రివ్యూ

ఊహాతీత వెటకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* అమ్మరాజ్యంలో కడప బిడ్డలు
*
తారాగణం: అజ్మల్ అమీర్, ధనుంజయ్ ప్రభునే, ధీరజ్ కెవి, బ్రహ్మానందం, అలీ, పృథ్వీ, ధనరాజ్, స్వప్న, కత్తి మహేష్, దివ్య, సత్యకృష్ణ తదితరులు
రచన: రామ్‌గోపాలవర్మ, కరుణ్ వెంకట్
సంగీతం: రవిశంకర్
కెమెరా: జగదీష్ చీకటి
నిర్మాతలు: టి నరేష్‌కుమార్, టి శ్రీ్ధర్,
దర్శకత్వం: సిద్ధార్థ్ తాతోలు.
*
చాలాకాలం నుంచి సినిమాల గురించి ఓ వాదం ఉంది. అసలు సినిమా అన్న ప్రక్రియ సృజనాత్మక రూపమా? వ్యాపార ప్రతీకా? అని. కొందరు ఈ వాదానికి మధ్యేమార్గంగా, ఒకింత అందంగా ‘సృజనాత్మక వ్యాపారం’ అన్నారు. అయితే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మాత్రం ‘ఊహాత్మక వ్యాపారం’ కేటగిరీలోకి నిక్షేపంగా చేర్చేయవచ్చు. ఎందుకంటే సినిమా ఆరంభానికి ముందే ఈ చిత్రం ఎవరినీ ఉద్దేశించింది కాదు. నిర్మాతల ‘ఊహల్లోంచి ఉద్భవించినది’ అని రాశారు. ఏతావాతా పోలికలు కనిపిస్తే ‘యాదృచ్ఛికమే’ అని తేల్చేశారు. ఇకపోతే మామూలుగానే కథకు కాళ్లూచేతులూ ఉండవంటారు. ఇక కథేలేని ఊహల్లోంచి పుట్టుకొచ్చిన తతంగంగా తేల్చేశారు. కనుక ఇందులో సన్నివేశాలకి ఎలాంటి ఆనకట్టలూ లేవు. వాస్తవానికి ఇందులో కథగా చెప్పుకోవడానికీ ఏం లేదు. ఏవేవో సన్నివేశాలు సమకూర్పే ఇందులో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో వెలుగుదేశం, ఆర్సీపీ పార్టీ, మనసేన పార్టీలు పోటీచేస్తే ఆర్సీపీ ఘన విజయం సాధించి ఆ పార్టీ నాయకుడు విఎస్ జగన్నాథ్‌రెడ్డి (అజ్మల్ అమీర్) ముఖ్యమంత్రి అవుతాడు. అప్పటివరకూ ముఖ్యమంత్రిగా ఉన్న వెలుగుదేశం నేత బాబు (్ధనుంజయ్ ప్రభునే) తీవ్ర బాధ, ఆగ్రహంతో ఉంటాడు. సహజంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సాగే ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సాగుతుంది. తర్వాత బాబుకి అత్యంత సన్నిహితుడైన దయానేని రమ హత్యకు గురవుతాడు. దీనె్నవరు చేశారు? తదితర ప్రశ్నలకు సమాధానాన్ని రామ్‌గోపాలవర్మ పోకడలో చెప్పడంతో సినిమాకు ఎండ్‌కార్డ్ పడుతుంది. ఈమధ్యలో గత ముఖ్యమంత్రి తనయుడు ఆకాష్ (్ధరజ్ కెవి) ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న కలలు కల్లలయిపోతే రోధించిన తీరూ, పీపీ జాల్ ఎపిసోడ్ మొదలైన వాటితో సినిమాకున్న రెండుగంటల పైబడి నిడివినీ అయిందనిపించారు. అసలెంతగా ఇవన్నీ ఊహాజనితమనుకున్నా, కళ్లముందు కనపడే సంగతుల తీరుతెన్నుల్ని మరీ ఇంత అవగాహనాలేమితో తీయడం, అదీ రాంగోపాల్‌వర్మ వంటి అనుభవజ్ఞుడైన సినీక్రాఫ్ట్‌మెన్ ఆధ్వర్యంలో రావడం విషాదకరం. ఉదాహరణకి అసెంబ్లీ స్పీకర్ (అలీ) టేబుల్‌పై ద్రాక్షపళ్లు ఉంచడం, వాటిని ఆయన తింటున్నట్టు చూపడం వంటివి ఏపాటి అవగాహన క్రిందకొస్తుంది? అలాగే ఒక సిబిఐ ఆఫీసరు (కత్తి మహేష్)తో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా మాట్లాడడం ఎక్కడైనా జరుగుతుందా? ఆఖరికి కంటిన్యుటీ అంశాన్ని పట్టించుకోకుండా ముందు ఓచోట పదవిలోకొచ్చి పది నెలలు అయిందనడం, తర్వాత ‘మూడునెలలు అయిందనడం’ లాంటివీ ఇందులో యధేచ్ఛగా దొర్లాయి. అదేవిధంగా సిట్ ఆఫీసర్ (స్వప్న) పాత్రనీ చాలా హాస్యాస్పదంగా చిత్రీకరించారు. ఎంతగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అని సరిపెట్టుకున్నా ఎంచుకున్న అంశంపట్ల సీరియస్‌నెస్ లేకపోవడం దారుణం. అసలు ‘ఎంటర్‌టైన్‌మెంట్’ కంటెంట్ పండాలన్నా సీరియస్ ఎఫర్ట్ అవసరం. ఆ టైప్ ఎఫర్ట్ ఇందులో చాలావరకూ కనపడలేదు. ఎంతసేపు నటీనటుల మేనరిజమ్స్, ఇమిటేషన్స్ మీద దృష్టిపెట్టారు తప్ప, వాటిలో ‘ఆత్మ’ ఎంతవరకూ ఉందన్న దానిమీద సరైన ఫోకస్ పెట్టలేదు. కానీ పైన చెప్పుకున్న అనుకరణ, బాడీలాంగ్వేజీ వరకూ ప్రధాన కళాకారులందరూ సమర్ధవంతంగా నటించేటట్టు చేయడంలో దర్శకుడు సిద్ధార్థ తాతోలు కృతకృత్యులయ్యాడు. ముఖ్యంగా జగన్నాథరెడ్డి పాత్రధారి అజ్మల్ అమీర్ ప్రశంసనీయంగా నటించాడు. బ్రహ్మానందం ఈ పాత్ర ఎందుకు ఒప్పుకున్నారో ఆయనే చెప్పాలి. అంత అప్రాధాన్యంగా ఈ రోల్‌ని డిజైన్ చేశారు. ఫస్ట్ఫా అంతా రాజకీయ పోకడలతో నడిచి సెకండాఫ్ మర్డర్ ఇన్విస్టిగేషన్‌తో నడవడంతో అసలీ సినిమా ఎటుపోతోందో అన్న దానిపైన క్లారిటీ లేకుండాపోయింది. ఓ సందర్భంలో బ్రహ్మానందం వింతపోకడల్ని చూపి, అతని భార్య పాత్రధారిణి సత్యకృష్ణ ‘అసలు’ మీరేం చేస్తున్నారో మీకు అర్ధమవుతోందా? అని ప్రశ్నిస్తుంది. సినిమా చూసి ఇదే ప్రశ్న ఇంకో కోణంలో ప్రేక్షకుడు వేసుకునే స్థాయికి సినిమా తీసుకువెళ్లింది. సాధారణంగా ఈ టైపు చిత్రాల్లో సంభాషణలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఆ మాదిరి పంచ్‌లూ ఇందులో లోపించాయి. ‘ఇక్కడెలాంటి పంచాయితీల్లేవు డిసైడ్‌మెంట్లే’ లాంటివి తప్ప. రవిశంకర్ స్వరాల్లో రామ్‌గోపాలవర్మ పాడిన ‘చంపేస్తాడు..’ అన్న పాట ఉంది. ఐటెమ్‌సాంగ్ పెట్టకపోతే ఫీచర్ సినిమాకు ఫ్యూచరేం ఉంటుంది? అన్న భావనతో పెట్టిన ‘రంజుమీద పుంజూ’ అన్న పాట పెట్టారు. అదీ అలరించలేదు. ఈ పాట ప్లేస్‌మెంట్ కూడా రాంగోపాలవర్మ స్వరంతోనే ‘ఆ రౌడీలిద్దరూ ఇప్పుడో ఐటెంసాంగ్ ఏర్పాటు చేసుకున్నారు’ వంటి వ్యాఖ్యతో వచ్చింది. ఆఖర్లో రాంగోపాలవర్మే స్వయంగా ‘రాజకీయాల్లోనైనా, మీడియాలో అయినా సినిమా అయినా ప్రజలకు కావల్సింది కేవలం ఎంటర్‌టైన్‌మెంటే’ అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. సినిమాలవరకూ ఎంటర్‌టైన్‌మెంట్ కానె్సప్టుని చాలావరకూ అంగీకరించినా, మిగతా రెండు వ్యవస్థల్నీ పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ వరకే పరిమితం చేయడం ఎంతవరకూ భావ్యమో వర్మే చెప్పాలి. ఆయా సీజన్లకి ఆయా తరహా చిత్రాలు వచ్చిన జాబితాలో (రాంగోపాలవర్మే గతంలో రక్తచరిత్ర, వంగవీటి, బెజవాడ రౌడీలు, లక్ష్మీస్ ఎన్టీఆర్.. మొదలైనవి) ‘అమ్మరాజ్యంలో...’ కూడా చేరిందన్నదే మనం ఇక్కడ చెప్పుకోవడం వినా అంతకుమించి చెప్పుకోవడానికేం లేదు ఇందులో.

-అనే్వషి