రివ్యూ

భలే.. తెలివైన ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గేమ్ ఓవర్ ** ఫర్వాలేదు
**
తారాగణం: తాప్సి, వినోదిని, అనీష్ కురువిల్లా, సంచితా, రమ్య, పార్వతి తదితరులు
కెమెరా: ఏ వసంత్
ఎడిటింగ్: రిచర్డ్ కెవిన్
సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
నిర్మాత: ఎస్ శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్
**
దక్షిణాదిలో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సి ఇక్కడ సరైన సక్సెస్ అందకపోవడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ భిన్నమైన సినిమాల్లో నటిస్తూ మంచి ఇమేజ్ అందుకున్న తాప్సి.. బాలీవుడ్ సినిమాలు చేస్తూనే సౌత్‌లోనూ ఆపకుండా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినా తెలుగును మాత్రం మరిచిపోనని చెప్పిన తాప్సి, తాజాగా గేమ్ ఓవర్ అంటూ ఓ సరికొత్త ప్రయోగం చేసింది. ఇప్పటివరకు రానటువంటి కథనంతో సినిమా ఉంటుందంటూ విడుదలకు ముందు చెప్పుకొచ్చింది తాప్సి. తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఓవర్ కథేమిటి? అసలు గేమ్ ఎలాంటిది? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ
స్వప్న (తాప్సి) ఓ వీడియో గేమ్ డిజైనర్. ఆమెకు గేమ్స్ ఆడడమంటే చాలా ఆసక్తి. తల్లిదండ్రులకు దూరంగా కోకాపేట గేటెడ్ కమ్యూనిటీలో చివరి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది స్వప్న. కేవలం కాలమ్మ (వినోదిని వైద్యనాధన్) అనే పనిమనిషి మాత్రమే తోడుగా ఉంటుంది. అనుకోకుండా స్వప్న జీవితంలో ఓ సంఘటన జరుగుతుంది. అప్పటినుండి స్వప్నకు చీకటంటే భయం పుట్టుకొస్తుంది. అయితే స్వప్న తన చేతికి ఓ పచ్చబొట్టు కారణంగా ఆమె శారీరక హింసను అనుభవిస్తుంది. ఆ పచ్చబొట్టు రంగులో అమృత (సంచిత) అస్తికలు కలవడంతో కథ కొత్తమలుపు తిరుగుతుంది. ఆ పచ్చబొట్టు స్వప్న లైఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపించింది.. ఇంతకీ చనిపోయిన అమృతకు స్వప్నకు సంబంధం ఏమిటి? లాంటి విషయాలే మిగతా కథ. హారరైనా, కామెడీ అయినా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తే చాలు ఏ దర్శకుడైనా సక్సెస్ అయినట్టే. గేమ్ ఓవర్ ఇదే సూత్రాన్ని నమ్ముకుని నడుస్తుంది. మొదట్లో ఓ క్రైమ్ స్టోరీ అనే ఫీలింగ్ కలిగించి ఆ తర్వాత హారర్ ఎలిమెంట్స్‌ని జొప్పించి తెలివిగా చూసేవాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ దర్శకుడు అశ్విన్ శరవణన్ మంచి గేమ్ ఆడాడు. కథలో పాయింట్ కొత్తదే. ఒంటరిగా వుండే ఓ అమ్మాయి ఎమోషన్స్‌ని భయాలను బేస్ చేసుకుని దాని చుట్టూ హారర్ ప్లస్ క్రైమ్‌ని మిళితం చేయాలనుకున్న తీరు బాగుంది. స్క్రీన్‌ప్లే అల్లుకున్న పద్ధతి బాగా కుదిరింది. కాకపోతే కథను చెప్పే క్రమంలో విడివిడిగా ఎపిసోడ్స్‌ని బాగా రాసుకున్న అశ్విన్ వాటిని లింక్ చేయడంతో కొంత తడబాటుకు గురికావడంతో ఫస్ట్‌హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా కేవలం తాప్సీ వన్ విమెన్ షో లాంటిది. హీరో లేడు, పాటలు అసలే లేవు, కనీసం ఎక్కడ మాట కూడా కనిపించదు. గ్లామర్ షోకు ఛాన్స్ లేదు. ఇన్ని పరిమితుల మధ్య తన మీదే పడ్డ భారాన్ని తాప్సీ అద్భుతంగా మోసింది. ఒకరకంగా చెప్పాలంటే పింక్ తర్వాత ఈ గేమ్‌ఓవర్ పెర్‌ఫారమెన్స్ పరంగా బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా టాటూ ఇబ్బంది పెడుతున్న సన్నివేశాల్లో కళ్ళముందే హంతకులు ప్రాణాలు తీయబోతున్నారని తెలిసినప్పుడు వచ్చే సీన్స్‌లోతాప్సీ అద్భుతంగా చేసింది. తనతోపాటు పనిమనిషిగా నటించిన వినోదిని కూడా మంచి మార్కులు కొట్టేసింది. అనుక్షణం స్వప్న బాగోగుల కోసం తపనపడుతూ ఆఖరికి ప్రాణాలకు తెగించి దుండగులను ఎదుర్కొనే ఎపిసోడ్స్‌లో చెలరేగిపోయింది. అనీష్ కురువిల్లా ఉండేది రెండు మూడు సీనే్ల అయినా గుర్తుండిపోతారు. ఫ్లాష్‌బ్యాక్‌లో పేషెంట్‌గా నటించిన సంచన నటరాజన్ తనదైన ముద్ర వేసింది. ఇక సాంకేతికంగా.. దర్శకుడు అశ్విన్ శరవణన్ మరోసారి కమాండింగ్‌గా కథను చెప్పడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. కథ నెమ్మదిగా సాగినప్పటికీ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవాళ్ళను సంతృప్తిపరచాడు. వసంత్ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అవుట్‌డోర్‌లో బ్యూటీ పార్లర్ ఓ కాఫీషాప్ తప్ప మిగిలిన సినిమా మొత్తం ఒకే ఇంట్లో నడుస్తున్నా ఆ మొనాటనీ ఫీలింగ్ రాకుండా ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇక దీనికి మరో ప్లస్ యాడ్ అయింది.. అదే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. రాన్ ఏతన్ యోహాన్ అదరగొట్టాడు. కొన్ని పేలవమైన సన్నివేశాలకు ప్రాణం పోసి ఇంటెన్సిటీ తగ్గకుండా చూసుకోవడంలో ఇతని మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. థీమ్‌కు తగ్గట్టు మారుతున్న వేరియేషన్స్‌ని ఎక్కడా డైవర్ట్ అవ్వనివ్వకుండా సింక్ చేసిన తీరు మెచ్చుకోదగినది. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ సూపర్. వెంకట్ కాచర్ల డైలాగ్స్ జస్ట్ ఓకె. నిర్మాణ విలువలు బాగున్నాయి.
థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవాళ్లకు నచ్చేలా ఇలాంటివి ఓసారి ట్రై చేసి చూద్దాం అనుకునేవాళ్లకు నచ్చే సినిమా ఇది. ఇలాంటి ప్రయత్నాలు సాధారణంగా హాలీవుడ్‌లోనే చూసే మనకు ఇక్కడా అశ్విన్ లాంటి దర్శకులు ప్రయత్నించి వాటిలో లోకల్ ఫ్లేవర్‌ని పర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేస్తున్న తీరు ఎంతైనా అభినందనీయం. ఇది పూర్తిగా ఎక్కడనుంచి స్పూర్తిపొందలేదు అని చెప్పడానికి లేదు. దర్శకుడు అశ్విన్ హాలీవుడ్ సినిమాల నుంచి ప్రభావితం చెందే కథను రాసుకున్నాడు. ప్రేక్షకుడి దృష్టిని తాప్సీ నుంచి పక్కకు మళ్లించకుండా అతను తీసుకున్న జాగ్రత్త చాలామటుకు లోపాలను కాపాడాయి. ఇంటర్వెల్ టైంలో మరీ ఉత్కంఠభరితంగా అనిపించకపోయినా సెకెండ్ హాఫ్‌లో ఒక్కో మూమెంట్ గడిచేకొద్దీ ఎగ్జైట్‌మెంట్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడం పర్‌ఫెక్ట్‌గా సింక్ అయింది. కానీ సీరియల్ మర్డర్స్ ఎందుకు జరిగాయో వాటి వెనుక కిల్లర్ల మోటివ్ ఏంటి అనే ప్రశ్నలకు మాత్రం పూర్తిగా సమాధానం ఇవ్వలేదు అశ్విన్. టాటూలో అమృత ఆత్మ ఉన్నపుడు స్వప్నను అంత హింస పెట్టాల్సిన అవసరం ఎందుకో అర్థం కాదు. స్వప్న వీడియో గేమ్‌ల పిచ్చితో మొదలుకుని అమ్మ నాన్న ఇష్టానికి వ్యతిరేకంగా డిసెంబర్ 31న చేయకూడని పని ఏదో చేసినట్టు ఆడియో క్లిప్ ద్వారా వినిపించడం దాకా ఎన్నో ఉన్నాయి. కాని ప్రేక్షకుడికి ఇవన్నీ లోతుగా ఆలోచిస్తే అర్థమవుతాయి.

-త్రివేది