రివ్యూ

ఇదో వీధి భాగోతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు
*
తారాగణం: శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్య, వెనె్నల కిశోర్, రఘుబాబు, ప్రవీణ్, సమీర్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, నవీన్, డాలీషా తదితరులు
సంగీతం: సాకేత్ కొమాండూరి
కెమెరా: భరణి కె ధరన్
నిర్మాత, దర్శకుడు: శ్రీనివాసరెడ్డి
*
‘కొండండ రాగం తీసినా పిసరంత పాటుండాలిగా’ అని పెద్దలు అంటూంటారు. అలాగే చిత్రం మొత్తం నవ్వులపూత పూసామని అనుకున్నా దానికి అనుసంధానంగా ఉండాల్సిన కథ పిసరంతైనా ఉంటే ‘్భగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ కొంతైనా ప్రభావం చూపగలిగేది. ఆ అంశం ఏకోశానా లేకపోవడంతో ఈ నవ్వులు ఆద్యంతం నవ్వులపాలయ్యాయి.
శీను (శ్రీనివాసరెడ్డి), జోజో (సత్య), పీటర్ (షకలక శంకర్) మంచి స్నేహితులు. ముగ్గురూ ఇప్పటి ట్రెండైన షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. ఆక్రమంలో వారికి మాదక ద్రవ్యాల వ్యాపారుల అంశాలు తారసపడతాయి. ఆ చిక్కుల్లోంచి వారెలా వేరు పడ్డారు? అన్నది ఇందులోని ముఖ్యాంశం. అసలు ఈ మాదిరి డ్రగ్స్, తదితర విషయాలు, ఇందులో స్పృశించిన కామెడీ, ఆల్రెడీ సవాలక్ష సినిమాల్లో వచ్చేసి ప్రేక్షకులకు చిరపరిచితమైంది. మరి దీంట్లోంచి ఏస్థాయి ఆదరణను ఎలా దర్శక నిర్మాత శ్రీనివాసరెడ్డి ఆశించారో? ఎందుకంటే, తొలుత చూపించిన శాంతి స్వరూప్ వార్తా తతంగం నుంచి శ్రీను చేసిన ‘పదహారేళ్ల వయసు’ తమిళచిత్రంలోని కమలహాసన్ అనుకరణలాంటి సీన్లు వరకూ ఎన్నో సినిమాల్లో చూసేయడంతో ఏ ఒక్క సీన్ కామెడీ కిక్కు కాదు కదా ఆ టింజ్‌నూ సరఫరా చేయలేదు. ప్రాథమికంగా సృజనాత్మక ప్రక్రియలో ఏ సీనూ తిరిగి చూస్తే అది రక్తికట్టదు. అది కామెడీ సీనయితే ఏ రకమైన అనుకూల ఫలితమూ ఇవ్వదు. మరి వెంటవెంటనే రిపీట్ అయితే రావాల్సిన కామెడీ బదులు ఘోరమైన ట్రాజెడీ పుట్టుకొస్తుంది. అదే ఈ సినిమాలో జరిగింది. సెకెండాఫ్‌లో ముగ్గురు స్నేహితులు రసగుల్లాలు తినే సీన్ తీసుకుందాం. జోజో రసగుల్లాలు తినీ తినీ అందులో కలిపిన విరేచన మందు ప్రభావంతో అతిగా నీరసపడతాడు. దానివల్ల నవ్వు, ఏడుపుల సంకేతాలను నోటితోకాక పొట్టలోని శబ్దాల ద్వారానే ఇస్తాడు. ‘వాడు చూసావా? ఎలా చేస్తున్నాడో’ లాంటి మాటలు వెంట వెంటనే వచ్చేస్తాయి. ఇలాంటివి చూడడంవల్ల ప్రేక్షకుల స్పందన ఫేవర్‌బుల్‌గా ఎలా వుంటుందని చిత్ర బృందం ఆశించిందో అన్నది ఊహకందని విషయం. ఇక షకలక శంకర్ పాత్ర.. ఝాన్సీ తదితరులు పాల్గొన్న ‘బ్రతుకు ఎడ్లబండి’ ఎపిసోడ్‌లో స్ర్తి పాత్రనుద్దేశించి వాడిన భాష.. అల్పస్థాయి ప్రమాణాలకు పరాకాష్ట. ఓపక్క మహిళలపట్ల చూపాల్సిన గౌరవం, శ్రద్ధగురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంటే, ఈ మాదిరి భాషను వాడటం విచారకరం. ఇదేదో నాలుగు నిమిషాల హాస్యం కోసం అనుకోవచ్చు కానీ, ఇది మంచి సంకేతం కాదు. సన తదితరులు పాల్గొన్న సీన్లో పీటర్ పాత్ర ద్వారా వాడిన ద్వందార్థ సంభాషణలూ చీప్ టేస్ట్‌ను తెలియజేశాయి. ఉండటానికి దాదాపు తెలుగు చిత్రసీమలోని అందరు హాస్యనటులూ ఉన్నారు. కానీ ఏ పాత్రకీ సరైన ఉనికి లేకుండాపోయింది. ప్రతీ పాత్రా ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటుంది. దీనివల్ల ఆడియెన్స్‌కి సినిమా చూస్తున్న భావనకాక పెద్ద తెరపై చూస్తున్న చిన్నతెర ‘జబర్దస్త్’ అనిపించింది. ఇందులో జబర్దస్త్‌లో నటించిన ఆర్టిస్టులూ చాలామంది ఉన్నారు. శ్రీనివాసరెడ్డికి నటుడిగా మంచి టైమింగ్‌తో కామెడీని పండించగల ప్రతిభవుంది. దాన్ని ఇందులో మరోసారి వెదజల్లారు. అలాగే షకలక శంకర్ తన బ్రాండ్ ఉత్తరాంధ్ర యాసను పలికించి నవ్వించడానికి ప్రయత్నం చేశారు. ఏసీపీ స్వతంత్ర కుమార్‌గా వెనె్నల కిశోర్ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు చెందిన స్ఫూఫ్స్‌ను చిలికించారు. అయితే ఇంతమంది ఉద్దండపిండ హాస్యనటులున్నా అదంతా బలంగా ప్రేక్షకుల్ని చేరకపోవడనికి కారణం ముందే చెప్పుకున్నట్లు బలహీనమైన కథాసూత్రం. సత్య జోజోగా తనకలవాటైన నటనను మరోసారి తిరగమోత వేశారు. ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్టుగా డాలీషా పాత్ర పరిమితం. సంభాషల్లో క్షుణ్ణం, సున్నం అంటూ వదిలిన పదాలు బాగున్నాయి. అలాగే ఫ్రెండ్‌షిప్‌లో ఫ్రస్టేషన్ ఏమిట్రా అన్నదీ బాగా కుదిరింది. పాటలే తక్కువ- ఉన్నవాటిలో ముగ్గురు స్నేహితులపై తీసిన మొదటి పాటకు సాకేత్ ఇచ్చిన ట్యూన్స్ సోసోగా ఉంది.
సినిమా నిడివి రెండు గంటలలోపే అయినా ఎంతో పెద్ద సినిమా చూస్తున్న భావన కలగడానికి ప్రధాన కారణం ఎడిటింగ్ విభాగం పనిలోపం అనుకోవాలా? ఏదేమైనా నవ్వించడం ఒక యోగం అన్నట్టుగా, అలాంటి యోగాన్ని సరైన సాధన చేయకుండా ప్రదర్శనకు పూనుకుంటే ఎలాంటి గమ్మత్తూ ఎవరిలోనూ కలగదనడానికి నిదర్శనం భాగ్యనగరం.. అన్నది మాత్రం చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కరలేదు. అయితే శ్రీనివాసరెడ్డి లాంటి ప్రతిభవున్న హాస్యనటుడు తన దర్శక ఉత్సాహాన్ని కాలంతో కలిసే స్కీమ్‌తో ప్రయాణం చేసి అందుకు తగినట్టు చిత్రాలు అందిస్తే మంచి గమ్మత్తులు చేయడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి.

-అనే్వషి