రివ్యూ

పాన్.. పండలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** అతడే శ్రీమన్నారాయణ
**
తారాగణం: రక్షిత్‌శెట్టి, శాన్వి, అచ్యుత్ కుమార్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి తదితరులు
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
సంగీతం: చరణ్ రాజ్
నేపథ్య సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
నిర్మాతలు: హెచ్‌కె ప్రకాష్, మల్లికార్జునయ్య
దర్శకత్వం: సచిన్ రవి
**
ద్విభాషా చిత్రాల నుంచి బహు భాషా చిత్ర నిర్మాణంవైపు పరిశ్రమ అడుగులేయటం ఎప్పుడో మొదలైంది. అలాంటి చిత్రాలన్నీ ‘పాన్ ఇండియా’గా చెలమణీ అయిపోతున్నాయి. ఆ పదానికి ప్రత్యేక ప్రామాణిక కొలమానాలేమీ లేవు కనుక -నాలుగైదు భాషలను టార్గెట్ చేసుకుని వస్తోన్న చిత్రాలన్నీ ఆ కోవలోకి చేర్చక తప్పడం లేదు. అలాంటి సినిమాలపై సౌత్ మోజు చూపిస్తోంది. భారీ బడ్జెట్ దాటి మరో అడుగేస్తే, దానే్న పాన్ ఇండియా ప్రత్యేక క్యాటగిరీలో చూపించుకోవచ్చు కనుక -ఆ కోణంలో సినిమా నిర్మాణాలు జోరందుకున్నాయి. గత ఏడాదిలో వచ్చిన కన్నడ సినిమా కేజీఎఫ్ సెనే్సషన్ క్రియేట్ చేయటంతో, అలాంటి అప్పీల్‌తో వచ్చిన మరో సినిమా -అతడే శ్రీమన్నారాయణ. ప్రకటించుకున్న స్టేటస్‌ను ఫలితం రూపంలో అందుకుందో లేదో సమీక్షిద్దాం.
**
అమరావతిలో ఓ నిధి. దాన్ని కొల్లగొట్టే యత్నంలో నిమగ్నమైన అభీరా తెగ. నిధిని చేజిక్కించుకోవడంలో నాయకుడు రామరామ విఫలమవుతాడు. అమరావతికి వచ్చిన ఓ నాటకం బ్యాచ్ నిధిని కొల్లగొట్టిందని తెలుసుకుని -అందర్నీ హతమారుస్తాడు రామరామ. ఆ ఇన్నిడెంట్‌తో బ్యాచ్‌లోని బ్యాండ్ మాస్టర్ మతిచలించి నాటకంలోని ఓ వాఖ్యాన్ని జపిస్తూ పిచ్చిగా తిరుగుతుంటాడు. లక్ష్యాన్ని చేధించినవాడే నాయకుడన్న నియమం మేరకు -నిధిని కొల్లగొట్టి సింహాసనాన్ని అధిష్టించమని కొడుకు జయరామకు చెబుతాడు రామరామ. నిధిని సాధించగలిగితే -తనతో దాసికి పుట్టిన కొడుకుకీ సింహాసనంపై హక్కుంటుందని చెబుతాడు. దానికి ఆగ్రహించిన జయరామ -తండ్రి ప్రాణం తీసి, అక్కడేవున్న తమ్ముడి వేళ్లు నరికేస్తాడు. సింహాసనంపై కాంక్షతో నిధిని కనుక్కునే ప్రయత్నాల్లో పడతాడు.
పదిహేనేళ్ల తరువాత -అమరావతికి కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతడే శ్రీమన్నారాయణ. రావడమే జయరామతో వైరం పెట్టుకోవడంతో -వారంలోగా నిధిని కనుక్కోకుంటే చంపేస్తానని జయరామ వార్నింగ్ ఇస్తాడు. నిధి ఆచూకీ తెలిస్తే -సింహాసనం జయరామకు వెళ్లిపోతుంది కనుక... ఆ ప్రయత్నాలు ఫలించకుండా ప్రాణాలు దక్కించుకున్న జయరామ తమ్ముడు అడ్డుపడుతుంటాడు. అసలు నిధి రహస్యమేమిటి? పిచ్చిపట్టిన బ్యాండ్‌మాస్టర్ పఠించే నాటక వాక్యంలోని అంతరార్థమేమిటి? ఈ చిక్కుముడిని శ్రీమన్నారాయణ ఎలా చేధించాడు. అభీరా కోటను నాశనం చేసి -రహస్యంగా బతుకీడుస్తున్న నాటకం బ్యాచ్ కుటుంబాలను ఎలా రక్షించాడన్నది మిగతా కథ.
పాన్ ఇండియా అన్నందుకు సినిమా నిర్మాణ విలువలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. టెక్నీషియనే్ల సినిమాకు ఆ స్టేటస్‌నిచ్చారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీతో కర్మ్ చావ్లా సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాడు. కూర్పులో తెగింపు లేదు. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాను ఆడియన్స్‌కి పూర్తిగా చూపించేయాలన్న తపనే -నిడివిని పెంచేసింది. ఒకటి రెండు ఎపిసోడ్స్‌ని పూర్తిగా తప్పించివుంటే -స్క్రీన్‌ప్లేలో బిగింపుండేది. లోక్‌నాథ్ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మరో ప్లస్ అయ్యాడు. పాటల్లో టైటిల్ సాంగ్ మాత్రమే కనెక్టవుతుంది. ‘పాన్ ఇండియా’ అన్న టాగ్‌లైన్‌కు ముందే ఫిక్సయ్యారు కనుక -అవసరంలేని ఫ్రేమ్స్‌లోనూ వందలాది ప్యాడప్ ఆర్టిస్టులు చిరాకుపెడతాడు. పుష్కర్ ఫిలిమ్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో వెనకాడలేదన్న విషయం ఇలాంటి సన్నివేశాలతోనే అర్థమవుతుంది. ‘పెద్ద సినిమా’ తపననుంచి దర్శకుడు సచిన్ బయటకు వచ్చివుంటే -అతడే శ్రీమన్నారాయణ మరో రేంజ్‌లో ఉండేదే. మూడేళ్ల కష్టాన్ని మూడు గంటలపాటు చూపించాలన్న ఆలోచనే దెబ్బతీసింది. పాన్ ఇండియా సినిమాకు తగిన సెటప్, కంటెంట్, అరేంజ్‌మెంట్స్ అన్నీ ప్రీ ప్రొడక్షన్స్‌లో చేసుకున్నా -అమలులో మాత్రం వైఫల్యమే కనిపించింది. సన్నివేశాల్లో దర్శకత్వ ప్రతిభ ద్యోతకమైనా, స్క్రీన్ ప్లేలో శృతిమించిన ట్విస్ట్‌లు, పజిల్స్ ఆడియన్‌ను డిస్ట్రర్బ్ చేస్తాయి. సినిమా మొదలైన పది నిమిషాల్లో ఆడియన్స్‌ని కథలో కూర్చోబెట్టాల్సిన దర్శకుడు -పజిల్స్ మీద పజిల్స్ ప్రయోగించటంతో కథాసారం పల్చనైపోయింది.
రక్షిత్ పెర్ఫార్మెన్స్ బావుంది. హీరోయిజంలోనే కామెడీ చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. కాలమానం, ప్రాంతంతో సంబంధంలేని ఫాంటసీ కంటెంట్ కావడం -పాత్ర పరుగుకు అవకాశమిచ్చింది. కథా వాతావరణానికి మాత్రం రక్షిత్ అప్పియరెన్స్ అస్సలు సింక్ కాదు. కథను మలుపుతిప్పే పాత్ర శాన్వికి దక్కడంతో -సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. శ్రీమన్నారాయణ అసిస్టెంట్‌గా అచ్యుత్‌కుమార్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టిలు మెచ్చతగిన నటన చూపించారు.
అందరికీ కనెక్టయ్యే ఫాంటసీ కథనే ఎంచుకున్నా -ఆసక్తికరంగా చెప్పడమన్న ‘అతి’ కొంపముంచింది. ఉత్కంఠను ఫీలయ్యేలోగా కొత్త పజిల్ ఆడియన్స్ ముందుకు రావడం, అయోమయంలోనూ భారీ రన్ టైమ్ భరించాల్సి రావడమే -సినిమా తక్కువ కావడానికి కారకాలయ్యాయి. డ్రామా పల్చనై లాజిక్స్‌ని వెతుక్కునే అవకాశం ఆడియన్స్‌కి రావడంతో -కంటెంట్‌లోని ఫీల్ దూరమైపోయింది. దీనికిమించి ఏ కాలంలో జరిగిన కథో అర్థంకాదు. కథా వాతావరణంలో కనిపించే కన్నడ నేటివిటీ కూడా తెలుగు ఆడియన్స్‌కి నచ్చదు. కాకపోతే -్భరీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ సినిమాకు మంచి లుక్‌నిచ్చాయి. సినిమా మొత్తంలో అనుసరించిన కలర్ టింట్ -చారిత్రక కథలాంటి మూడ్‌నిచ్చింది. ఓవరాల్‌గా అతడే శ్రీమన్నారాయణ -గ్రాండియర్‌గా ఉన్నాడు. పాన్ ఇండియా ఫీల్‌ని మాత్రం ఇవ్వలేకపోయాడు.

-విజయ్‌ప్రసాద్