రివ్యూ

దారి తప్పేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

4 లెటర్స్ * బాగోలేదు

తారాగణం: ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా, కౌసల్య, అన్నపూర్ణ, సుధ, సత్యకృష్ణ, విద్యుల్లేఖా రామన్, సురేష్, పోసాని, కృష్ణ్భగవాన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు కె
నిర్మాతలు: డి హేమలత, ఉదయ్‌కుమార్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్ రఘురాజ్
========================================================
కొత్త తారలు ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఆర్ రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -4 లెటర్స్. కుర్రాళ్లకు అర్థమవుతుందిలే అన్నది ఉప శీర్షిక. దొమ్మరాజు హేమలత, ఉదయ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కుర్రాళ్లకు అర్థమవుతుందనుకున్న ఆ విషయమేంటో కథలోకి వెళ్లి తెలుసుకుందాం.
విజయ్ (ఈశ్వర్) ఓ టాప్ బిజినెస్‌మెన్ కొడుకు. కొన్ని వందల కోట్లకు ఒక్కడే వారసుడు. బి.టెక్ చదువుతున్న విజయ్ మంచి ఇంటిలిజెంట్ ఫెలో. అతను అడిగే ప్రశ్నలకు కాలేజీ లెక్చరర్స్ కూడా భయపడుతుంటారు. విజ్జు తండ్రి మాత్రం అతన్ని ఎన్ని కోట్లు ఖర్చయినా ఫరవాలేదు, లైఫ్ మాత్రం ఎంజాయ్ చేయమని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఆక్రమంలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన కారణంగా అంజలి (టువ చక్రవర్తి) అతను చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఆ తరువాత కొన్ని సంఘటనల అనంతరం విజ్జుకి ఇంప్రెస్ అయిన అంజలని అతన్ని ప్రేమిస్తుంది. కొన్ని కారణాల చేత అంజలి అతనికి బ్రేకప్ చెప్పి విడిపోతుంది. ఆ తరువాత విజ్జు లైఫ్‌లోకి మరో అమ్మాయి (అంకిత మహారాణా) వస్తుంది వీరిద్దరూ ప్రేమించుకుంటారు. అంతలో అంచలి మళ్లీ విజ్జు లైఫ్‌లోకి రావటానికి ప్రయత్నిస్తుంది. చివరి అతను ఏ అమ్మాయిని ప్రేమించాడు? ఎవర్ని పెళ్లి చేసుకున్నాంటాడు అనేదే అసలు కథ.
హీరో ఈశ్వర్‌కు తొలి సినిమా అయిన ఈజ్‌తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా తన లవర్‌తో అలాగే ఫ్రెండ్స్‌తో సాగే సన్నివేశాల్లో, హీరోయిన్‌తో ప్రేమలో పడే సన్నివేశంలో ఈశ్వర్ నటన బాగుంది. డైలాగ్ డెలివరీ మాత్రం పూర్. ఇక అమాయకమైన అమ్మాయిగా టువ చక్రవర్తి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది. మరో హీరోయిన్ అంకిత మహారాణా అందుకు తక్కువేం కాదు. కాకపోతే ఇద్దరు బ్యూటీలు పెర్ఫార్మెన్స్‌కంటే బ్యూటీపైనే ఫోకస్ పెట్టారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో ఇద్దరూ ఓకే అనిపించారు. మిగతా నటీనటుల విషయానికొస్తే కౌసల్య, అన్నపూర్ణ, సుధ, సత్యకృష్ణ, విద్యుల్లేఖా రామన్, సురేష్, పోసాని, కృష్ణ్భగవాన్‌లాంటి ఆర్టిస్టులు పాత్ర పరిధిమేరకు నటించారు. ప్రతిభావంతమైన ఆర్టిస్టులను పూర్తిగా వినియోగించుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమైనట్టే.
సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాటోగ్రాఫర్‌గా చిట్టిబాబు కె తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాటలు అంతగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ ఇంకాస్త కత్తెర వేసివుంటే బావుండేది. నిర్మాతలు దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ల నిర్మాణపు విలువలు బాగున్నాయి.
యూత్‌ఫుల్ సినిమా అంటూ ప్రేమ నేపథ్యంలో సినిమా అయినప్పటికీ ఈ సినిమాలో చాలా సన్నివేశాలు వెగటు పుట్టిస్తాయి. ముఖ్యంగా దర్శకుడు ఆర్ రఘురాజ్ ప్రతి సన్నివేశంలో అవసరం ఉన్నా లేకున్నా బూతులు, థర్డ్‌గ్రేడ్ జోకులు ఇరికించి చికాకు పెట్టించాడు. ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుందిగానీ, ఏ సీన్ కూడా కథను పరుగులు పెట్టించదు. పేలవమైన స్క్రీన్‌ప్లే కారణంగా ఎక్కడా కథపై ఆసక్తి కలగదు. అక్కడక్కడా నవ్వించేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. కథలోని మెయిన్ సోల్‌ని కొత్తగా చెప్పడంలో విఫలమైన దర్శకుడు, అనవసరమైన కామెడీ ట్రాక్‌లపై ఆధారపడటంతో అసలు విషయం పక్కదారి పట్టేసింది. బలంలేని కథ, బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రెస్ట్‌నీ నీరుగార్చాడు. దృశ్యంతో బలంగా చెప్పాల్సిన కథను డైలాగులతో చెప్పడానికి శతవిధాలా చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. అనవసరమైన అతి డ్రామా, అవసరం లేని వెగటు సంభాషణలు -సినిమా గ్రాఫ్‌ని పూర్తిగా దెబ్బతీశాయి. ఫోర్ లెటర్స్ కుర్రాళ్లకు అర్థమైందికానీ, చెప్పిన తీరు నచ్చలేదు.

-ఎస్వీ