రివ్యూ

బుర్ర తిరిగిన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుర్రకథ * బాగోలేదు
*
తారాగణం:ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షా, రాజేంద్రప్రసాద్, అభిమన్యుసింగ్, పోసాని, పృథ్వి తదితరులు
ఎడిటింగ్: ఎంఆర్ వర్మ
సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాత: శ్రీకాంత్ దీపాల, కిషోర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
*
డైలాగ్ కింగ్‌గా టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న సాయికుమార్ తనయుడు ఆది ప్రేమకావాలి అంటూ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత లవ్‌లీ అంటూ మరో విజయాన్ని అందుకున్న ఈ హీరోకు వరుస పరాజయాలు వెనక్కి నెట్టేశాయి. కథల విషయంలో అయోమయంలో పడ్డ ఈ హీరో ఈసారి రెండు బుర్రల కథతో ఓ కొత్త ప్రయోగం చేశాడు. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారుతూ చేసిన ఈ రెండు బుర్రల సంగతి ఏమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
థియేటర్ మేనేజర్ (రాజేంద్రప్రసాద్) కొడుకు అభిరాం (ఆది) అందరిలా కాకుండా రెండు బుర్రలతో పుడతాడు. చిన్నపుడే ఒక బ్రెయిన్ తీసేయాలని డాక్టర్లు చెప్పినా డబ్బు సమస్య కారణంగా అలాగే ఉంచేస్తారు. అలా రెండు బుర్రలతో పుట్టడంవల్ల అభి పేరుతో జాలీగా కాసేపు రామ్ పేరుతో కూల్ అబ్బాయిగా మారుతూ పెరిగి పెద్దవుతాడు. ఆ క్రమంలో తన సమస్య తెలిసిన డాక్టర్ ప్రభుదాస్ (పోసాని) కూతురు హ్యాపీ (మిస్తీ చక్రవర్తి)ని ప్రేమిస్తాడు అభి. మరోవైపు రామ్ కూడా ఆశ్చర్య (నైరా షా) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఈ రెండు బుర్రలవల్ల అభిరాంతోపాటు కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడుతూ ఉంటుంది. ఓ సంఘటనవల్ల దుర్మార్గుడైన గగన్ విహారి (అభిమన్యుసింగ్) నగర బహిష్కారం అవడానికి కారణం అవుతాడు రామ్. తనను ఇలా చేసిన రామ్‌ను చంపాలని తిరుగుతూ ఉంటాడు. మరి ఇన్ని సమస్యల మధ్య అభిరాం ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.
నేటి తరం యూత్ హీరోలకు ఉండాల్సిన లక్షణాలు హీరో ఆదిలో వున్నాయి కానీ కథల ఎంపిక విషయంలోనే పొరపాట్లు చేస్తున్నాడు. దాంతో అతనికి సక్సెస్ దూరం అయింది. అందుకే కాస్త బ్రేక్ తీసుకుని కొత్త తరహా కథలపై ఫోకస్ పెట్టాడు. ఇక ఈ సినిమాలో కామెడీ విషయంలో మంచి టైమింగ్ చూపించాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ బాగా చేశాడు. హీరోయిన్లలో మిస్తీ చక్రవర్తి ఓకె. గ్లామర్ నటన విషయంలో ఫర్వాలేదనిపించింది. ఇక నైరా షాకు మాత్రం పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. హీరో తండ్రిగా రాజేంద్రప్రసాద్ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అలవాటైన శైలిలో చేసుకుంటూ పోయారు. కొత్తగా ఆయనలో షేడ్స్ తెచ్చే పాత్ర కాదు కాబట్టి రొటీన్‌గానే అనిపించినా ఆయన పాత్రకు ఇంకాస్త ప్రాముఖ్యత ఇస్తే బాగుండేది. ఇక అభిమన్యుసింగ్ మామూలుగానే చేసాడు. కమెడియన్స్ వున్నా కూడా పెద్దగా కామెడీ పండించే ప్రయత్నం దక్కలేదు. 30 ఇయర్స్ పృథ్వి కూడా హెల్ప్‌లెస్‌గా మిగిలిపోయాడు.
ఇక సాంకేతిక విషయాల పరంగా చూస్తే.. దర్శకుడు డైమండ్ రత్నబాబు ఎంచుకున్న పాయింట్‌లో వైవిధ్యం ఉంది కానీ దాన్ని తెరపై తీసుకురావడంలో మాత్రం కన్‌ఫ్యూజ్ అయ్యాడు. ట్రెండింగ్ అయ్యే టాపిక్స్‌ని తీసుకుని సోషల్ మీడియా జోకులతో కలిపి దాన్ని రెండు బుర్రలు అనే థీమ్‌ని జోడించి ఏదో ప్రయత్నం చేసారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమా విషయంలో ఎక్కడా కూడా కథను సీరియస్‌గా చెబుతున్నట్టు కాకుండా అనవసరంగా కామెడీ అంశాలతో హంగామా చేయాలని చూశాడు. ఇక సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ జస్ట్ ఓకె. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే ఒక డ్యూయెట్ తప్ప ఏపాట కనీసం గుర్తుచేసుకునే స్థాయిలో లేదు. రామ్‌ప్రసాద్ లాంటి సిన్సియారిటీ వల్ల ఛాయాగ్రహణం బుర్రకథకు కొంత రిచ్ లుక్ వచ్చింది కానీ లేదంటే సీన్ ఇంకోలా ఉండేది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ ఫర్వాలేదు. సెకెండ్ హాఫ్‌లో వచ్చే డ్రామా కాస్త విసిగిస్తుంది. ప్రొడక్షన్ విలువలు ఫర్వాలేదు.
బేసిక్ ఫ్లాట్‌ను ఆసక్తికరంగా తీసుకున్న రత్నబాబు దాన్ని ఆసక్తికరంగా విస్తరించుకోవడంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. రెండు బుర్రలతో హీరో పాత్ర సంఘర్షణకు గురికావడం అనే పాయింట్‌లో మంచి డెప్త్ వుంది. దానికి కావలసింది బలమైన కథనం కానీ ఇక్కడ అదే మిస్ కావడంతో అదికాస్తా బుర్రకు పరీక్ష పెట్టే ప్రహసనంగా మారింది. అభిరాం పాత్రను ఎస్టాబ్లిష్ చేయడమే తడబడుతూ మొదలుపెట్టిన రత్నబాబు కథను చెప్పే క్రమంలో నవ్విస్తే చాలు అనే రీతిలో కథనం రాసుకోవడంతో ఏ దశలోనూ బుర్రకథ ఆసక్తికరంగా అనిపించదు. అలాగే తన సినిమాలో కామెడీ సెంటిమెంట్ ఎమోషన్స్ అన్నీ ఉండాలన్న తపనతో అన్నీ కలిపి మిక్సీలో వేసి చెడగొట్టేశారు. విలన్ కాసేపు సీరియస్‌గా ఉంటాడు.. అంతలోనే కమెడియన్లకన్నా దారుణంగా ప్రవర్తిస్తాడు. ఇలాంటి ఫాంటసీ ఎలిమెంట్ వున్న సినిమాల్లో లాజిక్‌తో పెద్దగా పనుండదు. అలా అని ప్రేక్షకుల విచక్షణను మరీ చులకనగా అంచనా వేస్తే అసలుకే మోసం వస్తుంది. బుర్రకథలో జరిగింది అదే. సెకెండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో ముందు హీరో శరీరం నుంచి అభి బుర్రను వేరు చేద్దామనే ఆలోచన వచ్చినపుడు అసలు ఎంత పెద్ద డాక్టర్ అయినా లోపల వున్న రెండు బుర్రల్లో ఎవరిది ఏ బుర్రో ఎలా గుర్తుపడతాడో రచయితే చెప్పాలి. చాలా చిన్న లైన్‌మీద మెదడుకు పని చెప్పకుండా సోషల్ మీడియా ట్రెండ్స్‌నే కామెడీ కోసం వాడుకున్న తీరు సీన్స్‌వల్ల కాక బుర్రకథ బుర్రలకు ఎక్కకుండా పోయింది.
అవసరం వున్నా లేకపోయినా స్టార్ హీరోల సినిమాల బిట్లు స్పూఫ్‌లను వాడుకోవడం వాళ్ల డైలాగులను పాత్రల ద్వారా చెప్పించడం అన్నది బోర్‌కొట్టేసింది. ఎందుకంటే ఇది పాత టెక్నిక్. ఆది సాయికుమార్ లాంటి ఇమేజ్ లేని హీరోతో డెబ్యూ చేస్తున్నపుడు ఎక్ట్రార్డినరీ కంటెంట్ వుంటే తప్ప జనం మెచ్చరు. ఇంత లైటర్ వీన్ అప్రోచ్‌లో కామెడీ ప్లస్ సెంటిమెంట్‌ని కంగాళీ చేస్తూ తీస్తే ఎలా ఆడుతుందో దీన్ని స్క్రిప్ట్ దశలోనే ఒకటికి రెండుసార్లు చదివితే అర్థమయ్యేదేమో. సెకెండ్ హీరోయిన్ ట్రాక్ మరీ ఆర్ట్ఫిషియల్‌గా వుంది. లేడీ విజయ్ దేవరకొండ అంటూ తనతో హీరోకి పదే పదే ముద్దులు పెట్టించడంలో ఆంతర్యం ఏమిటో? చాలా బలహీనతలవల్లే ఎంత వద్దనుకున్నా బుర్రకథ ప్రేక్షకుడి బుర్ర లాజిక్స్ గురించి ఆలోచించేలా చేసి సహనానికి పరీక్ష పెట్టేలా మారింది.

-త్రివేది