రివ్యూ

సౌండ్ ఫుల్.. సీన్ నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెస్సీ * బాగోలేదు
*
తారాగణం: ఆషిమా, శ్రీతచందన, కబీర్‌సింగ్, అతుల్ కులకర్ణి తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
కూర్పు: గ్యారీ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వినీ కుమార్
*
ఏ హారర్ సినిమా చూసినా తీరొక్కటేనన్న జ్ఞానాన్ని -అనేక హారర్ సినిమాలు ఆడియన్స్‌కి ఎప్పుడో ఇచ్చేశాయి. కనీసం వచ్చే హారర్ ‘సిత్రమైనా’ ఒకింత వైవిధ్యంగా ఉండకపోతుందా? అన్న ఆలోచనతో ఆడియన్స్ భయపెట్టే సినిమాల కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు. భయం పుట్టించే బంగ్లా. అయినా ఎవరోకరు అక్కడికి రాకపోతారా అన్నట్టు ఎదురు చూసే దెయ్యం. అలా దారితప్పో, ధైర్యం ఎక్కువయ్యో.. అక్కడకు వెళ్లిన వాళ్లతో కాసేపు కాలక్షేపం. మధ్యలో ఫార్మాట్ తు.చ తప్పకుండా కాపీ శబ్ధాలు. ఇవేగా హారర్ సినిమా అంటే -అని ఆడియన్స్ ఎప్పుడో పెదవి విరిచేయడం మొదలెట్టారు. ఈ సినిమా అలాంటిది కాదంటూ ‘ట్రైలర్’తో చెప్పేందుకు ప్రయత్నించింది జెస్సీ. టెర్రర్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్.. ఇలా మాల్ మసాలాని కలుపుకుని ఇప్పుడు థియేటర్లకు వచ్చింది. ఇందులోని వైవిధ్యం పాళ్లెంతో తూకమేసి చూద్దాం.
జెస్సీ (ఆషిమా), అమీ (శ్రీత చందన) సిస్టర్స్. చెల్లి అమీకి చిత్రమైన మానసిక సమస్య. పెరగాల్సిన వయసు తగ్గుతూంటుంది. పైగా స్వాభావిక మతిమరుపు, కోపం. దీంతో దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంటుంది. అమీ ప్రవర్తనకు భయపడిన జెస్సీ, మెంటల్ డాక్టర్ల సాయం తీసుకున్నా ఫలితముండదు. భూతవైద్యుడ్ని సంప్రదిస్తే -జెస్సీలో ఓ ఆత్మ ప్రభావం అంటాడు. ఆ ఆత్మ ఎవరిది, అసలేం జరిగింది? అన్నదే కథ.
పైన చెప్పుకున్నట్టు -గోస్ట్ హంటర్లుగా కొందరు బంగ్లాలోకి అడుగుపెట్టడం, దెయ్యాన్ని నిర్థారించే శోధన.. ఇవే సన్నివేశాలు జెస్సీలోనూ గోచరిస్తాయి. కాకపోతే -్ఫ్లష్‌బ్యాక్ నుంచి కథకు ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. తొలి సగభాగం కథలో విశ్రాంతి నుంచి షార్ప్ టర్న్ ఇవ్వడంతో -థ్రిల్‌నిచ్చిన ట్విస్ట్‌తో కొత్త కథను ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ, అప్పటికే దర్శకుడు తనంతట తానుగా వేసుకున్న లాక్‌లు ఓపెన్ చేయడంతోనే కథ కాస్తా పక్కదారి పట్టేసింది. పోలీస్ ఆఫీసర్ అతుల్ కులకర్ణితో చిక్కుముడులకు సమాధానాలిస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, ముగింపు పజిల్‌గా మిగలడంతో -పతాక సన్నివేశాల్ని రోటీన్ హారర్ సినిమాలా చుట్టేశారు. చిత్రమైన సౌండింగ్‌తో ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించే ప్రయత్నంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దెయ్యం కథలకు ఆత్మే -్భయం. ఆ టెన్షన్ పుట్టించడంలో ఒకట్రెండు సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ కనిపించింది. మంచం కింద దెయ్యాన్ని చూపించే సన్నివేశం -నిజంగా థ్రిల్‌నిస్తుంది. అలాంటి దృశ్యాలను అక్కడక్కడా తగిలించినా హారర్ సినిమాకు న్యాయం జరిగేది. ఫ్లాష్‌బ్యాక్ తరువాతి కథ నుంచీ ‘్భయం గ్రాఫ్’ కిందికి దిగిపోవడం ఈ సినిమాకు జెస్సీకి పెద్ద మైనస్.
పోలీస్ ఆఫీసర్‌గా అతుల్ కులకర్ణి, భూతవైద్యుడిగా కబీర్‌సింగ్ తమ నటనానుభవాన్ని చూపించారు. ఇప్పుడున్న భూతవైద్యులు ఎలా ఉంటారోనన్న కబీర్‌సింగ్ అప్పియరెన్స్ మెచ్చదగిందిగా ఉంది. కొత్తవాళ్లే అయినా ఆషిమా, శ్రీతచందన సహా మిగిలిన పాత్రధారుల పెర్ఫార్మెన్స్ మెచ్చతగినదిగానే ఉంది.
హారర్ చిత్రాలకు సంగీతమే -ప్రాణం. ఆ విషయంలో సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పనితనం ‘జెస్సీ’కి పెద్ద ప్లస్. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో వెన్నులో వణుకుపుట్టించాడు. తరువాత చెప్పుకోవాల్సింది -కెమెరా. లైటింగ్ ఎఫెక్ట్‌తో హారర్ ఫీల్ ఆవిష్కరించటంలో డీవోపీ కృషి బావుంది. కేవలం లైటింగ్‌తోనే ప్రతి సన్నివేశానికి ఒక మూడ్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. కథాపరంగా సెకెండాఫ్‌లో వచ్చే షార్ప్ ట్విస్ట్ తప్ప, మిగిలిన కథలోని హారర్ టెంపో ఏమాత్రం కొత్తదిగా అనిపించదు. ప్రయత్నంపై మరికొంత కృషి జరిగివుంటే -జెస్సీ భయపెట్టేదే.

-వీవీ