రివ్యూ

పవర్ తగ్గిన కల్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్కి ** ఫర్వాలేదు
**
తారాగణం: రాజశేఖర్, ఆదాశర్మ, నందితాశే్వత, అశుతోష్‌రాణా, నాజర్, శత్రు, జొన్నలగడ్డ, రామకృష్ణ, చరణ్‌దీప్, పూజిత పొన్నాడ తదితరులు.
సంగీతం: శరవణన్ భరద్వాజ్
ఎడిటింగ్: గౌతమ్ నెరుసు
సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర
సమర్పణ: శివానీ, శివాత్మిక ఫిలింస్
నిర్మాత: సి కల్యాణ్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ

**
స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుంటే -కహానీ చిన్నదైనా కూర్చోబెట్టొచ్చని నిరూపించాడు -దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా ‘అ’. యాంగ్రిమెన్ యాక్షన్ చూపించాలంటే తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు -సీనియర్ హీరో రాజశేఖర్. ఆ సినిమా -పీఎస్‌ఎల్‌వి గరుడవేగ. ఈ రెండు సినిమాలతో ఇద్దరూ సక్సెస్‌లు అందుకున్నవాళ్లే. ఆ ఊపులో సక్సెస్ కాంబినేషన్‌తో -తెరకెక్కిన చిత్రం కల్కి. పురణాల్లోని కల్కి కథలు చాలాసార్లు విన్నదే కనుక -ఈ టైటిల్ ప్రకటించగానే ఆడియన్స్ ఓ ఫ్లేవర్‌ను అంచనా వేసేసుకున్నారు. ‘కల్కి’ ఖాకీవేషం వేసుంటాడన్న లెక్కకు వచ్చేశారు. థియేటర్లకు వచ్చిన ‘కల్కి’ ప్రేక్షకుడిని ఎంతమేర సంతృప్తిపర్చాడో చూద్దాం.
ప్రస్తుత కాలమానం ప్రకారం -కథ నాలుగు దశాబ్దాల క్రితం జరుగుతుంది. 1980వ దశకంలో -విలన్ పెరుమాండ్లు (శత్రు) చేతిలో ఉంటుంది కొల్లాపూర్. వాడికి ఎమ్మెల్యే నరసప్ప (అశుతోష్ రాణా) జత కలవడంతో -అరాచకాలు సృష్టిస్తుంటారు. వాళ్లని చూడ్డానికే జనం భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యే తమ్ముడు శేఖర్‌బాబు (సిద్ధు జొన్నలగడ్డ) దీనికి విరుద్ధం. ఊళ్లో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాడు. మంచోళ్లకు రోజులుండవన్నట్టు -శేఖర్‌బాబు దారుణ హత్యకు గురవుతాడు. ఆ హత్య కేసు పరిశోధనకు ఐపీఎస్ కల్కి (రాజశేఖర్) అడుగుపెడతాడు. కొల్లాపూర్‌లో కల్కికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎలాంటి భయానక విషయాలు అనుభవంలోకి వచ్చాయి. ప్రజాదరణవున్న శేఖర్‌బాబుని హత్యచేసింది నరసప్పా? పెరుమాండ్లా? ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా వచ్చిన కల్కి -ఇన్విస్టిగేషన్‌ను ఎలా ముగించాడు. అతనికి నవభారత్ పాత్రికేయుడు దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) ఎలా సహకరించాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు స్క్రీన్‌పై చూడాలి.
ఇన్విస్టిగేషన్ స్టోరీ అనగానే మనకో ప్యాట్రన్ ఫిక్సైపోయి ఉంటుంది. కల్కి కథా అందుకు అతీతంగా లేదు. ‘తీగలాగితే డొంక కదిలింది’ అన్న తీరులోనే -హత్య కేసు ఇన్విస్టిగేషన్‌లో దానిచుట్టూ అల్లుకున్న అనేక విషయాలు కల్కి దృష్టికి వస్తాయి. ఇంతవరకూ ఏ ఇన్విస్టిగేషన్ స్టోరీలోని ప్యాట్రన్ అయినా ఒకేలా ఉంటుంది. ఆ చిక్కుల్ని ఉత్కంఠగా, ఉద్వేగపూరితంగా, ఆసక్తిదాయక పరిశోథనాత్మకంగా -ఏ దర్శకుడు తీసుకెళ్లగలిగితే ఆ సినిమాకు మంచి మార్కులు పడతాయి. కాకపోతే -కల్కి ఇన్విస్టిగేషన్‌ను అంత బలంగా చూపించలేకపోయాడు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. దాంతో -‘అ!’ అనుకుంటూ వెళ్లిన ఆడియన్స్ ‘హా!’ అనుకుంటూ బయటకు రావాల్సి వచ్చింది. దాదాపుగా సీన్సన్నీ ప్రేక్షకుడి ఊహమేరకే వెళ్లిపోతుంటాయి. దీంతో థ్రిల్‌కు అవకాశం లేకుండా పోయింది. అసలు కథను మొదలుపెట్టడంలోనే అడుగు తడబడింది. దాంతో -ప్రథమార్థానికి కథేమీ లేదు. దాంతో సాగదీత సన్నివేశాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘క్రైం సినిమాకు క్రైసిస్‌ను పెంచాలన్న’ రొటీన్ థియరీకి దర్శకుడు ఫిక్సైపోవడంతో -్ఫస్ట్ఫా సీన్సన్నీ హత్యకేసు, అనుమానాల బలోపేతం అన్న పాయింట్‌కే ఉపయోంచుకున్నాడు. ‘ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడి నుంచి కథలో చరుకు’ అన్న భావనా దర్శకుడి మదిలో బలంగా నాటుకోవడంతో -విరామం తరువాతే కథలో వేగం పెంచే సీన్స్ రాసుకున్నాడు. ఫస్ట్ఫాలో రేకెత్తించిన అనుమానాల్ని -సెకెండాఫ్‌లో సమాధానాలు చెప్పుకుంటూ వెళ్లాడు. ‘శేఖర్‌బాబుని హత్య చేసిందెవరు?’ -ఈ ఒక్క పాయింటే ‘కల్కి’ ఇన్టిస్టిగేషన్‌కు కీలకం కనుక -క్లైమాక్స్‌లోని ఆ పది నిమిషాల సన్నివేశాలే ఆసక్తిగా సాగుతాయి. హత్య కేసు ఇన్విస్టిగేషన్‌కు ఒక ఐపీఎస్, అందులోనూ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ రంగంలోకి దిగడం సినిమాటిక్ లిబర్టీ అనుకున్నా -ఆ పాత్ర కనిపిస్తున్నంత సేపూ రియల్‌గా ఫీల్ కాలేకపోతాం. ఇన్విస్టిగేషన్‌ను కల్కికే అప్పగించడం వెనుక కారణమేంటన్నదీ సినిమాలో ఎక్కడా మనకు తోచదు.
థ్రిల్లర్ చిత్రాల్లో ఆడియన్స్ కోరుకునేదే థ్రిల్. అది కల్కిలో పూర్తిగా కరవైంది. పైన చెప్పుకున్నట్టు స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుంటే -కహానీ చిన్నదైనా కూర్చోబెట్టొచ్చన్న ‘పీవీ’ సూత్రం ఇక్కడ ఫలించలేదు. ఎందుకంటే -కల్కి కహానీలో బలం కనిపించలేదు కనుక.
పోలీస్ పాత్ర అంటే రాజశేఖర్ అన్న ఇమేజ్ ఎలాగూ వచ్చేసింది. అంతకుమించి కల్కిలో చూపించిందేమీ లేదు. ఒకవిధంగా అంతకంటే బలహీనమైన ప్రజెంటేషనే ఇచ్చాడు రాజశేఖర్. హీరో పక్కనే రాహుల్ రామకృష్ణ ఎక్కవ సేపు కనిపించటంతో -అతని యాస, పెర్ఫార్మెన్స్ హీరోకీ ఒకింత కలిసొచ్చిందని చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో రాహుల్ బాగానే నవ్వించాడు. డాక్టర్‌గా ఆదాశర్మ, కీలక పాత్రలో నందితా శే్వత పరిధిమేరకు చేశారు. అశుతోష్, శత్రు పెర్ఫార్మెన్స్ కొత్తదేం కాదు. మిగిలిన వాళ్లంతా ఒకే అనిపించటం తప్ప, కథను ముందుకే తీసుకెళ్లేంత ప్రదర్శన లేదు. సాంకేతికంగా సినిమా బావుంది. సినిమాటోగ్రఫీలో దాశరథి శివేంద్ర పనితనం చూపిస్తే, సంగీత దర్శకుడు శరవణన్ భరద్వాజ్ మెప్పించలేకపోయాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

-ప్రవవి