రివ్యూ

ష్!స్మార్ట్.. శంకర్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్మార్ట్ శంకర్ ** ఫర్వాలేదు

నటీనటులు: రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్యదేవ్, షాయాజి షిండే, పునీత్ ఇస్సార్, ఆశీష్‌విద్యార్థి, మధు తదితరులు
ఛాయాగ్రహణం: రాజ్ తోట
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: పూరి కనెక్ట్స్
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
=============================================================
వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్నాడు పూరి జగన్నాథ్. ఆయనకు సరిపడా సక్సెస్ మాత్రం అందడంలేదు. వరుస సినిమాలు చేస్తున్నా కూడా విజయం అందనంత దూరంలోనే వుండిపోయింది. తాజాగా ఇస్మార్ట్‌గా ఆ విజయాన్ని అందుకోవాలని చేసిన ప్రయత్నమే ఇస్మార్ట్ శంకర్. హీరో రామ్ కొత్త పాత్రలో కన్పించిన ఇస్మార్ట్ ప్రేక్షకులను ఇస్మార్ట్‌గా మెప్పించాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ
శంకర్ (రామ్) హైదరాబాద్ పాతబస్తీ అనాథగా పెరిగిన కుర్రాడు. తాను బాబాయిగా భావించే కాకా (మధు) అండతో పెరిగి పెద్దవుతాడు. ఆయన సపోర్టుతో సెటిల్‌మెంట్స్ డీల్స్ చేస్తూ లైఫ్ గడుపుతుంటాడు. ఈ నేపథ్యంలో శంకర్‌కు చాలామంది విరోధులు అవుతారు. ఓ హత్య చేస్తే.. తన లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆ డీల్ ఒప్పుకుంటాడు శంకర్. రామ్ చేసిన హత్య కారణంగా కొన్నాళల్ళు తన లవర్‌తోకలిసి అండర్‌గ్రౌండ్‌లో వెళ్ళే క్రమంలో రామ్‌పై పోలీసు గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. ఆ ఎటాక్‌లో నభా నటేష్ చనిపోతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్ తలలోకి ఓ మెమొరీ చిప్‌ను ఎక్కిస్తారు. అసలు రామ్ తలలోకే ఆ చిప్‌ని ఎక్కించడానికి కారణం ఏమిటి? దీనికి సారా (నిధి అగర్వాల్)కి వున్న సంబంధం ఏమిటి? ఇంతకీ రామ్ తాను చంపాలనుకున్న వ్యక్తిని చంపుతాడా? లేదా? ఆ తరువాత అతడి ప్రయత్నం ఏ మేరకు ఫలించింది? కేసులో కావాలని ఇరికించింది ఎవరు? అన్నదిమిగతా కథ. ఇస్మార్ట్ శంకర్ పాత్ర.. దానికి తగ్గట్టు రామ్ ఎనర్జీ ఆకట్టుకుంటాయి. దానికితోడు పూరి మార్క్ డైలాగ్స్ మెప్పిస్తాయి. ప్రథమార్థంలో శంకర్ క్యారెక్టర్ వినోదం పంచుతుంది. మంచి ఊపు తెచ్చేలా సాగిన పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. పాటల్లో రామ్ ఎనర్జీ.. డ్యాన్సులు ఉత్సాహం నింపుతాయి. తన బుర్ర షేక్ అయినపుడు రామ్ షాకయ్యే తీరు.. చెప్పే డైలాగులు కొన్ని భలేగా అనిపిస్తాయి. రామ్-పూరిల కెమిస్ట్రీ ఇక్కడా బాగా వర్కవుట్ అయింది. యూత్‌కు కనెక్టయ్యే కొన్ని అగ్రెసివ్ సీన్లు ప్రథమార్థంలో ఒక మోస్టరుగా టైంపాస్ చేయిస్తాయి. కానీ ద్వితీయార్థంలో కథ మీద సినిమాను నడిపించే విషయంలో పూరి కన్ఫ్యూజ్ అవ్వడం. కమర్షియల్ స్టైల్లో ఈ కథను చెప్పబోయి అటు ఇటు కాకుండా తయారుచేశాడు. ఇక హీరో తన ప్రేయసి కోల్పోయి వేదన అనుభవిస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాల్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ హీరో జ్ఞాపకాల్లో ఎక్కడా లస్ట్, లవ్ అనేది కనిపించకపోవడం విశేషం. ఇక తెలంగాణ భాష యాసతో పూరి రాసిన డైలాగులు.. వాటిని రామ్ పలికిన విధానం మాత్రం రియాలిటీగా అనిపించవు. ఏదో వాంటెడ్‌గా చెప్పినట్లు కృత్రిమంగా అనిపిస్తాయి. ఒక తెలంగాణ కుర్రాడు సహజంగా మాట్లాడితే ఉండే ఫ్లో కనిపించలేదు. దీనికితోడు ఒకటే రీసౌండ్‌తో చెవుల తప్పు వదిలించేశారు రామ్-పూరి. రామ్ చేసిన క్యారెక్టర్లలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందరూ రామ్ ఎనర్జీ గురించి మాట్లాడేవాళ్లే కానీ దాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీయలేదనే చెప్పాలి. హీరోయిన్లు ఇద్దరూ అందాల ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ విషయంలో ఇద్దరికీ సమాన మార్కులే వేయొచ్చు. వరంగల్ అమ్మాయిగా నభా చేసినపాత్ర ఇరిటేట్ చేస్తుంది. తెలంగాణ యాసతో ఆ పాత్రకు రాసిన డైలాగులు కృత్రిమంగా వున్నాయి. సత్యదేవ్ టాలెంట్‌ను సరిగా వాడుకోలేదు. షాయాజీ షిండే, ఆశీష్ విద్యారిథ లాంటి వారిపై పూరి ఫోకస్ పెట్టలేదు.
సాంకేతిక అంశాల గురించి చెప్పాల్సి వస్తే.. ఎక్కడా మణిశర్మ మార్క్ కనిపించలేదు. కానీ రెండు మూడు పాటలతో మాస్ ప్రేక్షకుల్లో ఊపు తెచ్చాడు. హీరోయిన్లతో వచ్చే రొమాంటిక్ సాంగ్స్ రొటీన్‌గానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. రాజ్ తోట ఛాయాగ్రహణం ఓకె. విజువల్స్ క్వాలిటీతో తెరకెక్కించారు. నిర్మాణ విలువలు ఓకె. ఇక అసలు కథలోకి వస్తే.. దర్శకుడు పూరి మరోసారి కథ విషయంలో ఆయన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. స్క్రీన్‌ప్లే సినిమాకు పెద్ద మైనస్. డైలాగుల్లో మాత్రం కొన్ని మెరుపులు కనిపించాయి. ఇందులో లవ్ పేరుతో లస్ట్ మాత్రమే చూపించడం. ట్రెండ్ పేరుతో డైలాగులన్నింటినీ బూతులతో నింపేయడం మరీ రొటీన్‌గా మారింది. సినిమాలు మారినా పూరి మారలేదనే విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది. ఈసారి కాస్త రూటు మార్చి.. సైంటిఫిక్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు దర్శకుడు పూరి. కానీ దాన్ని చెప్పాల్సిన రీతిలో చెప్పక.. కమర్షియల్ హంగులవల్ల అది ఎటూ కాకుండా తయారైంది. ఒక వ్యక్తికి మెమొరీ లాస్ అయితే మొత్తం గతం మర్చిపోవాలి కానీ.. ఒక విషయం జరిగిన 15 నిమిషాల తర్వాత మరిచిపోవడం అన్నది లాజిక్‌లా అనిపించదు. ఇదే పాయింట్‌తో గజినిలో మురుగదాస్ ఎంత బాగా కథను చెప్పాడు. కానీ ఇస్మార్ట్ శంకర్‌లో హీరో తలలోచిప్ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తుల్లా మార్చి మార్చి ప్రవర్తించే తీరు చూస్తే నవ్వు తెప్పిస్తుంది. ఒకసారి తనలా ఉంటాడు. ఇంకోసారి వేరే వ్యక్తిలా ప్రవర్తించి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. మర్డర్ మిస్టరీ చుట్టూ నడిచే ఎపిసోడ్ అయినా బాగుందా అంటే అదీ లేదు. దీనికి ఇచ్చిన బిల్డప్‌తో ఏదో ఊహించుకుంటాం. కానీ చివరికి అసలు విషయం తెలిసి సిల్లీగా అనిపిస్తుంది.

-త్రివేది