రివ్యూ

ఇద్దరూ.. పర్ఫెక్ట్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** మిస్‌మ్యాచ్
**
తారాగణం: ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్, ప్రదీప్ రావత్
సంగీతం: గిఫ్టన్ ఇలియాస్
సినిమాటోగ్రఫీ: గణేష్‌చంద్ర
నిర్మాతలు: జి శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్
దర్శకత్వం: ఎన్‌వి నిర్మల్‌కుమార్
**
భిన్న వాతావరణాల్లో.. విరుద్ధ భావాలతో పెరిగిన ఇద్దరు ప్రొఫెషనల్స్ మధ్య ఆకర్షణ -ప్రేమగా అంకురిస్తే?
సత్తావున్న దర్శకుడి బుర్రలోకి ఈ థాట్ ఎంటరైతే -అదిరిపోయే ప్లాట్‌ను అద్భుతమైన క్లాసిక్‌గా మార్చే ప్రయత్నం చేస్తాడు. ఎవర్‌గ్రీన్ ఐడియా తట్టిన వెంటనే డైరెక్టర్ నిర్మల్ సైతం అలాగే ఆశించివుంటాడు. అందుకే -ఆఘమేఘాలమీద కథల్లుకుని, ప్రాజెక్టును డిజైన్ చేశాడు. అదే -‘మిస్‌మ్యాచ్’.
ఇంతవరకూ ఓకే. కాకపోతే -క్లాసిక్ ఐడియా వచ్చిందన్న కంగారులో దర్శకుడు ఓ విషయాన్ని మ్యాచ్ (పోలిక) చేసుకోవడం మర్చిపోయాడు. ఈ థ్రెడ్‌మీద ఇదివరకే వచ్చిన సీన్స్, సినిమాలను వెనక్కెళ్లి చూసుంటే బావుండేది. అలా చూస్తే -13ఏళ్ల క్రితమొచ్చిన బొమ్మరిల్లు కనిపించి ఉండేది కూడా. భాస్కర్ అనే కుర్ర దర్శకుడు -‘మిస్‌మ్యాచ్’ థాట్‌ని అప్పట్లోనే తనదైన స్టయిల్లో బొమ్మరిల్లుగా చూపించాడు. ‘కండిషన్డ్ ఫాదర్ లవ్‌తో నలిగిపోయే కొడుకు కథ’లా పిక్చర్ ఇచ్చినా -మూలం మాత్రం మిస్‌మ్యాచ్ అప్లికేషనే. సిద్ధార్ధ్, జెనీలియా, ప్రకాష్‌రాజ్, కోటచుట్టూ కథను తిప్పి -ఎమోషనల్ స్క్రీన్‌ప్లేతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు బొమ్మరిల్లు భాస్కర్. ఇంచుమించు అదే థాట్. అంతే థ్రెడ్. సేమ్ సెటప్. బట్, డైరెక్టర్ మారాడు. అదే మూలాన్ని అతనిదైన శైలిలో విస్తరించారు. ‘బొమ్మరిల్లు’ కథను ‘మిస్‌మ్యాచ్’ అప్లికేషన్‌లో దర్శకుడు నిర్మల్ చెబితే ఎలావుంటుందో చూడాలంటే -‘మిస్‌మ్యాచ్’ మాత్రం మిస్సవ్వొద్దు.
మిస్‌మ్యాచ్‌లో లీడ్‌రోల్స్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై జి శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్‌లు నిర్మించిన సినిమా. ఈ ‘మ్యాచ్’ను రక్తికట్టించే ప్రయత్నం చేసిన దర్శకుడు నిర్మల్‌కుమార్.
కథేంటంటే..
తెలివైన కుర్రాడు సిద్దూ (ఉదయ్ శంకర్). కండిషన్డ్ పెంపకంతో -ఆ తెలివికి పదునుపెట్టి జీనియస్‌ని చేస్తాడు తండ్రి. మెమరీ పవర్‌లో గిన్నిస్ రికార్డు సిద్దూ ఎబిలిటీ. పర్యావరణ పరిరక్షణ కోణంలో -రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అన్నది అతని కేపబిలిటీ. మరోవైపు -తిరుగులేని వస్తాదు (ప్రదీప్‌రావత్) కూతురు కనకమహాలక్ష్మి (ఐశ్వర్య రాజేష్). స్కూల్లో ఓ ఇన్సిడెంట్ -ఆమెను చదువుకు దూరం చేసి కుస్తీకి దగ్గరచేస్తుంది. ఆమె ‘పట్టు’కు తండ్రి పొంగిపోతాడు. వారసురాలు దొరికిందన్న ఆనందంతో తర్ఫీదునిస్తాడు. అలా అతను సాధించలేకపోయిన ఒలింపిక్ గోల్డ్ మెడల్‌వైపు -‘మహా’ ప్రయాణం మొదలవుతుంది.
ఇలా భిన్న వాతావరణంలో, విరుద్ధ్భావాల మధ్య, వైవిధ్యమైన జీవన శైలితో ‘ప్రొఫెషనల్స్’గా ఎదిగిన ఇద్దరూ -యూత్ సమ్మిట్‌లో కలుస్తారు. అట్రాక్టవుతారు. ఒకరినొకరు కోరుకుంటూ -చివరకు లవ్‌లో పడతారు. ఈ ఎదురెదురు దిక్కులు ఎలా కలిశాయి? ఎక్కడివరకూ జర్నీ చేశాయన్నదే -మిస్‌మ్యాచ్ మిగతా కథ.
పొంతనలేని ‘ప్రొఫెషనల్స్’ మధ్య ప్రేమ పండాలంటే -ఎలాంటి స్ట్రగుల్స్‌ని అధిగమించాలో తనదైన స్టయిల్లో చూపించాడు దర్శకుడు నిర్మల్‌కుమార్. ఇద్దరూ తారసపడ్డాక.. ఒకర్నొకరు చూసుకున్నాక.. ఇద్దరూ కలుసుకున్నాక.. ఒకర్నొకరు కోరుకోవడం వరకూ -లైటర్‌వీన్ ఫన్‌తో ఎంటర్‌టైనింగ్‌గా కథ చెప్పటంలో నిర్మల్ సక్సెసయ్యాడు. వాళ్ల ఇష్టాలు ఇముడ్చుకోలేని ప్రపంచంలోకి ఇద్దరూ అడుగుపెట్టాక -నడిపించాల్సిన ఎమోషనల్ స్టోరీని బ్యాలెన్స్ చేయటంలో మాత్రం ఫెయిలయ్యాడు. అందుక్కారణం -ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ని వేస్ట్ సీన్స్ డామినేట్ చేయటమే. అసలు కథలోని గాఢత ఆడియన్స్‌కి అందకుండా అవే అడ్డుపడ్డాయి. హీరో హీరోయిన్లను పరిచయం చేసే క్రమంలో వచ్చే ఓవర్‌లాపింగ్ సీన్స్, లీడ్‌రోల్స్ మధ్య వైరుధ్యం బలంగా ఎలివేట్‌కాకుండా అడ్డుపడ్డాయి. హీరో హీరోయిన్ల మధ్య డిజైన్ చేసిన క్యూట్ లవ్ సీన్స్ -సినిమాకు ఓవిధంగా మైనస్సే. ఫీల్‌గుడ్ సీన్స్‌తో.. ఇద్దరూ త్వరగా లవ్‌లో పడితే బావుండన్న మూడ్‌కి ఆడియన్స్ వచ్చేయటంతో -‘మిస్‌మ్యాచ్’ మెయిన్ కంటెంట్ మిస్సైంది. అంటే.. మొదలుపెట్టాల్సిన కథను ఇంటర్వెల్‌కు తెచ్చేసిన స్క్రీన్‌ప్లే సెటప్ -మిస్‌మ్యాచ్‌కు ఓ మైనస్.
సెకెండాఫ్‌లో -కాలుష్యాన్ని వెదజల్లే సిమెంట్ ఫ్యాక్టరీ ఎపిసోడ్‌ను కథలోకి లాక్కొచ్చారు. అది హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి చేసుకున్న సెటప్పే తప్ప కథకు ఆప్ట్ అనిపించలేదు. అదే ట్రాక్‌ను.. డిస్ట్రబెన్స్ లేకుండా లవ్‌స్టోరీకి కనెక్ట్ చేయడంలో నిర్మల్ సక్సెస్ అయినా.. అదీ ఫలితాన్నివ్వలేదు. అసలు కథనుంచి పక్కకు జరగని సీన్స్ రాసుకునివుంటే -మిస్‌మ్యాచ్ మూడ్ మరింత స్ట్రెగ్దెన్ అయ్యేది. హీరో హీరోయిన్ల క్రైసిస్, కుస్తీగేమ్‌లోని ఉత్కంఠ సన్నివేశాల్లో దర్శకుడి కొత్త స్ట్రాటజీ ఏమీ కనిపించదు. ప్రీక్లైమాక్స్‌లో ‘బొమ్మరిల్లు’ ప్యాట్రన్ దించేయడం మరో తప్పిదం.
డైరెక్టర్ ఫెయిల్యూర్స్‌పై ఆడియన్స్ అటెన్షన్ పోకుండా -పెర్ఫార్మెన్స్‌తో హీరో హీరోయిన్లు బలమైన ప్రజెనే్స ఇచ్చారు. -మిస్‌మ్యాచ్‌కు వీళ్లే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించారు. హీరో ఉదయ్ శంకర్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌తో లవ్‌లోపడే సీన్, కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో మంచి నటన చూపించాడు. మాసీ ఇమేజ్‌కోసం పాకులాడే హీరో సీన్స్‌కు పోకుండా ఉండుంటే -ఆడియన్స్ నుంచి మరింత అప్లాజ్ వచ్చుండేదే. కుస్తీగాళ్ ఇంప్రెషన్ ఇచ్చేందుకు ఐశ్వర్య పడిన కష్టం స్క్రీన్‌పై కనిపించింది. ముఖ్యంగా ‘అంతర్మథనాన్ని అణచుకుంటూ.. పైకి పిచ్చినవ్వు నవ్వే పెంకి పిల్ల’గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి -మిస్‌మ్యాచ్‌కు టోటల్ స్ట్రెంగ్త్ అయ్యింది. ఆహార్యంలో, భావోద్వేగ సన్నివేశాల్లో ఐశ్వర్యను చూస్తే -సౌత్ కాజోల్ టాగ్ తగిలించటంలో తప్పేం లేదనిపిస్తుంది. లవ్ ప్రపోజల్‌ను సింప్లిఫై చేయటంలో -దర్శకుడి మూడ్‌ని అచ్చంగా స్క్రీన్‌పై చూపించగలిగింది ఐశ్వర్య. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తిన్యాయం చేశారు.
సినిమాకు ప్రాణం పోసేంత గొప్పగా లేకున్నా -గిప్టన్ ఇలియాన్ మ్యూజిక్ ఓకే. గణేష్‌చంద్ర సినిమాటోగ్రఫీ ‘మిస్‌మ్యాచ్’ మూడ్‌ని పెంచలేదు. కొన్ని సన్నివేశాలను రియలిస్టిక్‌గా చిత్రీకరించటంలో సక్సెస్ అయ్యాడు. కొన్ని ఫ్రేమ్స్‌లో ‘లవ్’కి బ్యూటీని తీసుకొచ్చే విజువల్స్ చూపించగలిగాడు. ఎడిటర్ నిఖార్సుగా పనిచేసి సాగదీత సీన్స్‌ని కోసేస్తే -కంటెంట్ మూడ్ మరింత బలంగా ఆడియన్స్‌ని రీచయ్యేదే. బడ్జెట్ విషయంలో నిర్మాతలు జి శ్రీరామ్‌రాజు, భరత్‌రామ్‌లు కాంప్రమైజ్ కాలేదన్న విషయం సినిమా క్వాలిటీయే చెప్తోంది. ఎన్‌వి నిర్మల్‌కుమార్ కేర్ తీసుకునివుంటే ‘బొమ్మరిల్లు’కి పార్లల్‌గా ‘మిస్‌మ్యాచ్’ ఉండి ఉండేది.

-విజయ్‌ప్రసాద్