రివ్యూ

ఆశించింది జరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా జరగొచ్చు * బాగోలేదు
*
తారాగణం: విజయ్‌రాజా, పూజాసోలంకీ, సాషాసింగ్, బాబీ సింహ, అజయ్ ఘోష్, రాఘవ, నాగబాబు, వెనె్నల కిషోర్, తాగుబోతు రమేష్, రవి శివతేజ, చమ్మక్ చంద్ర తదితరులు
సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
నిర్మాణం: వెట్‌బ్రైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం: కె రమాకాంత్
*
ఫ్రాన్స్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు చిత్ర దర్శకుడు కె రమాకాంత్. అయినా ఓల్డ్ ఫార్మాట్‌లోనే ‘ఏదైనా జరగొచ్చు’లాంటి చిత్రమందించాడు. కాని కొత్తగా ఏదో జరుగుతుందని ఆశిస్తున్నాడు. అలాంటిదేదీ జరగదు, అది అత్యాశేనని సినిమా నిరూపించింది.
ఏప్రిల్ 1న పుట్టిన ముగ్గురు మిత్రులు -జయ్ (విజయ్‌రాజా), విక్కీ, రాకీ. తాము చేసే పనులతో చిక్కుల్లో పడుతుంటారు. చిక్కులను అధిగమించే క్రమంలో -ఏం జరిగిందన్న వివరాల సమాహారమే సినిమా.

చెప్పుకోడానికి సింపుల్ స్టోరీ అనిపిస్తుంది. కాని -ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌లో చెప్పలేనంత కన్‌ఫ్యూజన్ . అదే -కథలోని క్లారిటీని మింగేసింది.
మొదట ఏప్రిల్ ఫస్ట్ విషయమే తీసుకుందాం. -ఆ రోజు పుట్టినోళ్లంతా ఫూల్సేనా అంటూ చిన్నపాటి చర్చ లేపి, అది తప్పని నిరూపిద్దామంటూ బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ పని మొదలెడతారు. తర్వాత కథ ఎటెటో వెళ్లిపోయి (తెలుగు సినిమా ఇటీవలి కాలంలో ఎక్కువగా తొక్కేసిన పాత బాట) దెయ్యాల వేటకు జారిపోయింది. ఇకముందు ఏవేం జరుగుతాయన్నది సగటు ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోయింది. దాంతో సినిమా వెగటైంది. ఇంకా చెప్పాలంటే అప్పుడెప్పుడో సినిమాల్లో ఎక్కువగా ఉండే కాయ్ రాజా కాయ్ సీన్ల నేపథ్యంతో ఈ సినిమాలోని ప్రధాన ప్రతినాయకుడు కాళి (బాబీ సింహ) కథా నేపథ్యం స్టార్టవుతుంది. అలా మొదలైన ఆ పందేల పరంపర క్రికెట్ బెట్టింగ్‌తో పతాక సన్నివేశాలకు చేరుతుంది. మధ్యలో షేర్ మార్కెట్ పతనంతో జయ్ మిత్రబృందం ఆరంభించిన ఈజీ మనీ పొందే పధకాలు కూలిపోవడం వగైరాలు ఇరికించేశారు. ఇలా లెక్కలేనన్ని అంశాలు పెట్టేసి చివరకు దెయ్యం, బాటిల్‌లో బంధించడం, మంత్రగత్తె (అజయ్ ఘోష్) విడిపించడం లాంటివీ దట్టించేశారు. దీనివల్ల ఎంతగా ఫాంటసీలను రియాల్టీలోకి చూడాలి అన్న భావాలున్న ప్రేక్షకులు సైతం బాబోయ్ అనే రీతిలో సన్నివేశాల పంథా సాగి విసుగు పుట్టించింది. ఇక చివర్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా నిజమైన దయ్యాన్ని యాక్ట్ చేయిస్తానంటూ హడావుడి చేసే డెవిల్‌వుడ్ దర్శకుడిగా వెనె్నల కిషోర్‌తో చేయించిన హడావుడి సినిమాని ఇంకాస్త కంగాళీ చేసింది. హీరోగా శివాజీరాజా తనయుడు విజయ్ రాజా ఈ సినిమాతో అరంగేట్రం చేశాడు. అతను పోషించిన జయ్ పాత్ర ప్రస్తుతం వున్న వారి వయసుకి సరిపోయినా, పాత్రకు తగిన వాచకం, అభినయం, భావ వ్యక్తీకరణలో ఇంకా బాగా సాధన చేయాలి. జయ్ వెంటపడిన శశిగా పూజాసోలంకీ పరిధిమేరకు నటించింది. దెయ్యం పాత్ర బేబీగా సాషాసింగ్ పరిణితి చెందిన నటన ప్రదర్శించింది. కానీ దెయ్యం కాకముందువున్న ఆమె పాత్ర స్థితి దయనీయం. గూండాలు వచ్చి బెదిరించే పరిస్థితిగా చూపారు. కానీ అలాంటి ఆ రోల్ కాళీ కోసం డాక్టర్లను బెదిరించి రప్పించడం, ఇంజెక్షన్స్ ఇప్పించడం వంటివి చేసినట్లు చూపారు. ఇది ఎలా సాధ్యమో దర్శకుడే చెప్పాలి. జయ్ మిత్రులుగా నటించిన నటులూ బాగా నటించారు. అందులో ఒక నటుడు రవితేజ వాయిస్ మాడ్యులేషన్‌ను అనుకరించారు. ఆ పాత్రకు ద్వితీయార్థంలో హీరోకన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. అజయ్ ఘోష్ మంత్రగత్తెగా ఆ పాత్రకు కావాల్సిన నపుంసకత్వ శైలిని బాగా ప్రతిబింబింప చేశారు. పతాక సన్నివేశాల్లో ఆ పాత్ర ఓపక్క పెదాలు కదుపుతూ, పదాలు వేగంగా కదుపుతూ చేసే భంగిమల సమన్వయాన్ని పర్‌ఫెక్ట్‌గా చేశారు. దాన్ని ఇంకా బాగా ఫోకస్ చేస్తే అందరికీ చేరేది. కాళిగా బాబీ సింహా నటనకంటే అతని రఫ్‌లుక్ ఆకట్టుకుంది. తాగుబోతు రమేష్, వెనె్నల కిషోర్ తమ పంథా నటనను మరోసారి కుమ్మరించారు. సురేష్ పెండ్యాల సంగీత దర్శకుడిగా తనకొచ్చిన తొలి అవకాశంలో గొప్పగా చెప్పుకొనే రీతి స్వరాలు అందించకున్నా, ఛాన్స్ ఇస్తే అటు ఊపు పాటలు (కావాలోయ్, కావాలి..) ఇటు మాటలు వినిపించే పాటలు (అనుభవించు..) అందివ్వగలనని నిరూపించుకున్నాడు. సంభాషణల్లో కొన్నిచోట్ల చమక్కులు దొర్లాయి. ‘సర్వర్ పనిచేస్తున్నా, నా ‘సర్వర్’ దొబ్బలేదు’, ‘ఇంటలిజెంట్‌కు ఇన్‌షర్ట్ చేసినట్లు, టాలెంట్‌కు పాంటేసినట్లు ఉంది’, ‘బుద్ధున్నవాళ్లతో కూడా బూతులు మాట్లాడించేస్తారు’ లాంటివి ఇందుకు ఎగ్జాంపుల్స్. బుద్ధిహీనతకు ఎల్లలు లేవు (స్టుపిడిటీ హాజ్ నో బౌండరీస్) అంటూ సినిమా టైటిల్‌కు పైన ఓ శీర్షికగా పెట్టుకున్న వాక్యానికి అన్వయం కుదిరేలా ఏదైనా జరగొచ్చుని తీశారా అన్న అనుమానం సినిమా చూసిన వీక్షకులకు కలిగితే అది వారి తప్పుకాదు. సరే.. ఏది ఎలా వున్నా కొన్ని అర్థవంతమైన చిత్రాలను సృజించిన దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ వద్ద దర్శకత్వ శాఖలో తర్ఫీదు పొందిన రమాకాంత్ తన భవిష్యత్ ప్రయత్నాలను రసజ్ఞులను ఆకర్షించే రీతిలో అందిస్తారేమో చూద్దాం.

-అన్వేషి