనిపోయారని బాధపడే సీన్స్, భయపడే సన్నివేశాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు. చాలావరకు కేతన సోదా ఇచ్చిన బీజీఎం సౌండ్ ఎఫెక్ట్స్ మీదే సినిమా నడిపించేశారు.
ఇక అశుతోష్ రాణాను తక్కువ చేసి చెప్పలేం. కానీ, ఇతనికీ అదే పరిస్థితి ఎదురైంది. ఓ ప్రేక్షకుడిలా సంఘటనలు చూస్తూండిపోయాడు తప్ప, అతనిలోని సృజనాత్మక ప్రతిభని తెరపై ఆవిష్కరించే అవకశం దర్శకుడు ఇవ్వలేకపోయాడు. దర్శకుడి విషయానికొస్తే -ఇది ముంబయిలో జరిగిన నిజ సంఘటన అని చెప్పాడు. ఆ సంఘటన చుట్టూ కథ అల్లుకోవటంలో మాత్రం పూర్తిగా తడబడ్డాడు. నిజానికి హారర్ సినిమాలు తీయటం అంత సులువైతే కాదు. లోతైన విషయం, తర్కం, పరిశీలన, పరిశోధన ఉంటేనే హారర్ అన్న పదానికి అచ్చమైన నిర్వచనాన్ని స్క్రీన్‌మీద ఇవ్వగలుగుతాం. ఎక్కడ లెక్క తప్పినా -సినిమా మొత్తం అభాసుపాలవడం ఖాయం. అందుకు ఎన్నో ఉదాహరణలు. భూత్ చిత్రాన్ని దర్శకుడు భాను ప్రతాప్ సింగ్ అదే క్యాటగిరీ కిందకు తీసుకొచ్చేశాడు. కొన్ని నిజ సంఘటనల ఆధారంగా కథల్లుకోవడంపై పెట్టిన దృష్టి -ఆ టెంపో పడిపోకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నానా? లేదా? అన్నది చూడలేదు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని క్లారిటీగా ఆడియన్స్‌కు చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పుడొస్తున్న చాలా హారర్ సినిమాలు వైవిధ్యంగా ఉంటూ ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్నాయి.
కెమెరా పనితనం అద్భుతం. షిప్, షిప్‌లోని సన్నివేశాలు, ముక్యంగా సముద్రాన్ని అద్భుతంగా చూపించాడు. సౌండ్ ఎఫెక్ట్ కూడా బాగా కుదిరింది. సినిమా మొత్తానికి క్లైమాక్స్, దానికి ముందొచ్చే ఫ్లాష్ బ్యాక్ చిన్న ఊరట. ఏదో చూపించేయాలన్న ఆతృతలో ఏ సన్నివేశం ఎక్కడో అన్నట్టు సినిమా కలగాపులగం చేసేశాడు దర్శకుడు. డైలాగులు సాధారణంగానే ఉన్నాయి. మనిషైనా, మిషనైనా బ్రెయిన్ సరిగ్గా లేకపోతే ఉపయోగం లేదు -అన్న డైలాగుల్లాంటివి అక్కడక్కడా వినిపించటం చిన్న ఊరట. రుచీపచీలేని అతి సాధారణ సినిమా - భూత్.

-మధుర మురళి