రివ్యూ

ఇల్లాళ్ల ఇంటియుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** జై మమీ దీ
**
తారాగణం: సన్నీసింగ్, సోనాలీ సైగల్, సుప్రియా పాతక్, పూనమ్ థిల్లాన్, శివానీ షైనీ, శతర్ సక్సేనా, టినా భాటియా తదితరులు
బ్యాగ్రౌండ్ స్కోర్: హితేష్ సోనిక్
ఎడిటర్: చేతన్ సోలంకి
సినిమాటోగ్రఫీ: సాకేత్ షా
నిర్మాత: అంకర్ గార్గ్
దర్శకత్వం: నవజ్యోత్ గులాటి
**
ఇరుగుపొరుగులాంటి రెండు కుటుంబాల మధ్య తలెత్తే మనస్పర్థలు, చిలిపి తగాదాలే కంటెంట్‌గా ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే అదే కథని నమ్ముకొని లవ్ ఫిల్మ్ పతాకంపై నిర్మాత, దర్శకుడైన నవజోత్ గులాటి స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం -జై మమీ దీ. ఈ చిత్రాన్ని టి సిరీస్ సమర్పించింది. అందరికీ సుపరిచితమైన కథని హాస్యంతో నడిపిస్తూనే, పాత్రలమధ్య సంఘర్షణను రేకెత్తించి కథని సుఖాంతంవైపు నడిపించే రొటీన్ ఫార్మాట్‌పై దర్శకుడు ఎక్కువగానే ఊహించినట్టున్నాడు.
పక్కపక్క ఇళ్లలో నివసించే శ్రీమతి ఖన్నా (సుప్రియా పాఠక్), శ్రీమతి బల్లా (పూనమ్ థిల్లాన్)లకు అస్సలు పొసగదు. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఒకరికొకరు పోటీపడి అన్ని విషయాల్లో తమదే పైచేయి అనిపించుకోవాలని తపిస్తుంటారు. వీళ్లిద్దరి చిలిపి తగాదాలవల్ల ఇంట్లోవాళ్లు ఇబ్బందులు పడుతుంటారు. భార్యల గొంతుకు భయపడి, ఆ గొడవల్ని భర్తలు వౌనంగా భరిస్తుంటారు. ఇదిలావుంటే, శ్రీమతి బల్లా కూతురు సంజ (సోనాలీ సైగల్), శ్రీమతి ఖన్నా కొడుకు పునీత్ ఖన్నా (సన్నీ సింగ్).. ఇద్దరూ తల్లుల పగని పంచుకొని, ఒకరికొకరు ఎప్పుడు ఎదురైనా గొడవ పడుతుంటారు. ఒకే కాలేజీలో చదువుతుండటంతో, ఎప్పుడు ఎక్కడ ఎదురైనా పోట్లాడుకుంటూ అందర్నీ నమ్మిస్తారు. కానీ లోపల వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటుంటారు. చాటుమాటుగా కలుస్తూ అన్ని హద్దులు దాటేస్తారు కూడా. కాని తల్లులకు భయపడి ప్రేమ విషయాన్ని బయటకు చెప్పరు. ఇద్దరికీ వేరే వేరే వారితో పెళ్లి జరపాలని నిర్ణయించటం.. ఎంగేజ్‌మెంట్ జరిగిపోవటం.. వాళ్ల వాళ్ల తండ్రుల సాయంతో సమస్యను ఎలా పరిష్కరించుకున్నారు? ఎలా ఒక్కటయ్యారు? అసలు ఇద్దరు తల్లులూ ఒకప్పుడు ఒకే కాలేజీలో ఒకే క్లాసులో ప్రాణ స్నేహితుల్లా చదువుకుని ఎందుకు బద్ధ శత్రువులుగా మారారు? అన్న మిగిలిన కథాంశాన్ని స్క్రీన్‌పైనే చూడాలి.
**
ఇలాంటి కథలను సున్నిత హాస్యంతో డీల్ చేసిన వాళ్లున్నారు. ఇలాంటి థాట్‌నే ప్రేమగా, సీరియస్‌గా తీసినవాళ్లూ ఉన్నారు. జై మమీ దీ చిత్రాన్ని మాత్రం దర్శకుడు నవజ్యోత్ గులాటి కామెడీగానే నడిపించి చాలావరకు విజయం సాధిచాడు. సినిమాని కేవలం గంట 45 నిమిషాల్లో ముగించి సరదాగా తీసిన చిన్న సినిమా అన్నట్టే ముగించాడు. ఫన్‌ను మరింత ఆసక్తిగా చూపించే అవకాశమున్న కంటెంటే అయినా, నవజ్యోత్ రొటీన్ ఫన్‌తో ముగించటం ఆడియన్స్‌కి ఒకింత అసంతృప్తి కలిగిస్తుంది. హీరోయిన్ స్వభావాన్ని కాస్త అతిగా (సిగరెట్లు కాలుస్తూ, బాటిళ్లకు బాటిళ్లు మందు తాగినట్టు) చూపించటం ఈ కథకు ఇమడలేదు. హీరోని నిజాయితీ, సున్నిత మనస్కునిగా డిజైన్ చేయడం -కథని రక్తికట్టించే స్ట్రాటజీయే అయినా ఆ కోణంలో అతకలేదు. లీడ్‌రోల్స్ చేసిన సన్నీ సింగ్, సోనాలి సైగల్ ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు. అమ్మ పాత్రధారులిద్దరూ పరిధిలో నటించారు. ‘రంగి బిరంగ్’, ‘తోడ తా జయా’ పాటలు అర్థవంతంగా ఉన్నాయి. నేపథ్య సంగీతంతో హాస్యం ఇనుమడిస్తే, కెమెరా పనితనం సినిమాకు రిచ్‌నెస్‌ను తీసుకొచ్చింది.
సున్నితమైన సన్నివేశాలతో ఆడియన్స్‌కి ఒకింత వినోదాన్ని అందించటంలో దర్శకుడు ఓకే అనిపించుకున్నాడు. ఇంటర్వెల్ సీన్ బావుంది. హీరో హీరోయిన్లు ఇంట్లో చెప్పే ధైర్యం లేక రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకొని ఎటైనా వెళ్లిపోవాలని పథకం వేసి వచ్చేస్తారు. అయితే, రిజిస్టర్ ఆఫీసులోని అటెండర్ ఒక జంటను తిడుతుంటాడు. ‘పెద్దవాళ్లని వదిలేసి వచ్చి ఒంటరిగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లయ్యాక ఏమన్నా తేడాలొస్తే అమ్మో! పెద్దవారు లేరని ఏడుస్తారు..్ఛ’ అంటూ అరుస్తుంటాడు. ఇది విన్న హీరో హీరోయిన్ ఏడుస్తారు. వాళ్లకు అమ్మా నాన్నలు గుర్తుకొచ్చి పెళ్లి చేసుకోకుండానే ఇంటికి వస్తారు. ఇలాంటి కొన్ని సీన్స్ దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి, సినిమాను కాపాడాయి.

-మధుర మురళి