రివ్యూ

సరికొత్త పాత పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రలహరి ** ఫర్వాలేదు
**
తారాగణం: సాయితేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురాజ్, పోసాని, సునీల్, వెనె్నల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి.
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.
**
వరుసగా ఆరు ఫ్లాపులు చూసిన హీరో సాయితేజ్. అందుకే ఈసారి కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కథలపై ఫోకస్‌పెట్టాడు. అదే చిత్రలహరి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా థియేటర్లకు వచ్చింది. సక్సెస్‌కోసం పేరును రిపేర్ చేసుకున్న ఈ హీరోకు ‘చిత్రలహరి’ ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూద్దాం.
కథ:
విజయ్‌కృష్ణ (సాయితేజ్)కు తన పేరులోని విజయం జీవితంలో ఉండదు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ తగిన ఫలితం దక్కక నైరాశ్యంలో ఉంటాడు. ఇలాంటి సమయంలో అతడికి లహరి (కళ్యాణి ప్రియదర్శిని) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ కొన్నాళ్ల తర్వాత విజయ్ తీరు నచ్చక అతడికి దూరమవుతుంది లహరి. జీవితంలో విజయం సాధించలేక.. అటు ప్రేమించిన అమ్మారుూ దూరమై మరింత వైరాగ్యంలోకి వెళ్లిపోతాడు విజయ్. ఇలాంటి స్థితినుంచి తనను తాను మలచుకుని ఎలా జీవితంలో, ఇటు ప్రేమలో గెలిచాడన్నదే మిగతా కథ.
సాయితేజ్‌గా మారిన సాయిధరమ్ తేజ్ పేరుకుతగ్గట్టే కొత్తగా కనిపించే ప్రయత్నం చేసాడు. అతడి గత సినిమాల ఛాయలేమీ ఇందులో కనిపించవు. ఎక్కడా హీరోయిజం లేకుండా సగటు కుర్రాడిగా అతడిని చూస్తుంటే పాత్రే తప్ప ఎక్కడా సాయితేజ్ కనిపించడు. లుక్, బాడీలాంగ్వేజ్, నటన ఇలా అన్నింట్లోనూ కొత్తదనం చూపించాడు. పాత్రకు తగిన న్యాయం చేశాడు. ఎమోషనల్ సన్నివేశాలను ఇంకాస్త బెటర్ చేయొచ్చు. హీరోయిన్లు కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురాజ్‌లు తమ పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. మొదట్లో ఆసక్తికరంగా సాగిన వాళ్ల పాత్రలు తర్వాత సాధారణమైపోయాయి. పోసాని నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సునీల్ చాలా రోజుల తరువాత సపోర్టింగ్ రోల్‌లో బాగా చేసాడు. బ్రహ్మాజీ, వెనె్నల కిషోర్, జయప్రకాష్ వారివారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.
టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే.. దేవిశ్రీప్రసాద్ ‘ప్రేమ వెనె్నల’ పాటతో తన ప్రత్యేకత చాటుకున్నాడు. గ్లాస్‌మేట్స్ సాంగ్ పర్వాలేదు. మిగతా పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. దేవి సంగీతపరంగా ఇంకా ఏదో మిస్సైన భావన కలుగుతుంది. పాటలు తగ్గిన ఫీలింగూ కలుగుతుంది. నేపథ్య సంగీతం బాగుంది. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. రచయిత, దర్శకుడు కిషోర్ తిరుమల సంభాషణల దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసాడు. కానీ అతను ఎంచుకున్న కథలో కత్తదనం లేదు. కథనం కూడా సాఫీగా సాగదు. తన గత సినిమాల్లో మాదిరి ఇందులో అతను ఎమోషన్ పండించలేకపోయాడు. సన్నివేశాల్ని ఆహ్లాదకరంగా నడిపించడంలో కిషోర్ ప్రత్యేకత కనిపిస్తుంది కానీ.. కథనం మరి స్లోగా సాగడం కొంత బోర్‌కొట్టే విషయం. ఏ అడ్డంకులూ లేకుండా జీవితంలో విజయం సాధించినవాళ్ల కథలు ఎవరికీ ఆసక్తి కలిగించవు. ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి. ఓటములు ఎదుర్కోవాలి. తర్వాత విజయం సాధించాలి. ఇలాంటి కథలు వినడానికైనా.. చదవడానికైనా.. తెరపై చూడటానికైనా బాగుంటాయి. వెండి తెరపై ఇదో పెద్ద సక్సెస్ స్టోరీ. ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యే ఇలాంటి కథలు తెరపై బోలెడన్ని చూశాం. ఈ కోవలోనే వచ్చిన కొత్త సినిమా ‘చిత్రలహరి’. విజయంకోసం పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి.. చివరగా ఒక బ్రేక్ సాధించిన ఓ వ్యక్తి కథను చెప్పే ప్రయత్నం చేశాడు కిషోర్ తిరుమల. అతడి ప్రయత్నంలో ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇందులో ఆసక్తి రేకెత్తించే పాత్రలున్నాయి. కథాకథనాల్లో అక్కడక్కడా మంచి ఫీల్ కనిపిస్తుంది. ఆహ్లాదం పంచే సన్నివేశాలూ ఉన్నాయి. కానీ ‘చిత్రలహరి’ని ఒక పెద్ద సక్సెస్ స్టోరీ చేయడానికి అవకాశాలున్నప్పటికీ.. ఆ దిశగా అనుకున్నంత కరసత్తు చేయలేదనిపిస్తుంది. ఇందులోని పాత్రల్లో కావచ్చు, ప్రేమకథలో కావచ్చు, కథలో మలుపుకు కారణమయ్యే కాన్ఫ్లిక్ట్ పాయింట్లో కావచ్చు.. ఉండాల్సినంత గాఢత లేదు.
కథలో ఏ కొత్తదనం లేదు. కథనం.. పాత్రల చిత్రణలో ప్రత్యేకత చూపించడం ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించాలని చూశాడు దర్శకుడు. ఆ ప్రయత్నం కొంతమేర విజయవంతమైంది. హీరో హీరోయిన్లతోపాటుగా సహాయ పాత్రలకూ వ్యక్తిత్వం ఉండేలా తీర్చిదిద్దడం ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు పోసాని చేసిన హీరో తండ్రి పాత్ర. కొడుకు ఫెయిల్యూర్లతో అల్లాడిపోతుంటే.. అతడిలో ధైర్యం నింపి, విజయం దిశగా నడిపించే ఆ పాత్ర ప్రేక్షకుల్ని ఇట్టే మెప్పిస్తుంది. తండ్రీ కొడుకుల బంధం.. వారిమధ్య వచ్చే సన్నివేశాలు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక హీరోయిన్లిద్దరి క్యారెక్టరైజేషన్‌లోనూ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. హీరో పాత్ర సైతం ప్రత్యేకత చాటుకుంటుంది. ఐతే ఈ పాత్రల్ని సరిగ్గా ఉపయోగించుకునేలా బలమైన కథ రాయడంలో కిషోర్ విఫలమయ్యాడు.
హీరో హీరోయిన్లు ప్రేమలో పడటానికి సరైన కారణాలు కనిపించవు. అలాగే విడిపోవడానికి దారితీసిన కారణాలూ చిన్నగానే కనిపిస్తాయి. ప్రేమకథ బలహీనమనే సంగతి పక్కన పెడితే... ప్రథమార్థం చాలావరకు ఆహ్లాదంగానే సాగిపోతుంది. ద్వితీయార్థంలో కథపై ఒక అంచనాకు వచ్చేయడం.. నేరేషన్ మరీ స్లో అయిపోవడంతో కొంచెం భారంగానే గడుస్తుంది. అంతిమంగా హీరో విజయం సాధించడమే ఈ కథకు ముగింపు అన్నది అర్థమైపోతుంది. హీరో విజయానికి దారితీసే ‘యాప్’ వ్యవహారం ఏమంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. మరోవైపు హీరో ప్రేమకథలో వచ్చే మలుపులు.. దాని ముగింపుకూడా మామూలుగా అనిపిస్తాయి. ఒకసారి బ్రేకప్ అయి మళ్లీ ఎదురుపడ్డాక ప్రేమికులిద్దరూ స్పందించే తీరు కొంచెం చిత్రంగానే అనిపిస్తుంది.

-త్రివేది