రివ్యూ

ఏమీ అనిపించలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* చూసీ చూడంగానే...
*
నటీనటులు: శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, వెంకటేష్ కాకుమాను తదితరులు
సంగీతం: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
నిర్మాత: రాజ్ కందుకూరి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేష్ సింధురావ్
*
టాలీవుడ్ స్క్రీన్‌కు ప్రేమకథలు కొత్తకాదు. త్రికోణ ప్రేమ కథలపైనా చాలామంది దర్శకులు ప్రయోగాలు చేసేశారు. ఆ కోణంలో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చిన మరో చిత్రం -చూసీ చూడంగానే. శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ, శేష్ సింధురావ్ దర్శకురాలిగా పరిచయమవుతూ.. -తెరకెక్కిన రొమాంటిక్ స్టోరీ ఇది. కుర్ర హీరో సరసన వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ రొమాన్స్‌కి ట్రై చేశారు. గోపీసుందర్ సంగీతం సమకూర్చిన చిత్రాన్ని రాజ్ కందుకూరి రూపొందించారు.
తల్లి (పవిత్రా లోకేష్)తో సరైన కమ్యూనికేషన్ లేని కుర్రాడు సిద్దూ (శివ). కోరుకున్న జీవితాన్ని డిజైన్ చేసుకునే అవకాశం లేక.. ఇష్టంలేని బిటెక్ కొనసాగిస్తూ -కాలేజీలో ఐశ్వర్య (మాళివికా సతీశన్)తో లవ్‌లో పడతాడు. నాలుగేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది ఐశ్వర్య. చదువు తరువాత వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు సిద్దూ. ఈ లైఫ్‌లోకి శృతిరావ్ (వర్ష బొల్లమ్మ) ఎంటరవుతుంది. ఇద్దరి మధ్యా చెప్పుకోలేని లవ్ సాగుతోన్న ప్రాసెస్‌లో -కాలేజీనుంచే శృతి తనను ప్రేమిస్తోందన్న రహస్యాన్ని గ్రహిస్తాడు సిద్దూ. ఆ విషయం అప్పుడే శృతి ఎందుకు చెప్పలేదు? ఐశ్వర్య వెళ్లిపోవడానికి కారణమేంటి? శృతి, ఐశ్వర్యలతో సిద్ధూకున్న సమస్యేంటి? చివరికేమైంది? ఈ ప్రశ్నల కోసం సినిమా చూడకతప్పదు.
ప్రేమకథకు ఆప్ట్ టైటిల్ -చూసీ చూడంగానే. కానీ, సినిమా చూసాకే ఇందులో ఏముందన్న ప్రశ్న వెంటాడుతుంది. రెండుగంటల కథలో ప్రేమ ఓ సమస్య అనిపిస్తుందే తప్ప, అదొక అద్భుతమన్న భావన మనసుకెక్కెడా అనిపించదు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య కోసం -అర్థంలేని భావజాలం, అనవుకాని మలుపులతో ఎందుకు సాగదీస్తున్నారన్న సందేహాల వద్దే ఉండిపోతాం. పరిష్కారం కోరుకునేది ప్రేమెందుకవుతుందన్న పిచ్చి ఆలోచనలూ వెంటాడతాయి. తను ప్రేమించినోడు -ఎనిమిదేళ్ల తరువాత తనపట్ల ఆకర్షితుడయ్యాడన్న భావన కథానాయికకు కలిగినప్పటికే ఆడియన్స్‌కి విషయం అర్థమైపోతుంది..
తదుపరి కథ పూర్తి సాగదీత అని. బలవంతపు భావోద్వేగ సన్నివేశాలు -పాత్రల ఔచిత్యాన్ని దెబ్బతీయడం ఒకటైతే.. ప్రేమ విశ్వరూపాన్ని చూపించాలన్న దర్శకురాలి ప్రయోగాత్మక ప్రయత్నంలో -అయోమయానికి గురైందన్న విషయం మాత్రం ఆడియన్స్‌కి పూర్తిగా అర్థమవుతుంది.
సరైన డైరెక్టర్ చేతిలోపడితే పనికొచ్చే మెటీరియల్ అనిపించాడు శివ కందుకూరి. సినిమా మొత్తానికి ఏకైక ఆకర్షం వర్ష బొల్లమ్మ. కాలేజ్ ఎపిసోడ్‌లో సాగే లవ్ సీన్స్‌లోనే కాదు, పాత్ర తాలూకు వేదనను ఆడియన్స్‌కి సమర్థంగా కనెక్ట్ చేయగలిగింది. బోల్డ్ క్యారెక్టర్‌లో మాళవికా సతీశన్ ఓకే. మిగిలిన పాత్రల పెర్ఫార్మెన్స్ పరిధిమేరకే. సాంకేతిక విభాగాలన్నీ తమ పనితనం చూపినా -మధురభావన కలిగించేంత మెటీరియల్ కథలో లేకపోవడంతో.. ‘చూసీ చూడంగానే...’ టైటిల్ ఒక్కటే ఆహా అనిపిస్తుంది.

-వి