రివ్యూ

అంత కాదు కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఎంత మంచివాడవురా
**
తారాగణం: కల్యాణ్‌రామ్, మెహరీన్ కౌర్, తనికెళ్ల భరణి, శరత్‌బాబు, ప్రవీణ్, విజయ్‌కుమార్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, వెనె్నల కిశోర్, సుదర్శన్, భద్రం, రచ్చరవి, అన్నపూర్ణ, గిరిబాబు, నరేష్, ప్రదీప్, మురళీకృష్ణ.
సంగీతం: గోపీసుందర్
కెమెరా: రాజ్ తోట
నిర్మాతలు: ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త
సమర్పణ: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం: వేగేశ్న సతీష్
**
ఎదుటివాడు కష్టాల్లో వుంటే ఆదుకోవడం, పక్కవాడికి ఉపకారం చేయడం అన్నది భారతీయ భాషల్లోని ఏ చిత్రంలో నాయకుడికైనా వుండే ప్రధాన లక్షణం. ఆ లక్షణం తెలుగు సినిమా హీరోల విషయమైతే పెరుగన్నం- ఆవకాయ కాంబినేషన్‌లో అవిభాజ్యమైన అంశం. మరి ఇలాంటి అతి సామాన్యమైన పాయింట్ కోసం అహ్మదాబాద్ (గుజరాత్) వరకూ వెళ్లి ‘ఆక్సిజన్’ తెచ్చుకోవడంలో ఆంతర్యమేమిటో దర్శకుడు సతీష్ వేగేశే్న చెప్పాలి. కాకపోతే సాధారణంగా సినిమాల్లో ఒక్క హీరోయే మంచి పనులు చేస్తున్నట్టు చూపితే ఇందులో అవి కార్పొరేట్ స్టైల్లో సామూహికంగా చేస్తారు. ఇక కథాక్రమానికి వస్తే...
తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చనిపోతే బాలు (నందమూరి కల్యాణ్‌రామ్) బంధువులెందరో ఉండీ అనాధవుతాడు. తండ్రి స్నేహితుడి సహకారంతో చదువుకుని పెద్దవాడవుతాడు. కానీ, అంతావున్నా తనలా బంధాలకు దూరమైన వ్యక్తులకు, అనుంబంధాల మధురఫలం అందించే ఉద్దేశ్యంతో ‘ఆల్ ఈజ్ వెల్’ ఎమోషనల్ సప్లైర్స్ సంస్థ ప్రారంభిస్తాడు.
మిత్రుల తోడ్పాటుతో నెలకొల్పిన సంస్థను నడపడంలో ఎదురైన ఇబ్బందులు, విజయవంతమైన విధానం తదితరాలతో సినిమా పూర్తవుతుంది. ప్రధానంగా ఇది భావోద్వేగాలు (ఎమోషన్స్) సరఫరా చెయ్యడం కేంద్రంగా వున్న సగటు సినిమాలో తగిలే రిపీటెడ్ సీన్స్‌తో కూడిన కామెడీ (వెనె్నల కిషోర్ బృందం), జాతరలో ఐటెమ్ సాంగ్, చివర్లో ఇసుక మాఫియా గంగరాజు (రాజీవ్ కనకాల) ముఠాతో పోరాటాలూ ఉండటంతో సినిమా పల్చనైపోయింది. అనుకున్న ‘బంధాలు..’ గట్టిగా ఎస్టాబ్లిష్ అవలేదు. దానికి కొనసాగింపుగా సన్నివేశాలు కొన్నిచోట్ల సహజత్వం కోల్పోయాయి. ఉదాహరణకు ఇసుక మాఫియా వంటి క్రిమినల్ కేసు నేపథ్యంలో జైలుకెళ్లిన గంగరాజు అక్కడినుంచి వచ్చీరాగానే బాలుపై దాడికి వచ్చేస్తాడు. కానీ మామూలుగా అలాంటి తీవ్ర నేరాభియోగాలతో జైలుకెళ్లినవారు విడుదలైనా వారిపై పోలీసు నిఘావుంటుంది. ఇందులోలా వెంటనే గ్యాంగునేసుకుని దాడులు చేసే వీలుండదు. అలాగే కోర్టు సన్నివేశాలు (లఘు చిత్ర నిర్మాణంతో)లో ఒక లాయరు పాత్ర పోషించిన బాలుకు డ్రెస్‌కోడ్‌ను సరిగ్గా పాటిస్తే, ఇంకో లాయరు పాత్రకు తెల్లషర్టుకు బదులు కలర్‌షర్ట్‌ను వాడేశారు. ఇలాంటివి చిన్నగా అనిపించినా సహజత్వానికి పెద్దపీట వేసే సతీష్ వేగేశ్న ఆధ్వర్యంలో వస్తే తప్పకుండా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. అలాగే ఒకచోట సైనికుడిగా అవతారమెత్తి దానే్న కంటిన్యూ చేస్తోంటే, అన్న పాత్ర నిజం కాదేమోనని అనుమానాన్నైనా ఎక్కడా వ్యక్తం చేయకపోవడం ఉండదు. కానీ ఇందులో అలాంటివి శూన్యం. నరేష్ పాత్రకు పెట్టిన మనసులో మాటను అప్రయత్నంగా బహిర్గతం చేయడంవల్ల ఉత్పన్నమైన కామెడీ గతంలోనూ కాస్త అటూ ఇటూగా సినిమాల్లో చూసేశాం. అలాగే సెకెండాఫ్‌లో వెనె్నల కిషోర్ పాత్ర, లోపలికి వెళ్లిన బాలు, నందిని (మెహరీన్ కౌర్) ఏం చేసేసుకుంటున్నారో అన్న ఆసక్తి, ఆతృతతో బయట తలుపువద్ద అభినయం చేయడం వగైరా గతంలో రాఘవేంద్రరావు చిత్రాల్లో ఎన్టీఆర్, శ్రీదేవి లోపలికి వెళ్లి తలుపు గడియవేసుకుంటే, బయట విలన్ కమ్ కమెడియన్ పాత్రల్లోవున్న సత్యనారాయణ చేయడం చూసిన జ్ఞాపకాలు మనకు ఉన్నాయి. అదే రీతిలో వెనె్నల కిషోర్ పాత్రనుద్దేశించి మరో పాత్ర ఉందా? అసలుందా? అని పదే పదే అడగడం అలరించలేదు. బాలుగా నందమూరి కల్యాణ్‌రామ్ ఫర్‌ఫెక్ట్‌గా తన పాత్రలో చాలావరకూ లీనమయ్యాడు. కానీ అప్రయత్నంగా కళ్లు పెద్దవిచేసి చూసే ఆయన పద్ధతి కొన్ని సీన్లలో కావాల్సిన ఎమోషన్స్ పండించడానికి అడ్డొచ్చింది. అప్పటికీ ఆ లోపం కనిపించకుండా రాజ్ తోట తన కెమెరాతో ప్రయత్నించినా, కొన్నిచోట్ల సాధ్యం కాలేదు. ఇలాంటి చిత్రాల్లో నాయిక పాత్రకు అంత ప్రాధాన్యముండదు. కానీ ఇందులో మెహరీన్ పోషించిన నందిని పాత్రకు మంచి సన్నివేశాలుపడ్డాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది కూడా. రామశర్మ పాత్రను పోషించిన తనికెళ్ల భరణినే చెప్పుకోవాలి. తనకున్న అనుభవంతో పాత్రను బాగా పండించారు. గంగరాజులాంటి పాత్రలు రాజీవ్ కనకాలకు కొత్తయినా అందులో ఇమిడిపోడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. సుహాసిని ఉన్న కాసేపూ గలగలలాడుతూ తిరిగేసింది. వెనె్నల కిషోర్ తనకలవాటైన బాణీతో రోల్‌ను లాగించేశారు. సంభాషణలు చాలావరకు ప్రవచనాల రీతిలో సాగాయి. ఆ డోస్‌ను కాస్త తగిస్తే మరింత బావుండేది. వన్ లైనర్లుగా పడిన కొన్ని డైలాగులు బావున్నాయి. వాటిలో -‘ఇది కలియుగం. న్యాయం కూడా అన్యాయంవైపే వుంటుంది’, ‘మనిషిని చంపడం కాదు, సమస్యను చంపాలి’, ‘్భయం అనేది ఒకడు పెడితేపోదు, ధైర్యం అనేది ఒకడిస్తే రాదు’, ‘ఆడవాళ్ల కోరికలు ఉల్లిపొరల్లాంటివి. తీస్తున్నకొద్దీ వస్తాయి’ అన్నవి ఆకట్టుకున్నాయి. చాలాకాలానికి గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ద్వారా ఇందులో ‘ఏమో ఏమో గుండెల్లో ఏ మంధం ఉందో..’ అన్న మంచి పాట వినగలిగాం. కానీ పాట వెనుక ఇచ్చిన బీజీఎం గోపీసుందరే గతంలో ఓసారి అందించినట్టు అనిపించింది. సాహిత్యపరంగానూ ఈ పాట ఎన్నదగిన రీతిలోవుంది. కష్టాల బరువునీ తేలికపరిచే భుజం మనమవుదాం అన్న పదం పేర్కోతగ్గది. మొదటి చరణం అనంతరం వినిపించిన ఆలాపన సింగర్ బాలూకే సాధ్యమన్న రీతిలోవుంది. మున్నార్ అందాల్ని రాజు కెమెరా రమణీయంగా చిత్రీకరించింది. సెకండాఫ్ నేరేషన్‌లో దర్శకుడు సతీష్ మరికొంత శ్రద్ధపెట్టివుంటే ‘ఎంత మంచివాడవురా!’ ఫర్వాలేదుస్థాయి నుంచి అందరిచేతా మంచి చిత్రం అనిపించుకునే స్థాయికి చేరేది.
*

-అనే్వషి