రివ్యూ

2గంటల గండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* రాగల 24 గంటల్లో..
*
తారాగణం: సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరామ్, మస్కాన్, రవివర్మ, రవిప్రకాష్, ప్రణీత్, వినీత్, అద్వైత్, మానిక్‌రెడ్డి తదితరులు
సంగీతం: రఘు కుంచె
కెమెరా: గరుడవేగ అంజి
నిర్మాత: శ్రీనివాస్ కానూరి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌రెడ్డి
*
‘రాగల 24 గంటల్లో..’ ఈ పదం వాతావరణంలో రాబోయే ఇరవై నాలుగ్గంటల్లో వచ్చే మార్పునంచనా వేస్తూ ప్రసారమాధ్యమాల్లో మనందరికీ చిరపరిచితమైంది. వాతావరణంలో వచ్చే క్షణక్షణ మార్పులాగే, సినిమాలో ఆ తరహా మార్పులే వచ్చి ఏ సన్నివేశంలోనూ కుదురులేక, సన్నివేశాలకు సరైన కనెక్షన్ లేక తేలిపోయింది. అంతిమంగా పేరులోవున్న ఉత్సుకత సినిమాలో లేకుండా పోయి ఆడియెన్స్‌కి నిరాశ మిగిల్చింది.
అత్యున్నత స్థాయి ఖ్యాతిపొందిన యాడ్ ఫిలిమ్ ఫొటోగ్రాఫర్ రాహుల్ (సత్యదేవ్) ఒక సందర్భంలో అనాధాశ్రమంలో పిల్లలకు ఆలనా పాలనా చూస్తున్న విద్య (ఈషా రెబ్బ)ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. వైవాహిక జీవితంలో భర్తలో తరుచూ మారే ప్రవర్తనవల్ల విసిగిపోతుంది విద్య. విద్యతోవున్న పడకగది సన్నిహిత సీన్స్‌ను వీడియో చేసుకుని వీక్షిస్తూ వున్న రాహుల్ నేచర్‌ను అసహ్యించుకుంటుంది. జరిగినదానికి సారీ చెప్పడంతో సర్దుకుంటుంది విద్య. తరువాత తనకీ, చిన్ననాటి స్నేహితుడు గణేష్ (గణేష్ వెంకట్రామన్)కీ మధ్యవున్న అనురాగాన్ని శంకించి రాహుల్ వేధించటం మొదలెడతాడు. చివరకు ఆ వేధింపులు.. ‘నువ్వు న్యూడ్ ఫొటోషూట్ చెయ్యాలి’ అని రాహుల్ విద్యను ఆదేశించటంతో పతాకస్థాయికి చేరతాయి. తరువాతి పరిణామాల్లో రాహుల్ హత్యకు గురవుతాడు. ఆ హత్య ఎవరు చేశారు? నిజంగా విద్య చెప్పినట్టు ఆమే చేసిందా? మరెవరైనా చేశారా? అన్న శోధనతో 24 గంటల కథ ముగింపుకొస్తుంది. దర్శకుడిగా శ్రీనివాస్‌రెడ్డి తనకలవాటైన కామెడీ జోనర్ నుంచి కొత్తదనం కోసం థ్రిల్లర్ విభాగానికి రావడం హర్షణీయమైనా, ఎంచుకున్న కథనాన్ని పర్ఫెక్ట్‌గా చెప్పడంలో విఫలమయ్యారు. ప్రధానంగా ముందేం జరుగుతుందోనన్న ఉత్కంఠ కావాలి. అది ఇందులో శూన్యం. విద్య ఏ సందర్భంలోనూ రాహుల్‌ని హత్య చెయ్యదు అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో వుంది. దానిక్కారణం ఆమె ఎంటరైన మొదటి సీన్లోనే అమాయక ప్రాణి మేకపిల్ల.. వాహనం క్రింద పడకుండా రక్షించిన వైనమే తెలుపుతోంది. మరెవరు చేశారా? అన్నదానిలో కథలో కల్పించిన సీన్స్ ఏవీ ప్రేక్షకుడు విశ్వసించే స్థాయిలో లేవు. రాహుల్‌ను దేశంలోనే సంపన్నురాలైన ఓ యువతి పెళ్లి చేసుకుంటానన్న ప్రపోజల్ చేస్తుంది. కానీ ‘నాకు నా వెంటపడే అమ్మాయి కాదు, నేను వెంటపడే అమ్మాయి కావాలి’ అని తిరస్కరిస్తాడు. అలాంటి రాహుల్ ఆర్థిక కారణాల ద్వారా విద్యను వివస్తగ్రా ఫొటో షూట్ చెయ్యమనడం అతని స్వభావానికి విరుద్ధం. ప్రవర్తనలు తరచూ మారేవే అయినా కీలకమైన ‘్ధనం’ అంశానే్న కాదన్న అతను, దాని కోసమే అవాంఛిత దిశగా వెళ్లాడనడం అసహజం. అంతకన్నా వేరే కారణం ఏదైనా పెట్టవల్సింది. సాధారణంగా కెమేరా వంటి సృజనాత్మక రంగంలోవున్నవారు సెన్సిబుల్‌గా ఉంటారు. రాహుల్ తరహా వికృతత్వానికి ఆస్కారం లేదు. ‘నేను ప్రతిదీ లెన్సులో చూస్తాను’, ‘నా మూడో నేత్రం కెమెరా’ అంటూ అతని వ్యక్తిత్వాన్ని సంభాషణల ద్వారా చెప్పిస్తారు. ఈ రెండింటిమధ్యా పొంతన కుదరక చాలా కృతకంగా వుంది. ఇక ఏసీపీ నరసింహం (శ్రీరామ్) పాత్ర మరో విచిత్రం. తొలుత చాలా మంచివాడిగావుండి తర్వాత రాహుల్, మరో మోడల్ (మస్కాన్) విషయంలో చేసిన బీభత్సకాండలో సహాయపడి ఆమెను చంపేయడాలు చేయడం అన్నది కేవలం ఏదో అందరూ ఊహించని ట్విస్ట్ చూపామన్న భావనతో చేసినట్టుంది తప్ప, వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. ఆ కేసు విషయంలోనూ మోడల్ మేఘనతోవున్న ముగ్గురు స్నేహితులన్నీ అక్రమంగా జైల్లో వేసేయడం కూడా కుదరదు. ఎందుకంటే హత్యకు వేలిముద్రలు, సాక్ష్యాలూ అవసరం. అసలా వేలిముద్రల తతంగాన్ని రాహుల్ విషయంలో వివరంగా చూపిన దర్శకుడు, ఆ మోడల్ హతమైన విధంలో, ఆ తరహా సాక్ష్యాలమీద ఎందుకు దృష్టి పెట్టలేదో అర్థంకాదు. అన్నిటికన్నా ఆశ్చర్యకర విషయం- విద్య ఆ హత్య చేయకపోయినా, హత్య ఎవరు చేశారన్న అంశం తెలియడానికి కీలకమైన రాహుల్ శవం తగులబెట్టడానికి ముగ్గురు ఖైదీలకు సహాయం చేయడం తదితర నేరాలు కూడా తీవ్రమైనవే. అందుకామె శిక్షార్హురాలన్న అంశాన్ని ఎక్కడా ఇందులో స్పృశించలేదు. ఇన్ని అవకతవకలతో థ్రిల్లింగ్ ఎవరికి కలుగుతుందో దర్శకుడు ఒక్కసారి ఆలోచించి వుంటే సీన్స్ పోకడ ఇలా వుండేది కాదు. సత్యదేవ్‌కిచ్చిన శాడిస్టు నేచర్‌ని ఆయన బానే ప్రతిఫలింపజేసినా, కథనంలోవున్న లూజ్ ఎండ్స్‌వల్ల ఆకట్టుకోలేదు. విద్యగా ఈషారెబ్బ రాహుల్ వర్ణించినట్టు అద్భతమైన సహజ అందంతో కన్పడింది. కానీ సన్నివేశాల్లో భావ ప్రకటనకు అవకాశమున్న సందర్భాలప్పుడు సరైన విస్తృతిని కనపర్చకపోవడంవల్ల ఇవి రాణించలేదు. చాలాకాలానికి తెలుగు తెరపై కనబడిన శ్రీరామ్ తనకిచ్చిన పోలీసధికారి పాత్రను సునాయాసంగా చేసేశాడు. అభాసుపాల్‌గా కృష్ణ్భగవాన్ పోషించిన పాత్ర పేరుకు తగ్గట్టే అభాసుపాలైంది. ఆ పాత్రకు రాసిన ‘ఆయన, పక్కింటాయన ఒకటే’, ‘అక్రమ సంబంధం -ఆవకాయ బిర్యాని భలే బాగుంటాయి’ మాటలు వెగటు కలిగిచాయి (ఈ సినిమాకు సంభాషణాకర్త కృష్ణ్భగవానే). అయితే ఆయనే రాసిన ఇతర సంభాషణలు కొన్ని బాగున్నాయి. ‘నువ్వనుకుంటున్నది ఫన్ కాదు పోర్న్’, పాషన్- కంపేషన్ వంటివి బావున్నాయి. అలాగే ఒక సన్నివేశంలో విద్య- గణేష్‌తో ప్రేమ- గిఫ్ట్ గురించి వర్ణించి చెప్పినవీ బాగున్నాయి. మస్కాన్, గణేష్ వెంకట్రామన్ పోషించిన పాత్రల పరిధి తక్కువ. రఘు కుంచె స్వరాల్లో ‘నారాయణతే నమో నమో’ పాట.. తొలుత ఆ సాంగ్‌కున్న అలవాటైన తీరులోనే సాగినా తర్వాత చరణాల్లో పలికించిన గమకాలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం కీలకం కనుక రఘు దానిపైనే ఎక్కువ కసరత్తు చేసినట్టు కనిపించింది. అయితే అలా చేసిన ప్రయత్నం కొన్నిచోట్ల మరీ లౌడైంది. ప్రాథమికంగా కెమెరామెన్ అయిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి, అదే ప్రధాన అంశంగా మర్డర్ మిస్టరీని ఎంచుకున్నా, అందుకవసరమైన రిథిమ్‌లో జాగ్రత్తలు తీసుకునుంటే రాగల..ను ప్రతిగంటా గుర్తుంచుకునేవారం.

-అనే్వషి