రివ్యూ

బ్రోచేవారెవరురో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రోచేవారెవరురా ** ఫర్వాలేదు
**
తారాగణం: శ్రీవిష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా పేతురాజ్, శివాజీరాజా, హర్షవర్థన్, అజయ్‌ఘోష్, శ్రీకాంత్ కృష్ణస్వామి, బిత్తిరి సత్తి, ఝాన్సీ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: విజయకుమార్ మన్యం
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
**
పిల్లల అభిరుచులకు అనుగుణంగా వారి జీవితాల్ని ఎదగనీయక, తమ నిర్దేశాల ప్రకారమే కన్నవాళ్లుండాలని తల్లిదండ్రులు పట్టుబడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో, ఏతీరుగా మారతాయో అన్న ప్రధాన సూత్రంతో ‘బ్రోచేవారెవరురా’ తయారైంది. అయితే ఈ సూత్రానికి వాణిజ్య హంగులు ఇవ్వాలనే దృక్పథంతో కలిపిన కిడ్నాప్ కామెడీ తదితరాలు చలనచిత్రాన్ని సంచలన రీతిలో సాగనివ్వలేదు. ఒకరకంగా ఈ రకం చలనమే చిత్రాన్ని పలచన చేసిందని చెప్పాలి. (చిత్రమే చలనము -చలనమే చిత్రము అన్న పదబంధాన్ని సినిమా పేరుకు ఉపశీర్షికగా ఇవ్వడం గమనార్హం).
భరతనాట్యంలో ప్రఖ్యాతురాలవ్వాలన్న ఆశయంవున్న మిత్ర (నివేదాథామస్)ను తండ్రి (శ్రీకాంత్ కృష్ణస్వామి) వేరే ఊళ్లో ఉంచి చదివిస్తుంటాడు. అక్కడ తనలాగే చదువుమీద అంతగా ఇష్టంలేని రాహుల్ (శ్రీవిష్ణు), రాకేష్ (ప్రియదర్శి), ర్యాంబో (రాహుల్ రామకృష్ణ) ఆమెకు స్నేహితులవుతారు. తన విషయం వాళ్లతో చెప్పుకుంటుంది. అనంతరం ఎలాగైనా ఆమె ఆశయాన్ని నెరవేర్చాలని మిత్రత్రయం పూనుకుంటుంది. మరి తర్వాత ఏమైందన్నది మిగతా కథ. ఈ కథతోపాటు సమాంతరంగా ఎలాగైనా దర్శకుడు అవ్వాలన్న కోరికతో ప్రయత్నాలు చేసే విశాల్ (సత్యదేవ్), ఆ ప్రయత్నంలో అతనికి తారసపడ్డ నటి శాలిని (నివేదా పేతురాజ్) ఉదంతాలు ఇందులో వస్తాయి. అసలీ రెండో ఉదంతం పెట్టడం సినిమాకు మరింత ఆకర్షణీయ అంశం పెట్టాలనే తలంపుతప్ప, పెద్దగా సమన్వయమూ లేదు. కానీ మొత్తం సినిమా నడకలో ఎక్కడా లాజిక్‌కి తావివ్వలేదు. ఉదాహరణకు జరిగిన అంశం కిడ్నాప్, అది చేసినది ఓ మామూలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అంటే వాళ్లేం ప్రొఫెషనల్స్ కాదు. కానీ ఇందులో పెద్ద అపరాధ పరిశోధన లెవెల్‌లో ఇన్స్‌పెక్టర్ శ్రీను (హర్షవర్థన్) పాత్రతో చేయించడం సంబంధిత వ్యవస్థ సంగతుల్ని అపహాస్యం చేయడమే. కళ్లెదుటే జరిగిన సంగతులకు కావాల్సినంత సాక్ష్యాధారాలు కనపడుతుంటే సన్నివేశాన్ని పొడిగించడంలో సవ్యత కనపడలేదు. అలాగే ఫోను పోయిన సమయంలో లేదా విశాల్, శాలిని కారునుంచి రాహుల్ బ్యాచ్ పది లక్షల బ్యాగ్ దొంగిలించే సమయంలో తారసపడ్డది బిచ్చగాడు ఒక్కడే అన్నది వీళ్లూ గమనించరు. కానీ అతనిపై ఈ రెండు బృందాలకీ దృష్టి పడకపోవడమూ, చిత్రం నిడివి పెంచడానికే తప్ప మరేంకాదని అర్థమవుతుంది. అలాగే అన్నీ అత్యాధునికంగా జమానాకు తగ్గట్టు ఆలోచనలూ, పంచ్‌లు వేసిన వివేక్ ఆత్రేయ (దర్శకుడు) ఇంటర్మీడియట్ క్లాస్‌రూమ్‌లో స్టూడెంట్స్‌ని ఇంకా ఈ చిత్రంలో ‘ఏరా...?’ లాంటి సంబోధనల్ని టీచర్ (ఝాన్సీ) చేయించడం ఏపాటి వివేకంగా ఉందో వారే చెప్పాలి. అయితే కాపాడాల్సిన కన్న తండ్రే ‘నాకు ఇలా జరిగింది’ అని ట్యూషన్ మాస్టర్ ఉదంతం (ట్యూషన్‌కొచ్చిన మిత్రతో అసభ్యంగా ప్రవర్తించడం) చెపితే ‘అదేంకాదు’ అని ఫాదర్ కొట్టిపడేసినపుడు చిత్రం టైటిల్ ‘బ్రోచేవారెవరురా’ బాగా అన్వయమయ్యేలా హీరోయిన్ ద్వారా వౌనంగా వ్యక్తపర్చిన తీరు బాగుంది. అదేవిధంగా కిడ్నాప్ నుంచి పోలీసులు రక్షించి ‘మీవాళ్లని పిలవమన్నపుడు, తండ్రికన్నా ముందు తన బాగోగులు బాధ్యతతో చూసిన రాహుల్‌కే కాల్ చేసిన సందర్భంలోనూ’ బ్రోచేవారెవరో అన్నది ఆమె నిర్థారించుకున్నట్టు ప్రేక్షకుల మనసు తేలికపడింది. కానీ దీర్ఘకాలిక సంగతుల్ని, జరిగిన విషయాల్నీ క్రోడీకరించుకుని, ‘కాదు నువ్వు మీ నాన్ననే పిలు’ అనడంతో సంప్రదాయాన్ని గౌరవించినట్టు అయ్యింది. నటీనటుల పెర్‌ఫార్మెన్స్ విషయాన్ని ప్రస్తావించుకుంటే -ప్రధానంగా ఇది కామెడీ బేస్డ్ కహానీ కనుక, దీనికి ముఖ్యంగా కావాల్సిన టైమింగ్‌ని అందరూ తమ శాయశక్తులా పాటించి సఫలులయ్యారు. తొలినుంచీ తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అదీ చాలా సహజంగా చేసే శ్రీవిష్ణు ఇందులో రాహుల్ పాత్రలో మరోసారి తన పంథా చూపారు. వారికి సరైన తోడ్పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇచ్చారు. నివేదా ద్వయంలో నివేదా థామస్‌కే పాత్ర పరిధి ఎక్కువ కనుక, దాన్ని ఆమె మిత్ర పాత్రలో చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. రాహుల్ తండ్రిగా శివాజీరాజా తరహా పాత్రని ఇంతకుముందు వేశారు కనుక, ఇది చాలా సునాయాసంగా చేశారు. ఇన్స్‌పెక్టర్ శ్రీనుగా హర్షవర్థన్ అందరి ఆలోచనలనీ దృష్టి మళ్లించడంలోనేకాక, సినిమాకు ప్రధాన అంశమైన పెద్దవాళ్లు, పిల్లలతో ఉండాల్సిన తీరు మిత్ర తండ్రితో కారులో చెప్పిన విధానపు సన్నివేశంలోనూ బాగా నటించారు. మిగిలినవారూ తమ తమ పరిధుల్లో చక్కగా నటించారు. సినిమాలో మరో చెప్పుకోదగ్గ అంశం సంభాషణలు. చిన్న చిన్న మాటల్లోనే మంచి మంచి పంచ్‌లు మధురంగా వినిపించేశారిందులో. కెమిస్ట్రీలో ఎన్ని మార్కులు? అంటే ‘్ఫజిక్స్ కంటే ఎక్కువ’.. ఇలా సిట్యుయేషనల్ కామెడీని సంభాషణలతో బాగా ఎలివేట్ చేశారు. సినిమా ఆఖర్లో ‘తెలిసీ.. తెలియక..’ పదాలతో చేసిన డైలాగ్స్ అల్లరీ అలరించింది. కానీ రాహుల్, మిత్ర తండ్రిని తిట్టడంలో ఉపయోగించిన పదాల్ని పదే పదే వినియోగించి సన్నివేశాల్ని మరీ మోటుగా తయారుచేశారు. ‘అసలు వాడు అమ్మాయి తండ్రేనా?’ అన్న మాటకు అది ఆ అమ్మాయి తండ్రిని అడగాలి వంటి ముతక సంభాషణలు లేకపోయినా సినిమాకొచ్చిన నష్టం లేదు. ‘ప్రతి వ్యక్తికి చదువే గోల్ కానక్కరలేదు’ అన్నది ఆలోచించతగ్గ అంశమే అయినా చిత్రాంతాన ‘గోలే లేకపోవడం ఓ పెద్ద గోల్’ అని అర్థంవచ్చేలా అనిపించిన అడ్డగోలు డైలాగులు సరిగ్గా లేవు. పాటలుపరంగా ఇన్ని పాటలు పెట్టాలి, సంగీత దర్శకుడికి పనిపెట్టాలి అన్న పంథాను అనుసరించకపోవడం ఈ చిత్రంలో ఒక విశేషం. అయితే నేపథ్య సంగీతం సన్నివేశాల మూడ్‌ని పెంచేలా వివేక్ సాగర్ (సంగీతం -నేపథ్య సంగీతం) చేయడం ఎన్నదగింది. చిత్ర ఆశయం మంచిదైనా ఆచరణలో అపసవ్యరీతులు అనుసరించకుండా ఉంటే ‘బ్రోచేవారెవరురా..’ని అందరూ ఆహ్లాదంగా ఆస్వాదించేవారు.

-అన్వేషి