రివ్యూ

కలిసిరాని నెంబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెవెన్ * బాగోలేదు
*
తారాగణం: హవీష్, రెజినా కాసాండ్ర, పూజిత పొన్నాడ, నందిత శే్వత, త్రిదాచౌదరి, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, రెహమాన్ తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్.
సంగీతం: చైతన్ భరద్వాజ్
కథ,స్క్రీన్‌ప్లే, నిర్మాత: రమేష్ వర్మ
కెమెరా, దర్శకత్వం: నిజార్ షఫీ
*
సాధారణంగా థ్రిల్లర్ జోనర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారన్నది విధితమే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా సరికొత్త తరహాలో థ్రిల్లర్ సినిమాలు తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటాయి. సరైన కంటెంట్, క్రూ ఉంటే చాలు. తాజాగా తెలుగులో ఈతరహా కథతో రెడీ అయ్యాడు హీరో హవీష్. కొంత గ్యాప్ తరువాత హవీష్ హీరోగా థియేటర్లకు వచ్చిన చిత్రం సెవెన్. కెమెరామెన్ నిజార్ షఫి దర్శకత్వంలో రమేష్ వర్మ అందించిన కథలో ఆరుగురు హీరోయిన్లకు చోటుదక్కింది. కథలో ఒక హీరో, ఆరుగురు హీరోయిన్ల కమామీషేంటి? సెవెన్ దేనికి సంకేతం? ఈ విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ:
కార్తీక్ (హవీష్) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ, అమెరికా వెళ్లే గోల్‌తో ఉంటాడు. అదే సమయంలో రమ్య (నందిత శే్వత) తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. తన భర్త కార్తీక్ కోసం జెన్నీ (అనీషా ఆంబ్రోస్) సైతం అదే తరహా కంప్లైట్ ఇస్తుంది. ఆ తరువాత అదితి ఆర్య. -ఇలా ముగ్గురూ ఒకే పోలీసు స్టేషన్‌లో భర్త కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేస్తారు. ముగ్గురి ఫిర్యాదుల నిగ్గు తేల్చేందుకు పోలీసుల గాలింపు మొదలెడతారు. అయితే, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలుస్తుంది. ముగ్గురు ఫిర్యాదుల్లోని భర్త కార్తీక్ ఒక్కడేనన్నది ఆ షాకింగ్ విషయం. మూడు ఫిర్యాదులను ఓకే కేసు చేసిన పోలీసులు, కార్తీక్ ఆచూకీ కోసం రంగంలోకి దిగుతారు. అమ్మాయిలను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న కార్తీక్‌ని పట్టుకుంటారు. కేసు కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో -కార్తీక్‌లాగే మరో వ్యక్తి ఉన్నాడని, అతని పేరు కృష్ణమూర్తి అని పోలీసులకు తెలుస్తుంది. అసలు ఈ అమ్మాయిలను మోసం చేసింది కార్తీకా? లేక కృష్ణమూర్తా? అన్న అనుమానం తలెత్తుతుంది పోలీసులకు. దర్యాప్తు ముమ్మరం చేస్తారు. అసలు కార్తీక్ జీవితంలో జరిగిందేమిటి? కృష్ణమూర్తి నిజంగా ఉన్నాడా? అన్నది అసలు కథ.
పాత్రకు తగిన నటన ప్రదర్శించటంలో హవీష్ ఓకే అనిపించాడు. రెండు భిన్నమైన పాత్రల్లో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. గ్లామర్ హీరోయిన్ రెజీనా తన పాత్రకు న్యాయం చేసింది. రెజీనా తన పాత్రతో కథను నిలబెట్టే ప్రయత్నం చేసింది. మరో కీ రోల్ పోషించిన నందిత శే్వత నటన హైలెట్. తనదైన నటన, గ్లామర్‌తో ఆకట్టుకుంది. మిగతా హీరోయిన్లు పూజిత, త్రిదాచౌదరి, అనీషా, అదితి ఆర్య తమ తమ పాత్రల్లో ఓకే అనిపించారు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన రెహమాన్ తనదైన స్టైల్‌లో కథను ముందుకు నడిపించాడు. స్పాన్‌వున్న లైన్ అయినా, కథనంలో బలహీనతలు సినిమాను మెట్టేక్కించలేకపోయాయి. కథపై ఆసక్తిని పెంచే కొన్ని ట్విస్టులు కథలో భాగంగా వచ్చినా, కథనంతో వాటిని బలంగా ప్రయోగించలేకపోయారు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్.. రెజీనా పాత్రకు సంబంధించిన సన్నివేశాలు బాగున్నాయి.
చైతన్య భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో బాగుంది. సినిమాటోగ్రాఫర్ షఫీ పనితనాన్ని చూపించాడు. రెండో భుజంపై దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి రావడంతో -కథకు సరైన న్యాయం చేయలేకపోయాడు. ఆసక్తికరమైన కథను ఎంచుకున్నప్పటికీ పట్టు తప్పకుండా నడిపించటంలో దర్శకుడి వైఫల్యం, అంతకుమించి కన్ఫ్యూజన్ కనిపించింది. థ్రిల్లర్ సినిమాలకు కావలసిన అంశాలు చాలా ఉన్నప్పటికీ కథనంలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ముందే తెలిసిపోవడంతో సినిమాపై ఆసక్తి తగ్గింది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకాలేదు. కథలో కొత్తదనం లేకున్నా, స్క్రీన్‌ప్లేపై ఇంకొంచెం వర్కౌట్స్ చేసివుంటే, బోర్‌డమ్‌ను తగ్గించగలిగే అవకాశం ఉండి ఉండేది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు సినిమా ఎక్కదు.
రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన సెవెన్‌లో -ప్రచారంలో పెంచిన ఆసక్తి లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశపర్చింది. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్న పదాలు వాడటమే తప్ప, హీరో హీరోయిన్ల లవ్‌ట్రాక్ అలాంటి జోనర్ ఎక్కడా కనిపించలేదు. కథానుసారం వచ్చే ట్విస్టులూ ప్రేక్షకుడికి థ్రిల్‌ని ఇవ్వలేకపోయాయి. సన్నివేశాల్ని ముందే ఊహించేసే పరిస్థితి కనిపించింది. మొదటి భాగంలో కనిపించిన వేగం, సెకెండాఫ్‌లో మిస్సవ్వడంతో ఆడియన్స్ బోర్ ఫీలయ్యారు. హీరో ప్లస్ ఆరుగురు హీరోయిన్లు అనుకోవడం తప్ప -హవీష్, రెజీనా, నందిత శే్వత పాత్రలే హైలెట్. మిగిలిన పాత్రలు లెక్కకోసమే.

-శ్రీనివాస్ ఆర్ రావ్