రివ్యూ

మెప్పించిన కిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిల్లర్ ** ఫర్వాలేదు
**
తారాగణం: అర్జున్, విజయ్ ఆంటోని, ఆషిమా నర్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాళ్, గౌతమ్, సతీష్ తదితరులు
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
సినిమాటోగ్రాఫర్: మాక్స్
సంగీతం: సైమన్ కె.కింగ్
నిర్మాతలు: టి.నరేష్ కుమార్, టి.శ్రీ్ధర్
దర్శకత్వం: ఆండ్రూ లూయిస్
**
హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్’. దియా మూవీస్ బ్యానర్ తమిళంలో నిర్మించిన సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్, టి.శ్రీ్ధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలయింది. మరి కిల్లర్ ఎవరో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
ప్రభాకర్ (విజయ్ ఆంటోని) ఏసిపిగా పనిచేసి కొన్ని కారణాలవల్ల పోలీస్ జాబ్ వదిలేసి వేరే జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే తన ఫ్లాట్‌కి ఎదురుగా వుంటున్న ఆషిమా నర్వాల్‌ను ఫాలో అవుతుంటాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆషిమా నర్వాల్‌ను, ఆమె తల్లిని పోలీస్ ఆఫీసర్ కార్తీకేయ (అర్జున్) ..మినిస్టర్ తమ్ముడు వంశీ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత ఆ అనుమానమే నిజం అనిపిస్తోంది. కానీ అంతలో ఆ హత్య చేసింది నేనే అంటూ విజయ్ ఆంటోని పోలీసులకు లొంగిపోతాడు. అసలు వంశీని హత్య చేసింది ఎవరు? ఇంతకీ విజయ్ ఆంటోనీకి ఆషిమా నర్వాల్‌కి వున్న సంబంధం ఏమిటి? చివరికి వంశీని హత్య చేసిన వ్యక్తిని అర్జున్ పట్టుకున్నాడా లేదా లాంటి విషయాలు అసలు కథ.
క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా సస్పెన్స్‌తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో వంశీ పాత్ర హత్య జరగడం, ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్.. అలాగే సెకెండ్ హాఫ్‌లో వచ్చే విచారణ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ప్రధాన పాత్రలో నటించిన విజయ్ ఆంటోని తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ మెప్పిస్తాడు. ముఖ్యంగా తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే సినిమాలో సీరియస్‌నెస్‌ను మరియు ఇంట్రెస్ట్‌ను మెయింటెయిన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆషిమా నర్వాల్ తన పాత్రకు తగ్గట్టు.. తన నటనతో గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఆమె తల్లిగా నటించిన సీత కూడా చాలా బాగా నటించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలాబాగుంది. సంగీత దర్శకుడు సైమన్ కె.కింగ్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘చంపొద్దే చంపొద్దే’ అనే పాట, ఆ పాటను చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. ఎడిటర్ వర్క్ బాగుంది. సినిమాలోని నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఆండ్రూ లూయిస్ మంచి కథాంశంతోపాటు ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకున్నాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆయన కాస్త తడబడ్డాడు. కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథ, కథనాలు మరీ సీరియస్‌గా సాగడం.. దానికితోడు కొన్ని సన్నివేశాల్లో ఫ్లో మిస్సవ్వడంతో అక్కడక్కడ సినిమా బోర్ కొడుతుంది. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం కొంతమేరకు లోపించినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు చాలా సినిమాటిక్‌గా ఉన్నాయి.
విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్‌తోపాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. మెయిన్‌గా క్రైమ్ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు అర్జున్- విజయ్ ఆంటోనీల నటనను బాగా అలరిస్తాయి. అయితే దర్శకుడు రాసుకున్న స్క్రీన్‌ప్లే మరీ సీరియస్‌గా సాగడం, కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి.

-త్రివేది