రివ్యూ

ఎండు చేపల కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు చేపల కథ * బాగోలేదు
*
తారాగణం: అభిషేక్, ఆయేషాసింగ్, భానుశ్రీ, మేఘనా చౌదరి, సునీల్‌కుమార్
సంగీతం: కవిశంకర్
సినిమాటోగ్రఫీ: ఆర్లీ
నిర్మాతలు: జీవిఎన్ శేఖర్ రెడ్డి
దర్శకత్వం: శ్యామ్ జె చైతన్య
*
ఆమధ్య దర్శకుడు మారుతి ‘ఈ రోజుల్లో’ తెచ్చినపుడు -సినిమాలో ఇంత బూతా? అంటూ.. అంతా వేళ్లమధ్య ఖాళీలుపెట్టి కళ్లకు చేతులడ్డంపెట్టారు. సినిమా హిట్టయ్యింది. తరువాత ఆ బూతులోనే వేదాంతాన్ని వెతుక్కున్నాం. కారణం -దర్శకుడి నిజాయితీ. పుటాకార కటకంలో దృశ్యాన్ని.. కుంభాకార కటకంలో శబ్దాన్ని పెట్టి -దర్శకుడు కనికట్టు చేశాడు. ఆడియన్స్‌ని అదోరకం మూడ్‌లో కూర్చోబెట్టి -కథలోని భావోద్వేగాన్ని చెప్పాల్సిన టైంలో చెప్పాడు. నిజానికి ‘అలాంటి’ సినిమా ఆశించేవాళ్లకు ‘ఎలాంటి’ సినిమా చూపించాలో అప్పట్లోనే బాగా స్టడీ చేసుంటాడు మారుతి. అందుకే -‘నా ఎక్స్‌పోజర్ కోసం చేసిన సినిమా’ అంటూ తరువాతి కాలంలో మారుతి కాస్త సిగ్గుగా చెప్పుకున్నాడు. కాకపోతే -తర్వాత్తర్వాత సినిమాల్లో బూతు మాయమై.. బూతే సినిమాలవ్వడానికి ‘ఆ రోజే’ కారణమవుతుందని ఊహించివుండడు.
సరిగ్గా -ఏడు చేపల కథ దర్శకుడు శ్యామ్ జె చైతన్య అదే విషయాన్ని ప్రస్తావించాడు. సినిమా ప్రమోషన్స్‌లో చైతన్య -‘ఇలా చెప్తేనే.. నేను చెప్పాలనుకున్న అసలు విషయాన్నీ చూస్తారన్న ఆలోచనతో చేసిన సినిమా’ అంటూ చెప్పుకొచ్చాడు. అక్కడ మారుతి ‘అడల్ట్’ని శ్రవణానికే పరిమితం చేశాడు కనుక సేవైపోయాడు. ఇక్కడ చైతన్య ‘కంటెంట్’ని దృశ్యం చేయడంతో -సెన్సార్‌కి బలైపోయాడు.
తాలింపు: ‘యూత్‌లోని శృంగార భావోద్వేగాలను టార్గెట్ చేసే సినిమా. అందుకే వాళ్లనే చూడమని చెప్తున్నా’ అంటూ దర్శకుడే చెప్పాకున్నాడు కనుక -దీన్ని బూతు సినిమా అనడంలో తప్పేం లేదు. పైగా చిన్నపిల్లలు చూడొద్దంటూ సెన్సార్ సైతం ‘ఏ’ ధృవీకరణనిచ్చింది కనుక -ఆ కోణంలోనూ ‘ఆ.. కంటెంట్’ సినిమా అనడంలో అస్సలు తప్పులేదు.
సినిమాలో ఆత్మల ఆవాహన వుంది. అంటే -హారర్. మరోవైపు తలసీమియాతో బాధపడే హీరో ఉన్నాడు. అంటే -పేథోస్. ఇంకోవైపు తన గర్భానికి కారణాన్ని వెతుక్కునే హీరోయిన్. అంటే -సస్పెన్స్. మూడు జోనర్లను ముడేసి ‘ఏడు చేపల కథ’ చెప్పే ప్రయత్నం ఈ సినిమా. అద్భుతమైన ఆలోచనే. కాకపోతే అభ్యంతరకరంగా తెరకెక్కడంతో -సినిమా సీదేసింది.
అన్ని తిరుగుళ్లూ తిరిగేసి -ఆఖర్న అన్యాయమైపోతారనే ఉదాత్త సందేశాన్నిచ్చే సినిమాలు ఒకప్పుడు.. మ్యాట్నీ- ఫస్ట్ షో మధ్య టైంలో థియేటర్లలో పడేవి. ఆ బాపతు సినిమాలు ఏరితెచ్చిన మసాలా క్లిప్పింగ్‌ల సమాహారంగా ఉండేవి. ఇది మాత్రం షూట్‌చేసిన మసాలా క్లిప్పింగ్‌ల సమాహరంగా ఉంది. అంతే తేడా.
బ్లడ్ కోసం బరితెగించి సెక్స్‌కి సిద్ధపడే పాత్ర -కథకు లీడ్ కావడమే సినిమాకు పెద్ద డామేజ్. ఆత్మల ఆవాహనాంశాన్నీ దానికి జోడించటంతో-దిక్కుమాలిన సినిమాగా తయారైంది. కథేంటో చూద్దాం.
టెంప్ట్ రవి (అభిషేక్ పచ్చిపాల)కి తలసీమియా. నెలకోసారి కొత్త బ్లడ్ మారుతుండాలి. లేకుంటే పోతాడు. అంత ప్రాణాపాయ వ్యాధిలోనూ -పాప కనిపిస్తే మాత్రం టెమ్టవుతుంటాడు. -‘టెంప్ట్ రవి’ కంటపడినోళ్లూ.. వాళ్లకు తెలీకుండానే రాత్రికి వచ్చి రవికి లొంగిపోతుంటారు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ రవి ప్రేమికురాలు భావన (ఆయేషా సింగ్)కూ ఎదురవుతుంది. దీనివల్ల రవి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రవిని చూసి ఎవరెవరో ఎందుకు టెమ్టవుతున్నారు? ఆత్మలతో రొమాన్స్‌కు ఎగబడే శాడిస్ట్ సుందరానికి మెయిన్ స్టోరీతో లింకేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలను అనేకానేక కన్ఫ్యూజన్స్‌తో దర్శకుడు డిజైన్ చేసిన సినిమా ఇది.
**
ఏడు చేపల కథ టీజర్, ట్రైలర్లను యూట్యూబ్‌ల్లో చూసి ఏదేదో ఊహించేసుకుంటే -అందుకు బాధ్యులు ఆడియనే్స. ఎందుకంటే సహజంగా కలిగే ఊహల్లోని ఎలిమెంట్స్ ఎక్కడా స్క్రీన్‌పై అగుపించవు. అర్థంకాని అడల్డ్ సినిమాకు వచ్చామన్న విషయం -ఆరంభం నుంచే అర్థమవుతుంది. అడల్డ్ సినిమాలపై ఆసక్తిని రేకెత్తించేంత లోతైన సన్నివేశాలను ‘ఏసీకే’ టీం ఎసరుపెట్టినా -అసలు సెన్సారైపోయి ఆద్యంతాలే మిగలడంతో అడల్డ్ మూడ్డే ఆవిరైపోతుంది.
బూతునే సినిమా చేస్తున్నామన్న స్పృహలో సన్నివేశాలు రాసుకోవడంతో -కథాపరమైన కంటెంట్ ఇసుమంతా మిగల్లేదు. అందుకు తగ్గట్టే కన్ఫ్యూజ్ డ్రామాలో కథనమూ కలుషితమైపోయింది. ఏ సీన్ ఎందుకో.. వాటి కనెక్టివిటీ ఏమిటో? అర్థంకాగ ఆడియన్స్ ‘సీనొస్తే’ చాల్లేనని గుడ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి. కథలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ సెక్స్‌కి బలైపోవడంతో -అడల్డ్ ట్రాక్ మొత్తం అనాసక్తిగా సాగి, ఏ పాత్రకూ జస్ట్ఫికేషన్ లేకుండాపోయంది.
లీడ్‌రోల్‌లో అభిషేక్ పచ్చిపాల ఓకే అనిపించాడు. తనకున్న బలహీనతనుంచి పుట్టుకొచ్చే సన్నివేశాల్లో ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఇచ్చాడు. ఓ పాటతో లీడ్‌రోల్స్‌ని పరిచయం చేయడం చిన్న వెరైటీ. ఆయేషా సింగ్, భానుశ్రీ, మేఘనా చౌదరి ఇలా అమ్మాయిల పాత్రలన్నీ.. తమ ‘మెటీరియల్’తో టైటిల్ జస్ట్ఫికేషన్ కోసం మొహమాటపడకుండా మెప్పించారు. క్లైమాక్స్‌లో ఆడియన్స్ మూడ్‌కి విరుద్ధంగా ఎమోషనల్ సీన్స్ వెళ్లిపోతుంటే.. చూడక తప్పదన్న భావనకు గురవ్వడం ఖాయం. నచ్చినట్టు నటించే స్వేచ్ఛ మిగతా ఆర్టిస్టులకు దక్కడం వాళ్లు చేసుకున్న అదృష్టం.
సినిమా స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవడంతో -సినిమాటోగ్రాఫర్ ఆర్లీ, సంగీత దర్శకుడు కవిశంకర్ పనితనం పనికిరాకుండా పోయింది. సినిమాపరంగా కాకున్నా, వ్యక్తిగతంగా వాళ్లకు మంచి మార్కులు పడతాయేమో. సీన్స్‌కి టెమ్టవ్వకుండా.. ఎడిటర్ తన విద్యను ప్రదర్శించివుంటే -ఆడియన్స్‌కి కాస్త రిలీఫ్ ఇచ్చి ఉండేవాడు. నిర్మాణ విలువలకు ఎక్కడా ఢోకా లేదు. పైగా -ఇలాంటి సినిమాలు తీయాలనుకునే వర్థమాన నిర్మాతలకు నిర్మాతగా శేఖర్‌రెడ్డి ఒకింత ధైర్యమిచ్చినట్టే.
చివరిమాట..
టీజర్‌తో సెగలు పుట్టించిన ఏడు చేపల కథ -స్క్రీన్‌కొచ్చేసరికి ఎండు చేపల కథగా మిగలడం.. సినిమాపై ఆసక్తి చూపించిన ఆడియన్స్ చేసుకున్న దురదృష్టం.

-మహాదేవ