రివ్యూ

అదే.. ఎక్కువైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ కామ్రేడ్ ** ఫర్వాలేదు

తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, శృతిరామచంద్రన్, సుహాస్, తారుహాసన్, ఆనంద్ తదితరులు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని
దర్శకత్వం: భరత్ కమ్మ

పదిమంది నోళ్లలో ‘మీ టూ’ నానుతున్నపుడు రాసుకున్న కథ. హీరో హీరోయిన్ల ఆటిట్యూడ్స్‌ని అపోజిట్ డైమెన్షన్స్‌లో డిజైన్ చేసి -కనెక్టింగ్ పాయింట్‌నుంచి పుట్టే కాన్ఫ్లిక్ట్‌ని కన్‌క్లూజన్‌కు తీసుకెళ్తూ.. ఆ డ్రైవ్‌లో ‘మీటూ’ని డిస్కస్ చేయాలన్న గొప్ప ప్రయత్నం. క్లుప్తంగా ‘డియర్ కామ్రేడ్’ నుంచి తీసుకోదగ్గ గ్రాఫ్ ఇదీ. కంటెంట్‌లో డెప్తున్నా, మెటీరియలైజ్ చేయడం మాత్రం ఈజీ కాలేదు.
యంగ్ సెనే్సషన్‌గా యూత్‌పై బలమైన ముద్రవేసిన విజయ్ దేవరకొండ. పెర్ఫార్మెన్స్‌తో తక్కువటైంలోనే ఆడియన్స్‌కి బలంగా కనెక్టైన రష్మిక మండన్న. వీళ్లిద్దరి కెమిస్ట్రీపై ఆడియన్స్‌లో అంచనాలకందని ఎక్స్‌పెక్టేషన్స్. ఇటీవలి కాలంలో ఏ సినిమాకూ జరగనంత ప్రచారం. ‘డియర్ కామ్రేడ్’ కథను సక్సెస్‌వైపు నడిపించడానికి ఇవే గొప్ప వెపన్స్. మిస్ ఫైరైతే మాత్రం -అవే బూమరాంగ్.
పదకొండేళ్ల ఎదురుచూపుల ప్రయత్నం తరువాత, తనరోజంటూ ఒకటొచ్చిందని దర్శకుడు భరత్‌కమ్మ చెప్పుకున్నాడు -సినిమాకు ముందు. ఆ ‘డే’ను ‘డియర్ కామ్రేడ్’తో ఎంత బలోపేతం చేశాడో చూద్దాం.
**
స్టూడెంట్ లీడర్ బాబీ. లేడీ క్రికెటర్ లిల్లీ. ఇద్దరి పరిచయంలో పుట్టిన ప్రేమ. హాయైన లవ్ జర్నీ. దగ్గరయ్యే క్రమంలో -పెరిగిన దూరం. పొసగక వేరుపడటం. క్లైమాక్స్‌లో కలుసుకోవడం. ఇదే కథ. చెప్పాల్సిన విషయాన్ని చెప్పడానికి సింపుల్ కహానీనే ఎంచుకున్నాడు దర్శకుడు. కొత్త విషయం చెప్తున్నానన్న భావన కల్పించేందుకు -కథలో హీరోని కామ్రేడ్ చేశాడు. హీరోయిన్‌ని ‘మీటూ’వైపు నిలబెట్టాడు. ఎత్తుగడ బావుంది. కానీ -కథనమే కనెక్టివ్‌గా లేదు. ఏ సినిమాలోనైనా -హీరోయిన్‌ని రక్షించుకునే హీరో ఒకడుంటాడు. కాకపోతే ఇందులో టైటిల్ జస్ట్ఫికేషన్ కోసం ఆ హీరోని ‘కామ్రేడ్’ అన్నారనిపిస్తుంది.
కథ:
వైజాగ్‌లోని చైతన్య అలియాస్ బాబీ (విజయ్ దేవరకొండ) ఆగ్రెసివ్ స్టూడెంట్ లీడర్. అన్యాయాన్ని సహించలేని దూకుడు స్వభావం. ఎదురింటికి బంధువుగా వచ్చిన అపర్ణాదేవి అలియాస్ లిల్లీ (రష్మిక మండన్న)తో ప్రేమలో పడతాడు. స్టేట్ క్రికెట్ ప్లేయర్ అయిన లిల్లీ సైతం బాబీని ఇష్టపడుతుంది. లవ్ జర్నీ మొదలవుతుంది. ఈక్రమంలో -బాబీ దూకుడు స్వభావానికి లిల్లీ భయపడుతుంది. గొడవలకు దూరంగా ఉండమంటుంది. బాబీ వినడు. లిల్లీ దూరమవుతుంది. ఇష్టపడిన అమ్మాయి కనిపించకపోయేసరికి బాబీ పిచ్చోడవుతాడు. దేశసంచారి అవుతాడు. ఆక్రమంలోనే -సౌండింగ్ థెరపీని వంటబట్టించుకుంటాడు. మూడేళ్లు గడిచిపోతాయి. బాబీ ఇంటికొస్తాడు. అతని లైఫ్‌లోకి లిల్లీ మళ్లీ ఎంటరవుతుంది. కట్‌చేస్తే -ఈ మూడేళ్లలో బాబీ, లిల్లీల మానసిక స్థితిలో మార్పులేంటి? లిల్లీకి ఎదురైన టెర్రిఫిక్ ప్రాబ్లెమేమిటి? ఆమెకు అతను ‘కామ్రేడ్’ ఎలా అయ్యాడు? ఇలాంటి ప్రశ్నలకు దర్శకుడిచ్చే సమాధానంతో సినిమా ముగుస్తుంది.
బాబీని పక్కింటి కుర్రాడిగానే ఉంచివుంటే ప్రేమ కథ మరోలా ఉండేదేమో. కామ్రేడ్‌ని చేయడానికి కారణాలు వెతుక్కుంటూ -కాలేజీ యూనియన్లు, స్టూడెంట్ గొడవలు.. ఇలా లవ్ ఫీల్‌ని డిస్ట్రర్బ్ చేయగలిగే సీన్స్ వేయడంతో కథలో ఇంటెన్స్ తగ్గింది. నిజానికి హీరో హీరోయిన్ వ్యక్తిత్వాలనుంచి పుట్టే సంఘర్షణతో మంచి ప్రేమకథను చెప్పే అవకాశమున్నా -కొత్తదనం కోసం కామ్రేడ్ కోణాన్ని ట్రై చేశారనిపిస్తుంది. పైగా, ఆ షేడ్స్‌ని బ్యాలెన్స్ చేసే సీన్స్‌లో దర్శకుడి స్టామినా కనిపించలేదు. రొమాంటిక్ లవ్ సీన్స్ సైతం రొటీన్‌గానే ఉన్నా -విజయ్, రష్మికల కెమిస్ట్రీ మాత్రం కొంత రిలీఫ్ అనుకోవాలి.
ఫస్ట్ఫాలో ‘కామ్రేడ్-లవ్’ చూపిస్తే.. సెకెండాఫ్‌లో ‘కామ్రేడ్ -మీటూ’ని డిజైన్ చేశాడు దర్శకుడు. ఈ రెండూ రెండు పార్శ్వాలుగా చూస్తామే తప్ప, సింక్ చేయగల సీన్‌ని చూడలేం. కాకపోతే -స్టోరీని ముగించటానికి ‘మీటూ’ని బ్యాక్‌డ్రాప్ చేసేశారు. దాంతో డిస్కషన్ పాయింట్‌కి జస్ట్ఫికేషన్ జరగలేదు. అలాగే కామ్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పడం వల్ల -లిల్లీ స్ట్రగుల్ ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేదు. దీంతో కథకిచ్చిన ముగింపూ కన్విన్సింగ్‌గా అనిపించదు.
విజయ్ దేవరకొండ తనకై తాను అలవాటుచేసుకున్న ఎమోషన్ పాత్రలో ఒదిగిపోయాడు. కాకపోతే అర్జున్‌రెడ్డి ఇంపాక్ట్ ఇంకా ఆడియన్స్‌ని వదల్లేదు కనుక, మళ్లీ మళ్లీ చూస్తున్న భావన కలిగిందంతే. రష్మిక పెర్ఫార్మెన్స్ బావున్నా, పాత్ర తాలూకు భావోద్వేగాలు చూపించే నడివి తగ్గడంతో -ప్రభావితం చేయలేకపోయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం -ఈ మైనస్సులను మాయం చేసేసింది.
సాంకేతికంగా జస్టిన్ సంగీతం, సుజిత్ సినిమాటోగ్రఫీ మెస్మరైజ్ చేశాయి. బలహీన ప్రేమకథకి ప్రాణం పోసింది ఈ రెండు విభాగాలే. మిగిలిన విభాగాలన్నీ -సినిమాను తక్కువ చేయడానికి వీల్లేనంతగా కష్టపడ్డాయి. విజయ్ దేవరకొండ ఇమేజ్‌తో చూస్తే -డియర్ కామ్రేడ్ ఓకే. దర్శకుడి ప్రయత్నపరంగా కథని విశే్లషించుకుంటే -నాటోకే.

-మహాదేవ