రివ్యూ

కండ తగ్గిన కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పహిల్వాన్ * బాగోలేదు
*
తారాగణం: కిచ్చా సుదీప్, ఆకాంక్షసింగ్, సునీల్‌షెట్టి, సుశాంత్ సింగ్, కబీర్ దేసన్‌సింగ్, అవినాష్, శరత్ లోహితస్య, అప్పన్న, శార్వ, సూరజ్, వంశీ
సంగీతం: అర్జున్ జెన్యా
కెమెరా: కరుణాకర్
నిర్మాత: స్వప్నకృష్ణ
రచన, దర్శకత్వం: కృష్ణ
*
‘ఏకాగ్రత ఏమారితే ఎంచుకున్న లక్ష్యం నీరుగారిపోతుం’దన్న చిత్రంలోని సర్కార్ (సునీల్‌షెట్టి) అభిప్రాయం ‘పహిల్వాన్’ ఫలితం విషయంలో మాత్రం నిజమైంది. పహిల్వాన్ ప్రారంభమైంది కుస్తీ అడుగులతో. తర్వాత దిశమారి ప్రేమలో పడింది. తిరిగి డైరెక్షన్ మారి కథానాయకుడు కృష్ణ (సుదీప్) బాక్సింగ్ బరిలోకి వెళ్తాడు. అలా ఎందుకు? అన్న ప్రశ్నకు -ఆ డబ్బుని పేదరికంతో రాణించలేకపోతున్న అనాథ పిల్లల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి అని సమాధానమిచ్చారు. ఇలా మాటిమాటికీ మూడ్ మారిపోవడంవల్ల ప్రేక్షకుల మూడ్‌కి పహిల్వాన్ మ్యాచ్ కాలేదు. అంతిమంగా కుస్తీ పట్టు తప్పింది.
అనాధగావున్న కృష్ణ (సుదీప్)కు ఆశ్రయమిచ్చి కుస్తీ విద్యను నేర్పి పహిల్వాన్ స్థాయికి చేరుస్తాడు క్రీడాగురువు సర్కార్ (సునీల్‌షెట్టి). కాలక్రమంలో కృష్ణ, రుక్మిణి (ఆకాంక్షసింగ్) పట్ల ఆకర్షితుడై, సర్కార్ అభీష్టానికి వ్యతిరేకంగా వివాహమాడతాడు. ఇది నచ్చని సర్కార్ కృష్ణని ఇంటినుంచి పంపించేసి, తను నేర్పిన కుస్తీ వాడొద్దని ఆంక్ష విధిస్తాడు. చివరకు కృష్ణ ఏంచేశాడు? రొటీన్ ప్రశ్నకు రోటీన్ సమాధానం మిగతా కథ. పేరుకి క్రీడలపట్ల పహిల్వాన్ స్ఫూర్తిని నింపుతుందని విపరీత ప్రచారం జరిగినా, వాస్తవానికి ఓ మామూలు వాణిజ్య చిత్రంలో ఉండే అన్ని రకాల మసాలా దినుసులూ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. దానివల్ల అన్నిట్లాగే ఇందులోనూ కావాల్సిన కప్పదాటు సన్నివేశాలూ తప్పలేదు. వాటిని భారీ నిర్మాణ విలువలూ, కథానాయకుడు సుదీప్‌కున్న ఛరిష్మా ఎంతగా కప్పేయాలని చూసినా కొన్నిచోట్ల బహిర్గతమైంది. ఉదాహరణకు బాక్సర్ టోనీ (కబీర్‌దేసన్ సింగ్) ఆటలో చేసిన క్రమశిక్షణ ఉల్లంఘనా చర్యలను ప్రతిఘటించిన అతని కోచ్ (శరత్ లోహితస్య) వాదం ఇట్టే తేలిపోయినట్టు సినిమాలో చూపారు. కానీ నిజానికి మిగతా ఆటల్లోకంటే, ఇక్కడ ఫౌల్ గేమ్ ఆడితే భౌతికంగా ఆటగానికి జరిగే నష్టం అపారంగా వుంటుంది కనుక, అక్కడి విచారణ తదితరాలు చాలా కట్టుదిట్టంగా ఉంటాయి. ఇది గమనించలేదు. అయితే చివర్లో టోనీకి, కృష్ణకి జరిగే బాక్సింగ్ పోటీలో అభ్యర్థి పడిపోతే, అక్కడి రక్షణ బృందం జరిపే సపర్యలూ వగైరా వాస్తవ సమీపంగా చూపారు. కానీ ఓ ఆటలో ఉత్తమ నైపుణ్యమున్న అభ్యర్థి, బాక్సింగ్‌వంటి మరో పోటీలో సైతం స్వల్పకాలంలో కాకలు తీరిపోయినట్టు ఆడటం కష్టసాధ్యం. ఎందుకంటే మల్లయుద్ధం అన్నది ఏ కవచమూ లేని విధానంతో జరిపే ప్రక్రియ కాగా, బాక్సింగ్ అదును చూసి ఉపయోగించే పంచ్‌ల కేంద్రంగా జరిగేది. ఒకదాంట్లోంచి మరోదాంట్లోకి మారడం, మరి శిఖరప్రాయపు సత్తాకలిగిన ప్లేయర్‌తో ఆడడం అంత ఈజీ కాదు. దాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేస్తే బావుండేది.
బడ్జెట్ దృష్ట్యా కలిసిరావడానికి పలు భాషల్లో తీయడం (పహిల్వాన్ కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో తయారైంది) వాణిజ్య లెక్కల ప్రకారం ఓకే అయినా, అలా అందించిన చిత్రం అన్ని ప్రాంతాల తీరులకు సరిపోయేట్లు ఉండాలి. కాని పహిల్వాన్ తన బీజ భాష అయిన కన్నడ వాసనల్నే ఎక్కువ సంతరించుకుంది. పాత్రధారులు పెర్‌ఫార్మెన్స్ మాటకొస్తే సినిమా మొత్తం బాధ్యత సుదీపే భరించాడు. 46 ఏళ్ళ వయసులో పోరాటాలూ, కండలూ చూపించడానికి చేసిన కృషిని విస్మరించలేం. కాకపోతే పాత్ర చిత్రణలో స్టెబిలిటీ వున్నట్లయితే బాగా రాణించేది. సర్కార్‌గా సునీల్‌షెట్టి నిగ్రహపూర్వక నటన ప్రదర్శించారు. రాజారాణాప్రతాప్ వర్మగా సుషాంత్‌సింగ్ రోల్‌లో కావాల్సిన సీరియస్‌నెస్‌కంటే కామెడీని పంచడానికే డైరెక్టర్ కృషి చేశారు. రుక్మిణిగా ఆకాంక్షాసింగ్ సినిమాకు కావాల్సిన గ్లామర్ కోటింగ్ సప్లై చేయడంలో సక్సెస్ అయింది. సుదీప్‌కీ, ఈమెకీ మంచి కెమిస్ట్రీ కుదిరింది. అది డ్యూయెట్స్‌లో ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది. అర్జున్ జెన్యా స్వరాల్లో ఆయనే, అనురాగ్ కులకర్ణితో పాడిన ‘్ధృవతారా’ సాంగ్ బావుంది. ఇందులో లిరిక్ పరంగా రామజోగయ్య శాస్ర్తీ అందించిన ‘ప్రతిభను పెంచిన పైవాడే ప్రతిబంధకమై నిలిచాడే’ అన్న వాక్యం సందర్భోచితం. అలాగే ముందు శాస్ర్తియ సంగీతబద్ధంగా ‘తధిగణతోం...’ అంటూ ఆరంభమైన ‘కనె్నపిచ్చుకా కన్నుకొట్టావే, తేనె రుచిగా..’ అంటూ సాగిన పాట అలరించింది. ఎక్కువ సినిమాల్లో కాస్త అటూ ఇటూగా వినిపించే హీరోయిన్ సంభాణ- ‘తప్పు చెయ్యద్దని చెప్పాను కానీ, తప్పు చేస్తే సహించమని చెప్పలేదు కదా’ వంటివి ఇందులోనూ దొర్లాయి. ప్రేమను ‘సిక్సిప్యాక్ బాడీ’ తీరులో పోల్చిన డైలాగ్ బావుంది. సహజంగా ఈ చిత్ర దర్శకుడు కెమెరామెన్ కనుక ఆ బాపతు మెరుపులు కెమేరా బాధ్యుడు కరుణాకర్‌తో చూపించారు. ఎటొచ్చీ చిత్రం నిడివి విషయంలో దర్శకుడు దాదాపు నిర్లక్ష్యం వహించినట్లు కన్పడింది. దాంతో సినిమా రెండున్నర గంటలు పైబడి, అనేక అనవసర సన్నివేశాలకు ఆస్కారమిచ్చి ఆడియెన్స్‌ని తెగ ఇబ్బందికి గురిచేసింది. హీరోయిన్‌తో తాటికల్లు త్రాగించడం తదితర సన్నివేశాలను నిర్దాక్షిణ్యంగా తొలగించవచ్చు. సినిమా ప్రొడక్షన్ రిచ్‌నెస్ కోసం ఫోకస్ చేసే విధానంతోపాటు కంటెంట్, క్వాలటీ, పర్‌ఫెక్ట్‌నెస్‌పైనా దృష్టిపెడితే పహిల్వాన్ పస బాగా ప్రేక్షకులకు తెలిసేది.

-అన్వేషి