రివ్యూ

తోవ తప్పిన తోలుబొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* తోలుబొమ్మలాట
*
తారాగణం: రాజేంద్రప్రసాద్, విశ్వంత్, హర్షిత, వెనె్నల కిశోర్, దేవీప్రసాద్, నర్రా శ్రీనివాస్ తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు: దుర్గాప్రసాద్ మాగంటి
దర్శకత్వం: విశ్వనాథ్ మాగంటి
*
నానాటి బతుకు నాటకం. అందులో మనం తోలుబొమ్మలం’ అనే కానె్సప్ట్‌తో రాజేంద్రప్రసాద్ లీడ్‌రోల్‌లో తెరకెక్కిన చిత్రం -తొలుబొమ్మలాట. విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి హీరో హీరోయిన్లు. మాగంటి విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
వూళ్లో అందరి మంచి కోరుకునే పెద్ద సోడాల రాజు అలియాస్ సోమరాజు (రాజేంద్రప్రసాద్). మనవరాలు వర్ష (హర్షిత), మనవడు రిషి (విశ్వంత్)కి ముడిపెడితే.. చిలకా గోరింకల్లా కళ్లముందే కలకాలం ఉంటారని ఆశపడుతుంటాడు సోమరాజు. పిల్లలెప్పుడూ తనవద్దే సంతోషంగా ఉండాలన్నది ఆయన ఆశ. తన ఆశను నెరవేర్చుకోడానికి ప్రయత్నాలు మొదలెడతాడు సోమరాజు. ఆ క్రమంలో తలెత్తిన నాటకీయ పరిణామాల మధ్య ఆకస్మికంగా కన్నుమూస్తాడు సోమరాజు. ఆశ నెరవేరకుండా కన్నుమూసిన సోమరాజు -ఆత్మగా తిరిగొస్తాడు. అప్పటికి పిల్లల మధ్య ఆస్తి గొడవలు తలెత్తుతాయి. పిల్లల నిజ స్వరూపాలను ఆత్మ స్వరూపంతో చూస్తాడు సోమరాజు. ఆ పరిణామాలు సోమరాజును ఎంత బాధించాయి? పిల్లల్లో మార్పు కోసం ఏం చేశాడు? ఆ విషయంలో ఎవరు సహకరించారు? పిల్లలు మారారా? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
సోమరాజులాంటి తాత పాత్రలు తెలుగు తెరకు కొత్తకాదు. అలాంటి బరువైన పాత్రలు పోషించటం రాజేంద్రప్రసాద్‌కూ కొత్తకాదు. అందుకే సోమరాజు పాత్రకు రాజేంద్రప్రసాద్‌ను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అలాగే, దగ్గరి కుటుంబాల మధ్య చిన్న చిన్న విషయాలే ఎలా అపోహలకు దారితీస్తాయి, అంతలోనే చోటుచేసుకునే అభిమానాలు, ఆత్మాభిమానాలను చక్కగా ఎలివేట్ చేశాడు. కుటుంబ భావోద్వేగాలు, డబ్బు అవసరాల కోసం బంధుత్వాలే ఎలా మారిపోతున్నాయి అన్న కోణాన్నీ చూపించే ప్రయత్నం చేశాడు. రాజేంద్రప్రసాద్, అతని పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఓకే.
రాజేంద్రప్రసాద్‌కు సోమరాజు పాత్ర టైలర్‌మేడ్ అయ్యింది. సినిమా మూలాన్ని హావభావాల్లో పలికించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. రాజేంద్రప్రసాద్ తరువాత తన టైమింగ్‌తో సినిమాలో నవ్వులు పండించిన పాత్ర వెనె్నల కిషోర్‌దే. దేవీప్రసాద్ నెగెటివ్ షేడ్స్ వర్కౌట్ కాలేదు.
హీరోగా విశ్వంత్, హీరోయిన్‌గా హర్షితకు అద్భుతమన ఎమోషన్స్ పలికించే అవకాశం వచ్చినా -వీక్ పెర్ఫార్మెనే్స వారిలో కనిపించింది. ధన్‌రాజ్, నర్రా, శ్రీనివాస్‌లది పాత్రోచిత నటన.
మానవ సంబంధాల్లోని గొప్పతనాన్ని చూపాలన్న దర్శకుడి ప్రయత్నం ఉన్నతమైనదే అయినా, అందుకోసం అల్లుకున్న సన్నివేశాల్లో పట్టుచిక్కలేదు. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను చాటిచెప్పే పిట్ట కథలు తెలుగు సాహిత్యంలో ఎన్నో. కథ, కథనాలతో ఆ గాఢతను అందుకోలేకపోయాడు దర్శకుడు. సద్ది సరుకు సన్నివేశాలు ఆడియన్స్‌కు ఉత్సుకతను ఇవ్వలేకపోయాయి. సినిమాను నడపాలి కనుక.. కమర్షియల్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉండాలి కనుక.. -హీరో హీరోయిన్ల ఫ్లాష్‌బ్యాక్, అందులోవచ్చే సన్నివేశాలతో దర్శకుడు కాలక్షేపం చేసినట్టే అనిపిస్తుంది. కమర్షియల్ కామెడీపై దర్శకుడు దృష్టిపెట్టడంతో అనవసర సన్నివేశాలు ఎక్కువై -అసలు కథ పట్టాలు తప్పేసింది. కథకు బలోపేతం చేసే సీన్స్ తగ్గిపోయి.. ప్రేమ, ఫ్యామిలీ సీన్లు పెంచేశారు.
సెకెండ్ హాఫ్ మొత్తం సాగదీతే అనిపిస్తుంది. ట్రిమ్ చేసివుంటే ఫీల్ మరోలా ఉండేదేమో. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథాస్థాయికి తగ్గట్టే ఉన్నాయి.
మాయమవుతోన్న మానవ ధర్మాన్ని మరోసారి గుర్తు చేయాలన్న దర్శకుడి సంకల్పం ఎంత బలంగావుందో, కథ అంత బలహీనంగా అల్లడంతో -పప్పెట్ షో ఫలించలేదు.
*