రివ్యూ

గురి తప్పిన తూటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* తూటా
తారాగణం: ధనుష్, మేఘా ఆకాష్, సునైనా, శశికుమార్, సెంథిల్ వీరస్వామి
సంగీతం: దర్బుక శివ
సినిమాటోగ్రఫీ: జామూన్ టి జాన్, మనోజ్ పరమహంస, ఎస్‌ఆర్ కథిర్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ
నిర్మాతలు: జి రామకృష్ణారెడ్డి, తాతారెడ్డి
దర్శకత్వం: గౌతమ్‌మీనన్
*
దర్శకుడిగా గౌతమ్ మీనన్ క్రియేటివిటీపై చాలామంది ఆడియన్స్‌కి ఒకింత క్రష్ ఉంటుంది. క్లాసిక్ ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న దర్శకుల్లో అతనికీ ఓ ప్లేసుంటుంది. అయితే కొంతకాలంగా సరైన సినిమాతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయలేకపోతున్న గౌతమ్ మీనన్ -్ధనుష్, మేఘా ఆకాష్‌లాంటి లీడ్ మెటీరియల్స్‌ని యాక్షన్ థ్రిల్లర్‌లో ఎలా చూపించాడన్న ఆసక్తిని -తూటా క్రియేట్ చేసింది.
రఘు (్ధనుష్) బిటెక్ స్టూడెంట్. షూటింగ్ కోసం క్యాంపస్‌కి వచ్చిన డెబ్యూ హీరోయిన్ లేఖ (మేఘా ఆకాష్)ని చూసి ఆకర్షణకు గురవుతాడు. ఇద్దరి మధ్యా లవ్ మొదలవుతుంది. హీరోయిన్ కావడం లేఖకు ఇష్టంలేకున్నా, తనను సంరక్షించిన సేతు వీరస్వామి మాట కాదనలేక వత్తిడిమేరకు ఒప్పుకుంటుంది. పైగా ఆమెపట్ల సేతు అనుచితంగా ప్రవర్తిస్తుండటంతో -తను ఇష్టపడిన రఘు ఇంటికి వెళ్లిపోతుంది లేఖ. బ్లాక్‌మెయిల్ చేసి రఘునుంచి వేరుచేసిన సేత, సినిమాల్లో నటించేందుకు ఆమెను భయపెట్టి ఒప్పిస్తాడు. అయితే, నాలుగేళ్ల తరువాత ముంబైలో ఆపదలోవున్న లేఖను రఘు అన్నయ్య గురు (శశికుమార్) కాపాడతాడు.
నాలుగేళ్లలో ఏం జరిగింది? ముంబైలో లేఖకొచ్చిన సమస్యేంటి? ఎప్పుడో ఇంట్లోంచి పారిపోయిన గురు సీన్‌లోకి ఎలా వచ్చాడు? లేఖ, రఘు, సేతువీరస్వామి కథలో గురు పాత్రేంటి? చివరికి రఘు, లేఖల ప్రేమకథ ఎలా ముగిసింది. ఈ ప్రశ్నలకు తెరపై గౌతమ్ మీనన్ చూపించిన సినిమానే సమాధానం.
ధనుష్, మేఘాఆకాష్‌లు తప్ప సినిమాలో చూడ్డానికి, చెప్పుకోడానికి ఏమీ లేదు. యంగ్ లవర్స్ మధ్య కెమిస్ట్రీని ప్రజెంట్ చేయటంలో ఇద్దరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫీల్‌గుడ్ లవ్‌ని చూపించటంలో దర్శకుడు గౌతమ్‌కు ఓ స్టయిల్ ఉంది కనుక -ఆ సన్నివేశాల్లోని ఫ్రేములన్నీ కొత్త అనుభూతినిస్తాయి. హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఎపిసోడ్స్‌లో మాత్రం గౌతమ్ స్టామినా సరిపోలేదు. ధనుష్ తన పెర్ఫార్మెన్స్‌తో సన్నివేశాలను రక్తికట్టించినా -దర్శకుడి వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో తూటా తానే అయి నడిపించేశాడు ధనుష్. మెయిన్ విలన్ సేతు వీరస్వామి పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ధనుష్ ఫ్రెండ్‌గా సునైన ఆకట్టుకుంది. పాటల్లో గౌతమ్ మీనన్ టేస్ట్ కనిపించింది. బీజీఎంతో సన్నివేశాలకు ప్రాణం పోశాడు దర్బుక శివ. క్లిష్టమైన కథకు సంక్లిష్టమైన స్క్రీన్‌ప్లే రాసుకుని -ఆడియన్స్‌కి కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాడు గౌతమ్‌మీనన్. గత చిత్రాల్లో స్ట్రెయిట్ నేరేషన్‌లోనే వైవిధ్యాన్ని చూపించిన గౌతమ్ -ఈ కథలో ప్రేక్షకులకు పజిల్స్ విసరడమే ప్రమాదం తెచ్చింది. ఫస్ట్ఫా ప్రేమ కథలో తప్పిపోయిన అన్నను మిస్టరీగా ప్రయోగిద్దామనుకున్న దర్శకుడి స్కెచ్ వర్కౌట్ కాలేదు. కథను ఫాలో కాలేక ఆడియన్స్ రిలాక్సైపోవడంతో -లాజిక్స్ వెతక్కోవడం కనిపించింది. తొలిచూపులోనే కాబోయే హీరోయిన్ కాలేజ్ స్టూడెంట్‌ని ప్రేమకు ఓకే చెప్పేయడం, ముంబై పోలీస్, మాఫియా బలాన్ని ఎదుర్కోడానికి హీరో ఒక్కడే ఎదుర్కోవడం లాంటి లాజిక్ లెస్ సీన్స్‌ని ఎంజాయ్ చేయలేకపోయారు. ఎప్పుడో ఇంటినుంచి పారిపోయిన అన్న.. ముంబైలో ఆపదలోవున్న హీరోయిన్‌ను కాపాడటంలాంటి అధివాస్తవిక సన్నివేశాలు -ఏ కాలంనాటి స్క్రీన్‌ప్లే అన్న సందిగ్దానికి దారితీస్తాయి. అవసరార్థం హీరో అన్న పాత్రను ఎలివేట్ చేసిన దర్శకుడు -కథకు అవసరం తీరిపోయాక ప్రాధాన్యత లేకుండా చేసేయడం కథపైనే ఇంపాక్ట్ చూపించింది. సెకెండాఫ్‌లో లోడెడ్ బోరింగ్‌ను భరించలేని ఆడియన్స్ -ఈ కథ ఎక్కడికెళ్తుందో చూద్దాంలే అన్నట్టే కూర్చుండిపోతారు. భావోద్వేగాలకు దూరంగా క్లైమాక్స్ సైతం సింపుల్‌గా తేలిపోవడంతో -హమ్మయ్య అనుకుంటూ థియేటర్‌నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది.
టెక్నికల్‌గా -కథకు హీరో సంగీత దర్శకుడు దర్బక శివ. మంచి బాణీలు, చక్కటి బీజీఎంతో ఆకట్టుకున్నాడు. సుదీర్ఘతకంటే గ్రిప్పింగ్‌గా యాక్షన్ థ్రిల్లర్స్‌ని చూపించాలన్న ఆలోచన తట్టివుంటే -ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ కోతను కొంత పెంచి ఉండేవాడేమో. సినిమాటోగ్రఫీ మాత్రం గౌతమ్ మీనన్ క్రియేటివిటీ, టేస్ట్‌ని ఆడియన్స్‌కి రుచి చూపించింది.
ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న గౌతమ్ -ఇటీవలి కాలంలో మొనాటనీనే క్రియేటివిటీలా ఫీలవుతున్నాడు. అందుకే గత చిత్రాల పోలికలతోనే కొత్త చిత్రాలూ ఉంటున్నాయి. తూటా చూస్తున్నపుడు సాహసం శ్వాసగా సాగిపో చిత్రం గుర్తుకు రావడానికి కారణం ఇదే. ఎంటర్‌టైన్‌మెంట్‌కి తావులేకపోవడం, కథలో డిఫరెంట్ లేయర్స్‌ని పజిల్ చేయటంలాంటి ప్రయోగాలు ఆడియన్‌కి భారంగా అనిపించాయి. ధనుష్ ఫ్యాన్స్‌కో, గౌతమ్ మీనన్ క్రియేటివిటీపై నమ్మకం కోల్పోని వాళ్లకో మాత్రమే నచ్చే సినిమా -తూటా.

-ప్రవవి