రివ్యూ

ప్చ్.. రాత దాట లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీత * బాగోలేదు

నటీనటులు:బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్, మన్నార చోప్రా, సోనూసూద్, తనికెళ్ళ భరణి తదితరులు
ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు
కెమెరా:శిరీషా రే
సంగీతం:అనూప్ రూబెన్స్
నిర్మాత:అనీల్ సుంకర
దర్శకత్వం:తేజ
=================================================================
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా రెండో ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం సీత. మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం కవచం. సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కింది. విడుదలకు ముందునుండి భారీ అంచనాలు పెంచుకున్న సీత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీత ఎవరు? ఆమె కథ ఏమిటో తెలుసుకుందామా?
కథ
సీత (కాజల్) మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి తప్ప ఇక్కడ మనుషులకు విలువలేదని నమ్మే అమ్మాయి. అందుకే డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న పక్కా స్వార్థపరురాలు అని చెప్పాలి. తన స్వలాభం కోసం ఎవరి జీవితంతోనైనా ఆడుకుంటుంది. అలాంటి సీత ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంలో భాగంగా లోకల్ ఎంఎల్‌ఏ అయిన బస్వరాజు (సోనూసూద్)తో ఓ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ అగ్రిమెంట్‌వల్ల చిక్కుల్లో పడుతుంది సీత. దాన్నుంచి బయటపడటానికి డబ్బులు అవసరం అవుతాయి. అలాంటి సీత అమాయకుడైన తన బావ రామ్(శ్రీనివాస్)ని పెళ్లి చేసుకుంటుంది. రామ్ చిన్నప్పటినుండి సమాజానికి దూరంగా ఎలాంటి కుళ్లు, కుతంత్రాలు తెలియని సమాజంలో చదువుకుంటూ పెరుగుతాడు. అదే బౌద్ధారామం. రామ్‌తో పెళ్లి జరగాలంటే రామ్ దగ్గరున్న డబ్బును తన ఖతాలోకి మార్చమంటుంది సీత. రామ్ పేరుమీదున్న ఆస్తిపైనే సీత ఆసక్తి తప్ప రామ్ అంటే అంత ఆసక్తి ఉండదు. సీతను దక్కించుకునేందుకు వెంబడిస్తున్న బస్వరాజు నుండి రామ్ ఎలా సీతను కాపాడాడు? రామ్ మనసును సీత అర్థం చేసుకుందా? అన్నది మిగతా కథ.
సీత.. కథ మొత్తం తన భుజంపై వేసుకుని నడిపించింది కాజల్. ఎవరినీ లెక్కచేయనితనం, ఓటమిని అంగీకరించని ప్రామిసింగ్ విమెన్‌గా మంచి ఆటిట్యూడ్ చూపించింది కాజల్. ఓ వైపు మంచి అమ్మాయిగా, మరోవైపు నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో రెండు షేడ్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. ఈ పాత్రను బట్టి చూస్తే కాజల్ నెక్స్ట్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక అమాయకుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ నటన ఆకట్టుకుంది. అల్లుడు శీను తరహాలో మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇక సోనూసూద్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎంఎల్‌ఏ బస్వరాజుగా సూపర్ అనిపించాడు. ఆయనకు సపోర్టింగ్ రోల్‌లో తనికెళ్ల భరణిల కాంబినేషన్ అదిరింది. ఇక బిత్తిరి సత్తి కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విషయంలో కాజల్, సోనూసూద్‌ల మధ్య నువ్వా నేనా అనే తరహాలో పోటీ నిలిచింది.
ఈ సినిమా విషయంలో సీనియర్ దర్శకుడు తేజ గురించే చెప్పాలి. కథ, కథనం విషయంలో తేజ ఆకట్టుకునే స్థాయిలో కథను నడిపించలేదు. కాజల్ పాత్రపై పెట్టిన దృష్టి కథనంపై పెట్టలేదు. ఇక అనూప్ అందించిన సంగీతం ఫర్వాలేదు. బుల్‌రెడ్డి సాంగ్ బాగానే ఆకట్టుకుంది. రీ రికార్డింగ్ జస్ట్ ఓకె. ఇక కెమెరా పనితనం బాగుంది. చాలా సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. తేజ సినిమాలో కథ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది కానీ ఈ సినిమా విషయంలో అలాంటి అనుభూతి కథలో కలగదు. ఎక్కడా ఆకట్టుకోని కథ. కాజల్ లాంటి పాత్రలను మనం ఇదివరకే చాలా చూసేశాం. అలాంటి పాత్రను మెయిన్ లీడ్‌గా తీసుకుని కథ అల్లుకున్నాడు తేజ. కథనం ఏ మాత్రం పెద్దగా ఆసక్తిలేని మలుపులతో సాగుతూ బోర్ కొడుతుంది. సీత అంటూ విమెన్ సెంట్రిక్ కథను తీసుకొని కాజల్ మెయిల్ లీడ్‌గా పెట్టి దర్శకుడు తేజ చేసిన ఈ ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోదు. కథలో ఎక్కడా మలుపులు కానీ ట్విస్ట్‌లుగానీ లేవు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించగలడు. ఇక హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ని ఈ పాత్రలో ఊహించుకోవడం కష్టం. కొంచెం కామెడీ వున్నప్పటికీ హీరో పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేకపోవడం బోర్ కొడుతుంది. ఇక కథలో చాలా లాజిక్స్ మిస్సయ్యాయి. ఒక్క సాంగ్ కూడా ఆకట్టుకునేలా లేదు. తేజ నుండి ఇలాంటి సినిమాను ఎవ్వరూ ఊహించరు. మొత్తానికి సీత అంటూ తేజ ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.

-త్రివేది