రివ్యూ

సరిపెట్టుకుంటే.. సరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * అశ్వథ్థామ
*
తారాగణం: నాగశౌర్య, మెహరీన్, జిస్సుసేన్ గుప్తా, సరుగుల్‌కౌర్ లూత్ర, సత్య, పవిత్ర లోకేష్, ప్రియ, సివిఎల్, మధుమణి, కాశీవిశ్వనాథ్, పోసాని కృష్ణమురళి, ప్రిన్స్ తదితరులు.
కెమెరా: మనోజ్
సంగీతం: శ్రీచరణ్ పాకాల, జిబ్రాన్
నిర్మాత: ఉషా మల్పూరి
దర్శకత్వం: రమణ తేజ
*
కథ విధానం సాధారణంగా రెండు రకాలు. చెప్పదలచుకున్న విషయాన్ని స్ట్రెయిట్‌గా చెప్పడం ఒకటి. చెప్పదలచుకున్న పాయింట్‌ని ట్విస్టులతో కన్‌ఫ్యూజ్ చేస్తూ రక్తికట్టించటం రెండోది. దురదృష్టవశాత్తూ హీరో నాగశౌర్య అందించిన కథ, సినిమాగా రెండో విధానానే్న ఆశ్రయించింది. దీంతో చెప్పదలచుకున్నది వాళ్లు చెప్పినా -అందాల్సింది మాత్రం ఆడియన్స్‌కి అందకుండాపోయింది. అదేలాగో సమీక్షిద్దాం.
చెల్లెలు ప్రియ (సరుగుల్ కౌర్ లూత్రా) నిశ్చితార్థం కోసం ఫారిన్ నుంచి వచ్చిన గనా (నాగశౌర్య), ఉన్నట్టుండి ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో అవాక్కవుతాడు. తరచి తరచి అడిగితే -తాను ప్రెగ్నెంట్‌నని, అదెలాగో తనకూ తెలీడంలేదని చెబుతుంది. అందుకు కారకుల్ని కనుక్కుని మట్టుబెట్టాలని గనా కంకణం కట్టుకుంటాడు. మరి ఆ ప్రయత్నంలో గనా ఎంతవరకూ సఫలమయ్యాడు? గనా తెలుసుకున్న నిజాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలతో చిత్రానికి ఎండ్ కార్డ్ పడుతుంది.
స్థూలంగా ఇది -మహిళలపై జరుగుతోన్న అకృత్యాలకు చరమగీతం పాడాలన్న ఉద్దేశ్యంతో తీసినదే అయినా, ఉద్దేశాన్ని ప్రేక్షకుల్లో రిజిస్టర్ చేయడానికి దర్శకుడు రమణ మోటుతనాన్ని ఆశ్రయించాడు. ఉదాహరణకు -అకృత్యాలకు పాల్పడే డా.మనోజ్‌కుమార్ (జిస్సుసేన్ గుప్తా) అవలంభించే విధానం ఘోరాతిఘోరం. అమ్మాయిలకు మత్తునిచ్చి అత్యాచారానికి పాల్పడతాడు. మరో సంఘటనలో డెడ్‌బాడీపై ఈ దారుణానికి ఒడిగడతాడు. ఇలాంటి తీవ్రమైన అంశాన్ని ఎత్తుకున్నపుడు, పరిష్కారంపై ఫోకస్ పెట్టాలి. అలాకాకుండా అకృత్యాన్ని క్రూరాతిక్రూరంగా చూపించటం -ఉద్దేశ మూలంలోని ఔచిత్యాన్ని దెబ్బతీసినట్టయ్యింది. అలాగే అధర్మాన్ని ప్రశ్నించే తత్వం ‘అశ్వథ్థామ’ది కనుక ఆ పేరు పెట్టామన్నారే తప్ప, వివరణగా ఒక సన్నివేశాన్ని పోలికలతో చెప్పినా ఆడియెన్స్ కనెక్టయ్యేవారేమో. మరోచోట -రావణుడు సీతమ్మను అపహరించటంవల్ల నాశనం కాలేదు, అడ్డుకున్న జటాయువుని అప్పుడే చంపకపోవడం వల్ల.. సమాచారం వెళ్లి అనంతర పరిణామాల్లో అంతమయ్యాడన్నారు. ఈ ప్రతిపాదన ఎంతమాత్రం సమంజసం కాదు. అలాగే ‘నేరం చేయడం తప్పుకాదు.. సాక్ష్యాన్ని వదిలేయడం తప్పు’ అని నిర్థారించారు. అది విలన్ కోణంనుంచి వాడినదే అయినా, ఎంతటి తీవ్ర నేరస్థుడైనా ఎక్కడో ఒకచోట తప్పులో కాలేసి క్లూస్ వదులుతాడు. ఆ క్లూసే సాక్ష్యాలుగా తర్వాతిస్థాయిల్లో మారతాయి. భారతీయ సాక్ష్యాధారాల చట్టం చెపుతున్నదదే.
ఇంక కథలో సన్నివేశాలను కన్సీవ్ చేయడంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీని ఎక్కువ ఆశ్రయించాడు. అంత పెద్ద వైజాగ్ (వాణిజ్య రాజధాని వైజాగ్ అంటూ సినిమాలో సంబోధించారు. త్వరలో కార్యనిర్వాహక రాజధాని కానుందనేమో) లోనూ పోస్టుమార్టం నిర్వహణకు ఒకే డాక్టరుంటాడా? ‘హాస్పటల్స్ అనేకం కానీ, ఈ పని (పోస్టుమార్టం) చేసేది నేనొక్కణ్ణే’ అనీ మనోజ్ ఓ సందర్భంలో అంటాడు. పోనీ కథని ఒకచోటే కేంద్రీకరించాలన్న తపనతో అలా చేసినా, వరసగా ఒకే మాదిరిగా చనిపోవడాలు జరుగుతూవుంటే పోలీసు శాఖ మరో ప్రయత్నంగా రీ పోస్టుమార్టం మరొకరితో తప్పక చేయిస్తుంది. ఆ అంశాన్నీ పక్కన పెట్టేశారు. హంతకుడిని పట్టుకోవడానికి అనేక క్లూస్‌వున్నా, అవన్నీ పోలీసు డిపార్టుమెంట్ చేయదా? అన్న అనుమానమూ కలుగుతుంది. అంటే ఈ మొత్తం వ్యవహారంలో శక్తివంతమైన పోలీసు విభాగాన్ని విస్మరించినట్టు కనిపించింది. ఇక విలన్ తండ్రిని సాక్ష్యం ఉండకూడదని చంపేస్తాడు కానీ అదే తండ్రి, మనోజ్ చిన్ననాట ఎలా ఉన్నాడో అదే గెటప్‌లో తన పక్కనేవున్న భ్రమతో అతడు మాట్లాడుతున్నట్టు చూపారు. కానీ ఈ భ్రమ తతంగం.. కామన్ ఆడియన్‌కు అర్థమయ్యేలా తీయడంలో రమణతేజ విఫలమయ్యాడు. దాంతో గందరగోళం తలెత్తింది. చిత్రంలో స్పృశించిన వైద్య పారిభాషిక పదానికీ విపుల వివరణనిస్తే బావుండేది. అన్నిటికన్నా విచిత్రం- తన దుశ్చర్యలకు సాక్ష్యం జాలర్ల ద్వారా తెలిసిపోతుందన్న భయంతో వారినింటికి పిలిచి విందుపెట్టి చంపేసినా, ఆ హత్యకు కారకులెవరన్నది పోలీసులు పరిశోధించకపోవడం. ఇన్ని గందరగోళాలు వెంటాడిన నేపథ్యంలో సైతం గనాగా నాగశౌర్య తన కెరీర్‌కు ఓ కొత్త లుక్ రావడానికి నటనలో చేసిన కృషి అభినందనీయమే. అయితే అది రాణించడానికి విశ్వసనీయత నింపుకున్న కథ, కథనం అవసరం. అవి ఇందులో లేవు. నాయకుని తర్వాత దాదాపు సెకెండాఫ్ అంతా ఆవరించిన పాత్ర విలన్ డా. మనోజ్‌కుమార్‌దే. దాన్ని పోషించిన గుప్తా దాదాపు పాత్రకు కావాల్సిన అతి కరకుదనాన్ని చిందించాడు. నేహాగా మెహరీన్‌కు లభించిన పాత్ర ప్రాముఖ్యం అంతంత మాత్రం. సోదరి ప్రియ పాత్ర పోషించిన నటి బాగా చేసింది. మిగిలిన పాత్రలకి కథాతీరులో అంతగా వీలులేకపోయింది. పరశురాం మాటల్లో కొంత అసమంజసతున్నా, పట్టుకోసం వాడిన మాటలు కొన్నిచోట్ల అలరించాయి. ‘తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే తెగింపు’వంటి వాటిని ఉదహరించొచ్చు. ‘అశ్వథ్థామా.... ’ అంటూ సాగిన టైటిల్ సాంగ్‌కి శ్రీచరణ్ మంచి బాణీ సమకూర్చాడు. పాటలో ఒకచోట ‘అనూహ్యమైన శక్తికితడు కేంద్రస్థానం’ అంటూ చేసిన పద ప్రయోగం బాగుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం అక్కడక్కడా శృతిమించింది. వైవిధ్యమైన కథనందివ్వాలన్న ఉత్సాహంతోపాటు నాగశౌర్య అది తెరపై ఆవిష్కృతం కావడానికి తగిన వాస్తవికత తదితరాలను గుర్తుంచుకొని నేర్పుని ప్రదర్శిస్తే భవిష్యత్తులోనైనా సక్రమ ఫలితాలొస్తాయి.

-అనే్వషి