రివ్యూ

నిఖార్సయిన ఖైదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైదీ *** బాగుంది
***
తారాగణం: కార్తి, నరైన్, రమణ, జార్జిమారియన్, ధీన, హరీశ్ ఉత్తమన్,
సంగీతం: శామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యం
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
బ్యానర్: డ్రీమ్ వారియర్స్
నిర్మాత: ఎస్‌ఆర్ ప్రభు
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
***
పోలీసుల స్వాధీనంలోవున్న 900 కేజీల డ్రగ్స్‌ని తిరిగి తెచ్చుకోడానికి స్కెచ్ బిగించిన డ్రగ్స్ రాకెట్. -క్రైమ్ ఎలిమెంట్.
ఎలావుంటుందో చూడనైనా చూడని పదేళ్ల కూతుర్ని చూడ్డానికి పదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని బయల్దేరిన ఖైదీ. -ఎమోషనల్ కంటెంట్.
ఎమోషనల్ థాట్‌ని యాక్షన్ క్రైమ్ ఫ్రేమ్‌లోకి సెట్ చేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. రెండు డార్క్ షేడ్స్‌కి ‘నాలుగ్గంటలు’ టైమ్ ఫ్రేమ్ ఫిక్స్‌చేసి -నిఖార్సయిన థ్రిల్లర్‌ని రుచి చూపించాడు. అదే -ఖైదీ. కార్తి మెటీరియల్‌కు కరెక్ట్‌గా సెట్టైన కథ.
పదేళ్ల శిక్ష అనుభవించి బయటికొచ్చిన ఖైదీ ఢిల్లీ (కార్తి). అప్పటి వరకూ చూడనైనా చూడని పదేళ్ల కూతుర్ని కలవడానికి ఆమెవుండే అనాథ శరణాలయానికి బయల్దేరతాడు. అదే టైంలో డ్రగ్ డీలర్ ఆది శంకరం (హరీశ్ ఉత్తమన్)కు చెందిన 900 కేజీల మాల్‌ను పోలీసులు చేధిస్తారు. సీజ్ చేసిన మాల్‌ను ఎస్పీ ఆఫీస్‌లో పెడతారు. డ్రగ్స్ కోసం మాఫియా ఆపరేషన్ మొదలవుతుంది. సీజ్ చేసిన ఆఫీసర్లనూ లేపేయడానికి ఆదిశంకరం టీం సీన్‌లోకి దిగుతుంది. మాఫియా స్కెచ్‌లో ఇరుక్కున్న పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీ సాయం కోరతారు. కూతురి భవిష్యత్‌ను కనెక్ట్ చేసి రిక్వెస్ట్ చేయటంతో -్ఢల్లీ తనకు సంబంధంలేని సీన్‌లోకి వస్తాడు. ఈ వార్ ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్న కథనాన్ని మాత్రం స్క్రీన్‌పై చూడాలి.
తండ్రీకూతుళ్ల కథకు.. పోలీస్ -మాఫియా కోణాన్ని లాక్ చేసి సినిమా నడిపించాడు దర్శకుడు. సినిమా అన్న విషయాన్ని మర్చిపోయి -తన మైండ్ స్టోరీనే స్క్రీన్‌పై చూపించటంలో దర్శకుడు సక్సెస్. బలమైన కథకి ఆసక్తికరమైన కథనం తోడవ్వడంతో -ప్రేక్షకుడు కుర్చీల అంచున కూర్చోక తప్పలేదు.
**
కార్తి కెరీర్‌లో ఖాకీ మంచి సినిమా. నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా జెన్యూనిటీ చూపించాడు. అదే ఇప్పుడు ఖైదీకి కలిసొచ్చింది. కెరీర్ గ్రాఫ్‌ని మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. ఇందులో ఖైదీ నిజాయితీకి ఆడియన్స్ ఫాటైపోతారు. హీరోయిన్ ఏది? పాటలెక్కడ? కామెడీ కిక్‌లేదు.. అన్న ఆలోచనల్ని ఆడియన్స్ మైండ్‌కి దూరంగా ఉంచటంలో కథనంతో కనగరాజ్, పెర్ఫార్మెన్స్‌తో కార్తి కనికట్టు చేసేశారు.
రెండు బ్లాక్ షేడ్స్‌ని ఒక ఇన్సిడెంట్‌కి కనెక్ట్ చేసి -రెండు గంటలపాటు ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయటం ఆషామాషీ కాదు. అయితే కథ మొత్తాన్ని నైట్ మోడ్‌లో డిజైన్ చేయడం -దర్శకుడి పని సగం సులువైంది. కూతుర్ని కలవడానికి ఓ ఖైదీ ఆదుర్దా.. పోలీసుల కోసం ప్రాణాంతక మాఫియా ముఠాతో పోరాటం.. ఆ ప్రయత్నంలో ప్రాణమే పోవచ్చనే భయం.. తన కోసం ఎవరో వస్తున్నారని తెలిసి అనాథ శరణాలయంలో ఎదురుచూసే కూతురు.. డ్రగ్స్‌కి కాపలాగా ఒకే కానిస్టేబుల్.. అదే బంగ్లాలోని సెల్‌లో కరుడుగట్టిన నేరస్థులు.. కేసు విషయంపై వచ్చి ఇరుక్కుపోయిన కాలేజ్ స్టూడెట్స్.. పోలీస్ టీంలో మాఫియా కోవర్ట్.. మాఫియాలో పోలీస్ ఇన్ఫార్మర్.. -ఇలా ఒకే ఇన్సిడెంట్ చుట్టూ థ్రెడ్స్ అల్లుతూ ప్రేక్షకుల్లో ఉత్కంఠ, ఉద్వేగాలను రేకెత్తించే ప్రక్రియలో దర్శకుడు కనగరాజ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.
సినిమా ప్రమోషన్స్ టైంలోనే కార్తి ఓ మాటన్నాడు. ‘నానుంచి సినిమా అంటే వైవిధ్యాన్ని కోరుతున్నారు ఆడియన్స్. అది మిస్సవ్వకూడదనే -క్యారెక్టర్ కంటే కంటెంట్‌పై ఫోకస్ పెట్టాను’ అని. ఖాకీకంటే మంచి పేరు తెస్తుందన్న నమ్మకాన్నీ వ్యక్తం చేశాడు. కార్తి నమ్మకం వమ్ముకాలేదు. పదేళ్ల కూతురికి తండ్రిగా, పదేళ్లు జైలు అనుభవించిన ఖైదీగా -పర్ఫెక్ట్ మెటీరియల్ అయ్యాడు. అప్పియరెన్స్, బాడీ లాంగ్వేజ్ -సినిమాకు పూర్తి బలమయ్యాయి. కూతుర్ని కలవాలన్న తండ్రిలోని ఉద్వేగం.. పోలీస్‌ని రక్షించాలన్న మానవతా దృక్పథం.. -రెంటినీ ఒకేసారి చూపించటంలో కార్తి సక్సెస్ అయ్యాడు. యాక్షన్‌లో హీరోయిజాన్ని, ఎమోషన్‌లో కన్నీటిని -ఒకేసారి రుచి చూపించాడు. సిన్సియర్ కాప్ క్యారెక్టర్‌లో నరైన్.. నిజాయితీ కానిస్టేబుల్‌గా జార్జి మరియన్ -కార్తిని మించి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లీడ్‌రోల్‌లో కార్తివున్నా -వీళ్లిద్దరూ హీరోలేనన్న భావన కలుగుతుంది ఆడియన్స్‌కి.
ఇన్ని ప్లస్‌లకి టెక్నికల్ టీం బోనస్ అయ్యింది. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్స్, సత్యన్ సూర్యం డార్క్ ఫొటోగ్రఫీ -సినిమాకు హైలెట్. ఆఫ్ స్క్రీన్‌లో వీళ్లే హీరోలయ్యారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఓకే అనిపించుకున్నా -మరికొంత షార్ప్‌నెస్ చూపించివుంటే మరింత బావుండేది. కథను పరిగెత్తించటంలో దర్శకుడు కనగరాజ్ క్లారిటీని మాత్రం పూర్తిగా అందుకున్నాడు ఫిలోమిన్ రాజ్. యాక్షన్ కొరియోగ్రఫీ సహజత్వానికి దగ్గరగా ఉండటం మరో ప్లస్. హీరోయిన్ లేదు. ఓ సాంగ్ లేదు. కితకితలుపెట్టే కామెడీ లేదు. పైగా డే ఎఫెక్ట్ అన్నదే ఉండదు. ఓ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన మెటీరియల్ ఏదీ లేకున్నా -యాక్షన్, ఎమోషన్‌లోనే అన్ని టేస్ట్‌లూ చూపించి ఆకట్టుకున్నాడు -ఖైదీ. ఒక్కమాటలో చెప్పాలంటే -నిఖార్సయిన ఖైదీ వీడు.

-ప్రవవి