రివ్యూ

స్వదేశీ ఉగ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బందోబస్త్ ** ఫర్వాలేదు
**
తారాగణం: సూర్య, మోహన్‌లాల్, సాయేషా సెహగల్, బొమన్ ఇరానీ, ఆర్య, చిరాగ్‌జాని, సముద్రఖని, పూర్ణ తదితరులు
సంగీతం: హారిస్ జయరాజ్
కెమెరా: ఎంఎస్ ప్రభు
నిర్మాత: సుబాస్కరన్
దర్శకత్వం: కెవి ఆనంద్
**
‘లోకాన దొంగలు వేరే లేరయా.. దూరాన ఎక్కడినుంచో రారయా..’ అనే ఓ పాత తెలుగు పాట గతంలో విన్నదే. ఈ చిత్రం చూస్తుంటే ఈ పాటే గుర్తొస్తుంది. ఉగ్రవాదులు ఎక్కడో పాకిస్తాన్ నుండి సరిహద్దుల మీదుగా దాటి భారతదేశం వచ్చి ఉగ్రదాడులు చేస్తున్నారన్న అనేక వార్తలు చూస్తూనే వుంటాం. అయితే అన్ని దాడులు పక్కదేశాలనుండి వచ్చిన ఉగ్రవాదులు చేస్తున్నవి కాదని, భారతదేశంలో కూడా కంటికి కనిపించని ఉగ్రవాదులు సృష్టించే మారణహోమం కూడా పక్క దేశాల ఖాతాలోనే పడిపోతోందని, తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని ఈ చిత్రం చర్చించే ప్రయత్నం చేసింది. కాకపోతే ఫ్లైఓవర్లు ఎక్కువైపోయి కథ నేలమీదకు రాకుండా పుట్టిలోనే కలిసిపోయింది.
కథ
సామాన్య రైతుగా పరిచయమైన రవికిషోర్ (సూర్య), ఆ తరువాత ప్రధానమంత్రి ప్రధాన అంగరక్షకుడిగా మారతాడు. ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్‌లాల్) రక్షణ కోసం తన శాయశక్తులూ ఉపయోగించి ఉగ్రవాదుల పన్నాగాలను నాశనం చేస్తుంటాడు. స్వదేశంలోవున్న ఓ పెద్ద వ్యాపారవేత్త మహదేవ్ (బొమన్ ఇరానీ) ప్రధానికి అత్యంత ఆప్తుడు. అతనికి లేని వ్యాపారాలు లేవు. పక్క దేశాలనుండి భారతదేశ ప్రధాని చంద్రకాంత్ వర్మని హతమార్చడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి. ఈ నేపథ్యంలో కాశ్మీర్ నేపథ్యంలో జరిగిన ఓ సభలో ట్రక్ బాంబ్ పేలి ప్రధాని చనిపోతాడు. అక్కడేవున్న రవికిషోర్ ఉగ్రవాదుల పన్నాగాలను పసిగట్టలేకపోవడంతో ఈ ఘోరం జరిగిపోతుంది. ఈ హత్య వెనుకవున్న నిజమైన శక్తులను పట్టుకోవడానికి కథానాయకుడు ఏం చేశాడనేదే మిగతా కథ.
విరివిగా పొలాలపై రసాయన ఎరువులు చల్లడంతో నేల తల్లి గొడ్రాలైపోతుందని, దానికి ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని చెప్పే కథానాయకుడు, ఆ తరువాత ఒక్కసారిగా రూపురేఖలు మారి ప్రధాని వద్ద కనిపిస్తాడు. విదేశీ మిలట్రీ వద్దనున్న రసాయనిక ఆయుధాలను తుపాన్ సమయంలో వెళ్లి నాశనం చేయడం, ప్రధాని లండన్ వెళ్లినపుడు హత్య చేయడానికి ప్రయత్నాల సన్నివేశాలు ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తాయి. స్లీపర్ సెల్‌లా వ్యవహరించే కథానాయకుడు ఆ తరువాత అదంతా శత్రుమూకలను నాశనం చేయడానికేనని చెప్పడంతో రివర్స్ గేర్‌లా మారింది. కెమికల్ వెపన్స్ తుపాను సమయంలో నాశనం చేస్తే వాటి ప్రభావం వుండదంటూ ఓ సిద్ధాంతాన్ని దర్శకుడు చెప్పడం ప్రేక్షకుడిని సరిగా ప్రిపేర్ చేయకపోవడంతో అర్థంకాదు. సర్జికల్ స్ట్రైక్‌లాంటి అంశాలను కూడా తీసుకుని ఉగ్రమూకలమీద మిలటరీ అటాక్స్ చేయడం కూడా ప్రస్తుత ట్రెండ్‌కు తగినదే. ప్రధాని హత్యకు జరిగిన కుట్రను పరిశోధన చేస్తూ మిడతలదండులాంటి ఉపకథలు కూడా ఈ చిత్రంలో కథానాయకుడు పరిష్కరించాల్సి వస్తుంది. ఇలా అనేక విషయాలను చెప్పాలనుకున్నారు కానీ ఏ విషయాన్నీ పూర్తిగా చెప్పలేకపోయారు. బయోవార్, ఎంటమాలజీ వార్ లాంటివి తీసుకొని సిల్లీ ఫెరా అనే మిడతల దండు దండయాత్రల నేపథ్యంలో చిత్రాన్ని లాగించే ప్రయత్నం చేసినా అవి
ప్రేక్షకుడిని ఆకట్టుకోవు. వ్యాపారాలు చేసే కోటీశ్వరులుబ్యాంకులనుండి అప్పులు చేసి పారిపోతే, రైతు అప్పులు చేసి పారిపోరని చెప్పడం బావుంది. యురేనియం తవ్వకాలవలె ధోరియం త్రవ్వకాలను ఈ చిత్రంలో చర్చించారు. దీనివెనుక వ్యాపారవేత్త మహదేవ్ హస్తం వుందని చెప్పడంతో అసలైన విలన్ అతడేనని అర్థమైపోతుంది. ఆ పాత్రను పూర్తి నిడివిలో చెప్పకపోవడంతో ప్రేక్షకుడి దృష్టి పడదు. ఎంతసేపటికి ఉగ్రవాదులు అని చెబుతూ వెళ్ళారు. ప్రధాని హత్య తరువాత ఆయన కొడుకు అభి (ఆర్య)ను ప్రధానమంత్రిని చేస్తారు. ఆ పాత్రను కూడా సరిగా తీర్చిదిద్దలేదు. చిన్నపిల్లాడి చేష్టలతో ఆ పాత్ర తేలిపోయింది. ధోరియం తవ్వద్దంటూ ధర్నాలు చేసే రైతులపై కాల్పులు జరపడం, అందులో కొందరు దొంగ రైతులు పోలీసులపై బాంబులు వేయడం లాంటి సన్నివేశాలు గతంలో చూసినవే. చిట్టచివరికి స్వదేశంలో వున్న ఉగ్రవాది వ్యాపారవేత్త మహదేవేనని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా మొదట చెప్పిన విదేశీ ఉగ్రవాదుల ముద్రే ప్రేక్షకుడి మనోఫలకంపై ఉంటుంది. కె.వి.ఆనంద్ గతంలో చేసిన చిత్రాలలో ఓ వైవిధ్యమైన శైలి, కథలో కొత్తదనం వుంటుంది. కానీ ఈ చిత్రంలో ఏదీ కనపడదు. డబ్బింగ్ సినిమా అవ్వడంతో అక్కడక్కడ తెలుగు హోర్డింగులు పెట్టినా ఎల్లమ్మ, పుల్లమ్మ చెరుకు ముక్కలాంటి సింగారి పాటల్లో పూర్తి తమిళ వాసన కనిపిస్తుంది. ఎన్నో తారాల సంగమం అంబరమొక్కటే అన్నపాట ఆకట్టుకుంటుంది. శాంటియాగో బర్త్‌డే పార్టీ పాటలో బాణీ, వేసిన స్టెప్పులు సరికొత్తగా వుంటాయి. సూర్య గతంలో చేసిన అనేక చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రాన్ని తన స్టామినాతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ కథ, కథనాలు తేలిపోవడంతో అతని కృషి వృధా అయింది. మోహన్‌లాల్ పాత్రకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. సాయేషా సెహగల్ హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అన్నట్టు వుంది. సినిమా మొత్తాన్ని సూర్య, సముద్రఖని మోసేశారు. కెమెరా పనితనం ఫర్వాలేదు.

-ఎస్‌ఎస్