రివ్యూ

దడి దాటని దాస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * ఫలక్‌నుమా దాస్

తారాగణం: విశ్వక్‌సేన్, తరుణ్ భాస్కర్, సలోని మిశ్రా, ఉత్తేజ్, హర్షితా గౌర్, అభినవ్ గోమతం తదితరులు
సంగీతం: వివేక్‌సాగర్
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత
ఎడిటర్: రవితేజ
నిర్మాణ సంస్థ: వాన్మయి క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ సేన్
*
ఫార్మాట్‌ను వీడి ప్రాక్టికాలిటీ వైపు పరుగులు తీసేందుకు తెలుగు సినిమా బలమైన ప్రయత్నాలే చేస్తోంది. అలాంటి ప్రయత్నాలను ప్రేక్షకుడూ ఆదరిస్తున్నాడు. సినిమాను ఓన్ చేసుకుంటున్నాడు. హిట్టు మార్కు వేసేస్తున్నాడు. తెరపై వాస్తవికతను ప్రతిబింబించడమే ఇప్పటి సినిమాటిక్ ప్రాక్టికాలిటీ. దీనిపై కుర్ర హీరోలు, దర్శకులు పెద్దగానే ఫోకస్ పెడుతున్నారు. అయితే, ఆ ఉత్సాహంలో ఒక్కోసారి తప్పటడుగులు తప్పడం లేదు. సినిమాకు ఉండాల్సిన ప్రధాన లక్షణాన్ని తెరవెనుక వదిలేసి -రియల్ క్యారెక్టర్స్.. క్యారెక్టరైజేషన్, రియల్ సీన్స్, రియల్ స్టోరీ, రియల్ లొకేషన్స్.. ఇలా ప్రతీ విషయంలో రియాలిటీ కోసం పడే తాపత్రయంలో ‘సోల్’ను తెరవెనుకే వదిలేస్తుండటంతో -సినిమా ఎటో పోతోంది. ఈ ఉపోద్ఘాతానికి బెస్ట్ ఎగ్జాంపుల్ -్ఫలక్‌నుమా దాస్. ‘అంగములై డైరీస్’ మలయాళ చిత్రానికి రీమేక్ ఇది. పొరుగు పరిశ్రమ నుంచి సీడ్‌ని తెచ్చారు. కాని, సోల్‌ని వదిలేశారు. దాంతో ‘మాసిజం’ నిర్వచనమే మారిపోయి -దాస్ ఫలక్‌నుమా దాటి బయటకు రాలేకపోయాడు.
**
ఫలక్‌నుమా వాతావరణంలో పుట్టి పెరిగిన గల్లీ కుర్రాడు దాస్ (విశ్వక్ సేన్). ఫలక్‌నుమా దాస్. వాడికి -శంకరన్న ఇన్‌స్పిరేషన్. శంకరన్న మాదిరిగా గూండాయిజంతో ఎదగాలన్నది దాస్ ఆశ. వాడితోపాటూ ఆశా పెరిగి పెద్దదవుతుంది. ఫలక్‌నుమాలోని కుర్రాళ్లను వెనకేసుకుని తిరుగుతుంటాడు. ఎదురొచ్చిన వాడిని బెదిరించడమే వాళ్ల వ్యాపకమవుతుంది. దాంతో చదువు పక్కదారి పడుతుంది. ఈ గ్యాంగ్‌ని సపోర్ట్ చేస్తుంటాడు పాండు (ఉత్తేజ్). ఎంచుకున్న పనేదైనా మనీ అవసరాలు మామూలే కనుక -దాస్‌కి డబ్బు అవసరమవుతుంది. పైగా చెల్లి పెళ్లి చేయాలి. దాంతో ఫ్రెండ్స్‌తో కలిసి మటన్ బిజినెస్‌కు దిగుతాడు. అందుకోసం పొట్టేళ్ల హోల్‌సేల్ బిజినెస్ చేసే రవి, రాజుల్ని కలవాల్సి వస్తుంది. పాత పగలతో శంకరన్నను చంపేసి జైలుకెళ్లి వచ్చిన రౌడీలు వాళ్లు. సో, ఇష్టం లేకున్నా ఆప్షన్ లేక డీల్‌కు రెడీ అవుతాడు. క్రమంగా సొంతంగానే పొట్టేళ్ల దిగుమతి బిజినెస్ మొదలెడతాడు దాస్, అతని స్నేహితులు. ఇదే రౌడీ బ్రదర్స్ కోపానికి కారణమవుతుంది. పైగా ఓ బార్‌లో రౌడీ బ్రదర్స్ బావమరిదితో తలెత్తిన వైరం -దాస్‌ని చిక్కుల్లోకి నెడుతుంది. ఆ క్రమంలో ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. దాన్నుంచి బయటపడాలంటే పాతిక లక్షలు కావాలి. డబ్బు కోసం ఎంచుకున్న అనేక మార్గాలు మరిన్ని తలనొప్పులకు కారణమవుతుంది. ఈ పరిస్థితిని దాసు ఎలా ఎదుర్కొన్నాడన్నదే మిగతా సినిమా.
ముందే చెప్పుకున్నట్టుగా మలయాళం సినిమా నుంచి తెచ్చుకున్న సీడ్‌ను యథాతథంగా అమలు చేశాడు విశ్వక్ సేన్. కథను ఓల్డ్‌సిటీ నేపథ్యానికి అన్వయించే ప్రక్రియలో దర్శకుడి కష్టం కనిపించింది. టైటిల్‌ని జస్టిఫై చేసేందుకన్నట్టు -కెమెరా ఆరంభం నుంచే ఫలక్‌నుమా వీధుల్ని ఫోకస్ చేస్తుంది. కాకపోతే ‘స్టయిల్’ కనిపించింది తప్ప ‘లైఫ్’ మిస్సైంది. ఓల్డ్‌సిటీలోని ముఖ్య ప్రాంతమైన ఫలక్‌నుమా జీవన సంస్కృతి, స్వభావాలు, కుర్రాళ్ల అలవాట్లు, రౌడీ ఎలిమెంట్స్.. ఇలా ‘కథ’ అనే వస్తువుతో సంబంధం లేకుండా ఈ సన్నివేశాలే కథలా సాగిపోతుంటాయి. సినిమా మొత్తం.. ‘దాస్ -వాడి జీవితంలోని అనేక దశలు’ అన్నట్టుగానే సాగిపోతుంది. కుర్రాళ్లతో కలిసి చేసే అల్లరి.. దేనికైనా ఎదురెళ్లడం.. ఇబ్బందులను అధిగమించడంలో తెంపరితనం.. మాటకు మాట, దెబ్బకు దెబ్బ.. మందుకొట్టడం.. అడ్డొచ్చినవాళ్లను తన్నడం.. దాస్ గ్యాంగ్ ఎపిసోడ్స్‌లో ఇంతకంటే ఎక్కువేం లేదు. ఆరంభంలోనే ఇదంతా చూపించేయడంతో -్ఫస్ట్ఫాతోనే ప్రేక్షకుడు ఓ అంచనాకు వచ్చేశాడు. ఇక దాస్‌కు మూడు ప్రేమ కథలుంటాయి. ఏ ఒక్కటీ హార్ట్ టచ్చింగ్ అనిపించదు. స్నేహితుల గ్యాంగ్ పెద్దదే అయినా, ఏ ఒక్కడూ రిజిస్టర్ కాడు. ప్రతి సీన్‌లో నాలుగు మందు చుక్కలు, ఎనిమిది మటన్ ముక్కలు.. పదహారు బూతుముక్కలు.. -ఇదే మాసిజం అన్నట్టు సాగిపోయింది.
కథానాయకుడి పాత్రకు ఓ లక్ష్యం.. ఆ లక్ష్యంవైపు ఆసక్తికరంగా నడిపించగలిగే భావోద్వేగం కథలో కొరవడటంతో -ద్వితీయార్థం మరింత గాడితప్పింది. అవసరమైన వాటికంటే అనవసర సన్నివేశాలు సుదీర్ఘంగా సాగుతుంటే -్భరించటం కష్టమవుతుంది. ఈ కారణంగానే -క్లైమాక్స్‌లో దర్శకుడు చేసిన 13 నిమిషాల సింగిల్ షాట్ సీన్‌కూ అర్థం లేకుండా పోయింది. అన్నీ ఎక్కువే అయినా ఆత్మ లేకపోవడంతో -్ఫలక్‌నుమా దాస్ కొంచెం కూడా మెప్పించలేకపోయాడు.
ప్రాక్టికాలిటీపై ఫోకస్ పెట్టామన్న ఆలోచనకు అంతా ఫిక్సయిపోవడంతో -కథానాయకుడు విశ్వక్‌సేన్ తహా మిగిలిన ఆర్టిస్టులూ అదే మూడ్‌ను చూపించారు. ఏ పాత్రా నటిస్తున్నట్టు ఎక్కడా అనిపించదు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో విశ్వక్‌సేన్ ఓకే అనిపించాడు. ముగ్గురు హీరోయిన్లు, స్నేహితుల బృందం, రౌడీ గ్యాంగ్.. వీళ్లలో ఎవ్వరూ ఆడియన్ మైండ్‌లో రిజిస్టర్ కాలేదు. పాత్ర పరిధి మేరకు కనిపిస్తారు. దాస్ గ్యాంగ్‌కి పెద్ద దిక్కుగా కనిపించే పాండు పాత్రలో ఉత్తేజ్, పోలీస్ పాత్రలో దర్శకుడు తరుణ్ భాస్కర్ మెప్పించారు. కెమెరా, మ్యూజిక్.. సాంకేతిక పనితనం బావుంది. నిడివి ఎక్కువ.. వినోదం తక్కువ. ఫలక్‌నుమా ఏరియాను దాస్ దాటడం కష్టమే.

-‘వి’