రివ్యూ

కథ కాని కల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

118 ** ఫర్వాలేదు

తారాగణం: కళ్యాణ్‌రామ్, నివేదాథామస్, షాలినీ పాండే, ప్రభాస్ శ్రీను, రాజీవ్ కనకాల, నాజర్, హరితేజ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: కెవి గుహన్
నిర్మాత: మహేష్ కోనేరు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కెవి గుహన్
========================================================================
సెలెక్టివ్ సినిమాలే చేస్తాడన్న మంచి కితాబు కల్యాణ్‌రామ్ ఎప్పుడో సంపాదించాడు. ఫ్లాపులు ఎదురైనా -ప్రయోగాత్మక చిత్రాలకూ ఏమాత్రం వెనకడుగు వేయడన్న గట్స్‌నీ ఎప్పటికప్పుడూ చూపిస్తూనే ఉన్నాడు. వీటిమధ్య -అప్పుడప్పుడూ కమర్షియల్ మాస్ సినిమాలనీ ఏమాత్రం వదలడు. కాకపోతే -అందులోనూ వైవిధ్యాన్ని వెతుక్కోవడం బహుశ అతనికి అలవాటు కావొచ్చు. అలాంటి కల్యాణ్ -తాజా చిత్రం 118. ఓ డ్రీమ్ థ్రిల్లర్ కంటెంట్‌తో ఆడియన్స్ ముందుకొచ్చాడు.
సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న కెవి గుహన్ ఈ థ్రిల్లర్‌తో డైరెక్టర్ అవతారం ఎత్తాడు. నిజానికి ఇది చాలా ఏళ్లుగా గుహన్ కంటున్న కల. ఆ కలను కథగా మార్చుకుని -మిస్టరీని మరింత ఎక్కువ చేసేందుకు 118 నెంబర్‌ను టైటిల్ చేశాడు. గుహన్ చూపించిన మిస్టరీ ఏమిటో తెలియాలంటే -కథలోకి వెళ్లాలి.
కథ
గౌతమ్ (కళ్యాణ్‌రామ్) ఓ టీవీ ఛానెల్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్టు. తనకు ఆసక్తి కలిగించే ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ నేపథ్యంలో ఓ రిసార్ట్‌లో రాత్రి నిద్రపోతాడు. అప్పుడు అతనికో కల వస్తుంది. ఆ కలలో ఓ అమ్మాయిని దారుణంగా హత్యకు గురవుతుంది. కొన్ని రోజుల తర్వత ఆ రిసార్టుకు వెళ్తే మళ్లీ అదే కల అతడిని వెంటాడుతుంది. దీంతో అది మామూలు కలకాదని భావిస్తాడు గౌతమ్. అసలు ఎందుకు ఆ కల వెంటాడుతోంది? పైగా కలలో కనిపించిన సంఘటనలు యధార్థాలు కావడంతో, క్యూరియాసిటీతో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ గౌతమ్ కలలోకి వచ్చిన అమ్మాయి ఎవరు? ఆమె ఎందుకు మాయమైంది? దాని వెనకున్న మిస్టరీ ఏమిటి? ఆ రహస్యాన్ని ఎలా బయటపెట్టాడు. దానివల్ల అతను ఎదుర్కొన్న సమస్యలేమిటి? అన్నది మిగతా కథ.
నిజానికి 118-ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. సినిమా చూస్తున్నంతసేపూ -హాలీవుడ్ షేడ్స్ ఆడియన్స్ మస్తిష్కాన్ని కమ్ముకుంటాయి. అదీ- మిలీనియంకి అడుగుముందు అంటే 1999లో రచయిత స్టీఫెన్ కింగ్ రాసుకున్న ఓ షార్ట్ సోరీ ఛాయలు గుర్తుకొస్తుంటాయి. అదే కథను -‘రూం నెం 1408’గా దర్శకుడు మైఖేల్ హాఫ్‌స్ట్రామ్ ఇప్పటికే హాలీవుడ్‌లో సినిమా చేశాడు. జాన్ కూజక్, సామ్యూల్ ఎల్ జాక్సన్, మేరీ మెక్‌కోర్మాక్, టోనీ షాలౌబ్‌లు ఆ కథను అద్భుతంగా పండించారు కూడా. హాంటెడ్ హసెస్ మీద ఇన్విస్టిగేషన్ చేసి, తన అనుభవాలను కథా వస్తువులుగా మలిచే ఓ రచయిత -న్యూయార్క్ సిటీ హోటల్ రూం నెంబర్ 1408లో బసచేసి తనకు ఎదురైన అనుభవాలను ఆసక్తికర కథనంగా ప్రపంచానికి ఎలా చెప్పాడన్నది ఆ సినిమా సారాంశం. ఇంచుమించుగా అదే ‘సీడ్’ -118 చిత్రంలోనూ కనిపించటం గమనార్హం. కాకపోతే దీన్ని ‘ల్యూసిడ్ డ్రీమింగ్’ కానె్సప్ట్ చుట్టూ అల్లుకున్నారు.
హీరో కళ్యాణ్‌రామ్ తన పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు. కొంతమంది హీరోల నుంచి కొన్ని తరహా చిత్రాలకు సంబంధించి ఆడియన్స్ ఆశించే ఓవర్ హీరోయిజం ఛాయలు ఇందులో ఎక్కడా కనిపించవు. కథతో పాత్రను నడిపించిన విధానం బావుంది. కల్యాణ్ న్యూ లుక్ అందుకు ప్లస్సయ్యింది. ఇనె్వస్టిగేటివిస్ట్‌గా అతడు పడే తపన ఆడియన్స్ మైండ్‌కి కనెక్ట్ చేయగలిగాడు. హీరోయిన్ నివేదా థామస్ కనిపించేది కొంతసేపే అయినా, కథను మలుపుతిప్పే పాత్రలో జీవించింది. పెర్ఫార్మెన్స్ పరంగా నివేదా స్టయిల్ ఈ పాత్రకు ఆప్ట్ అయ్యింది. షాలిని పాండే పాత్ర రోటీన్. ఆడియన్స్ రిలాక్సేషన్ కోసం హీరోకి ఓ పెయిర్ ఉండాలి కనుక -ఒకట్రెండ్ సీన్స్‌లో స్టన్నింగ్ అప్పియరెన్స్ ఇవ్వగలిగింది. ప్రభాస్ శ్రీను, రాజీవ్ కనకాల, హరితేజ తదితరులు పాత్రలకు తగిన నటన చూపించారు. డాక్టర్ పాత్రలో నాజర్ జస్ట్ ఓకే.
సాంకేతికంగా సినిమాకు రిచ్ లుక్ ఇవ్వగలిగారు. థ్రిల్లర్ కంటెంట్‌తో బలమైన ముద్ర వేయగలిగే ప్రయారిటీ పాయింట్స్‌లో -మ్యూజిక్ ఫస్ట్ ఉంటుంది. ఆ విషయంలో శేఖర్‌చంద్ర సక్సెస్ అయ్యాడు. పాటలు యావరేజ్ అనిపించినా -స్టోరీకి బిగింపునివ్వగల బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫరే డైరెక్టర్ కావడం మరో ప్లస్. దర్శకుడిగా తన చూపించదలచుకున్న విజన్‌ను డీవోపీ మైండ్‌కు సింక్ చేయటంలో గుహన్ -సక్సెస్ అయ్యాడు. సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో సినిమాటోగ్రఫీ ఒకటి అనిపించాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు ఉన్నాయి. దర్శకుడిగానూ గుహన్ కష్టం స్క్రీన్‌పై కనిపించింది. ఎంచుకున్న కానె్సప్ట్‌ను ఆడియన్స్ మైండ్‌తో సింక్ చేయడానికి పడిన తపనలో ఒకడుగు ముందుకేసినట్టే. స్క్రీన్‌ప్లే ఓకే. కాకపోతే -ప్రేక్షకుల్ని విస్మయానికి గురిచేసే థ్రిల్‌ను స్క్రిప్ట్‌లో పొందుపర్చలేకపోయారు. థ్రిల్లర్ చిత్రాలకు ఇదే కీలకం. కథనంలో ‘వాట్ నెక్ట్స్’ అనే జీల్‌ని క్రియేట్ చేయడంలో వైఫల్యం కనిపించింది. సినిమా చూస్తున్నంతసేపూ లాజిక్స్ గురించి ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే -డ్రామాలో బిగింపు తగ్గినట్టే. నిజానికి ‘ల్యూసిడ్ డ్రీమింగ్’ అనే కానె్సప్ట్ చుట్టూ కథల్లుకున్నాడు దర్శకుడు గుహన్. చనిపోయిన వ్యక్తి ఆత్మ మరొకరిని ఆవహించి ప్రతీకారాన్ని తీర్చుకున్న హార్రర్ కథలకు అలవాటుపడిన ఆడియన్స్ -ఈ కానె్సప్ట్‌ను డైజెస్ట్ చేసుకోవడం కష్టమైంది. అన్యాయానికి గురైన వ్యక్తికి సంబంధించిన ఉదంతం హీరో కలలోకి రావడం, వెంటాడే కలకు అనుగుణంగా హీరో ఇన్విస్టిగేటివ్ జర్నీ, దీనికో సైంటిఫిక్ రీజనింగ్.. ఇదంతా సింప్లిఫై చేసి ఆడియన్స్‌కి అర్థమయ్యేలా చెప్పటంలో దర్శకుడు గుహన్ మరికొంత కసరత్తు చేసి ఉండాల్సింది.
**
చెప్పదలచుకున్న విషయాన్ని థ్రిల్లర్‌గా అల్లుకోవడంలో క్లారిటీ లోపించింది. కారణం -కథను ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని సన్నివేశాలను వదిలేయడమే అనిపిస్తుంది. హీరోయిన్‌తో ఒక రొమాంటిక్ లేదా కమెడియన్‌తో డ్రైవ్ చేసినా -ఏదోక విషయాన్ని చెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవాలి. సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథలోకి తీసుకెళ్లడం, తనకొచ్చిన కల తాలూకు మర్మాన్ని కనుగొనేందుకు హీరో చేసే సైకలాజికల్ జర్నీ..లాంటి సన్నివేశాలతో ప్రథమార్థం శరవేగంగా సాగిపోయింది. ద్వితీయార్థం మీద క్యూరియాసిటీ పెంచింది కూడా. ఒక సంఘటన తాలూకు విషయాన్ని తెలుసుకోవడం కోసం హీరోచేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేవారి నుంచి అసలు విషయం తెలుసుకునే అవకాశమున్నా -హీరో ఇంకేదో వెతకాలన్న ఆరాటం చూపించటం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. అలాగే, ఒక కొత్తతరహా సినిమా చూస్తున్న ఫీలింగ్‌ను ఫ్లాష్‌బ్యాక్ చెడగొట్టేసింది. నివేదా ఇచ్చిన ఎమోషనల్ టచ్ పెర్ఫార్మెన్స్‌తో ఫ్లాష్‌బ్యాక్ దాటేశారుకానీ, లేదంటే ఆ ఎపిసోడ్ మొత్తం మరింత నిరాశ కలిగించేది. కథకు కీలకమైన ‘ల్యూసిడ్ డ్రీమింగ్’ కానె్సప్ట్‌ను సింపుల్‌గా, శక్తివంతంగా చెప్పడంలోనూ గుహన్ విఫలమయ్యాడు. డాక్టర్‌గా నాజర్ పాత్రకు సిల్లీ టచ్ ఇవ్వటమూ -ల్యూసిడ్ డ్రీమింగ్ సన్నివేశాలు బలహీనపడ్డాయి. ఒక థ్రిల్లర్ మూవీ నుంచి ఆశించే ముగింపూ 118లో మిస్సైంది.

-త్రివేది