రివ్యూ

బోర్ కొట్టించాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవ్ ** ఫర్వాలేదు
**
నటీనటులు: కార్తీ, రకుల్‌ప్రీత్, రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్, విఘ్నేష్‌కాంత్, అమృత, తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: వేల్‌రాజ్
నిర్మాత: లక్ష్మణ్‌కుమార్
రచన, దర్శకత్వం: రజత్ రవిశంకర్
**
తమిళ హీరో అయిన కార్తీ.. తెలుగులో కూడా ఫోకస్ పెట్టి తెలుగు హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన ప్రతి తమిళ సినిమా ఇటు తెలుగులో కూడా విడుదల అవుతూ కార్తీకి మంచి క్రేజ్ తెస్తుంటాయి. ఈ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన దేవ్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఖాకి తరువాత రకుల్‌ప్రీత్‌సింగ్ కార్తీకి జోడిగా నటించింది. మరి ఈ దేవ్ ఏంచేసాడో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ
ఉన్నత కుటుంబానికి చెందిన కుర్రాడు దేవ్ (కార్తీ) అందరిలా రొటీన్ ఉద్యోగాలు చేయడం అతడికి ఇష్టం ఉండదు. ఏదైనా భిన్నంగా సాహసోపేతంగా చేయాలని, ముఖ్యంగా మనసుకు నచ్చినట్లు జీవించడంలోనే ఆనందం ఉందని భావిస్తాడు. అలాంటి దేవ్ ఒక పెద్ద కంపెనీకి సీఈగా ఉంటూ ఓ సందర్భంగా హీరోయిన్ మేఘనను (రకుల్‌ప్రీత్) చూసి ఇష్టపడతాడు. ఆమెను తన ప్రేమలో పడేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ముందు దేవ్‌ను దూరం పెట్టిన మేఘన.. ఆ తర్వాత అతడి ప్రేమలో పడిపోతుంది. మరి ఈ ప్రేమ ప్రయాణం సజావుగా సాగిందా? పెళ్లి తరువాత కూడా దేవ్ తనకు నచ్చినట్లుగా తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకుని తాను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది మిగతా కథ.
హీరో కార్తి గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా కనిపించే లుక్‌లో ఆకట్టుకున్నాడు. నటన కూడా ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గట్టుగా బాగా చేశాడు. కానీ అతడి పాత్రను సరిగా తీర్చక దశా దిశా లేకుండా సాగింది. హీరోయిన్ రకుల్ చాలా గ్లామరస్‌గా కనిపించి ఆకట్టుకుంటుంది కానీ ఆమె పాత్రను కూడా సరిగా తీర్చిదిద్దలేదు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ లాంటి నటీనటులను సరిగ్గా వాడుకోలేదు. నిజానికి ఈ పాత్రలని వారు ఎందుకు చేశారో అనిపిస్తుంది. హీరో ఫ్రెండుగా చేసిన విఘ్నేష్ కాంత్ కామెడీ పేరుతో విసిగించాడు. మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు.
సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే.. హారిస్ జైరాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ నైస్. సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకొచ్చాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక డైరెక్టర్ రజత్ రవిశంకర్ ఒక లవ్‌స్టోరీకి అడ్వెంచర్ అనే కానె్సప్ట్‌ను జోడించి చేసిన ఈ ప్రయత్నం విఫలమైంది. రొటీన్ స్టోరీ, ఆకట్టుకోని కథనం సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది.
కార్తి-రకుల్‌ప్రీత్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఏ మాత్రం కొత్తదనం లేని కథ.. ఎక్కడా ఆసక్తి రేకెత్తించని కథనం.. సరైన కాన్ఫ్లిక్ట్ లేని లవ్‌స్టోరీ.. బోరింగ్ సన్నివేశాలు. హీరో అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే కుర్రాడు. అందరిలా సాధారణంగా జీవితాన్ని గడిపేయడం ఇష్టం ఉండదు. ఆరంభంలోనే అడ్వెంచర్స్ చూడబోతున్నామని అనుకుంటాం. కానీ ఏ సర్‌ప్రైజ్ లేకుండా సాధారణంగా సినిమాను నడిపించేయడమే పెద్ద సర్‌ప్రైజ్. హీరో ఏ పని చేయకుండా ఖాళీగా గడిపేస్తుంటే హీరోయిన్ తట్టుకోలేక అతడినుంచి విడిపోతుంది. కానీ ఇందులో మాత్రం చిత్రంగా.. అప్పటిదాకా ఖాళీగా వున్న హీరో కొంచెం పనిచేయడం మొదలుపెడితే అది తట్టుకోలేక, ఇలా నువ్వు బిజీ అయితే కష్టం. ఎప్పుడూ ఖాళీగా వుండి నా గురించే ఆలోచించాలి అని కండిషన్ పెట్టి, అందుకు ఒప్పుకోలేదని అతడినుంచి విడిపోతుంది కథానాయిక. సినిమాలో వున్న కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఇదే. ఇది కూడా ముగింపు దశలో వస్తుంది. ఇలాంటి పాయింటుకి ప్రేక్షకులు ఎలా కనెక్టవుతారని అనుకున్నారో ఏమిటో? అర్థరహితంగా అనిపించే ఈ పాయింట్ మినహాయిస్తే దేవ్ కథలో అసలు ఏ మలుపులూ లేవు. మనం చూస్తున్నది రొమాంటిక్ సీన్స్ అనే ఫీల్ కలిగించడానికి కెమెరామెన్, సంగీత దర్శకుడు విఫలయత్నం చేస్తుంటారు కానీ.. ఏ మాత్రం ఆసక్తి రేకెత్తించని సన్నివేశాల కారణంగా ఆ ఫీల్ ఎక్కడా కలగదు. ప్రథమార్థం అయితే మరీ బోర్ కొట్టించేస్తుంది. ద్వితీయార్థంలో కథ కొంచెం మలుపు తిరిగినా.. అది కృత్రిమంగా అనిపిస్తుంది. సినిమా ముగించడానికి ఇదో ప్రయత్నంలాగా అనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ లాంటి పెద్ద నటీనటుల్ని పెట్టుకుని వాళ్లకు పేలవమైన పాత్రలిచ్చారు. పైగా వారికి ఎవరో డబ్బింగ్ చెప్పడంతో అసలేమాత్రం ఆ పాత్రలతో కనెక్ట్ కాలేం. మొత్తంగా హీరో హీరోయిన్ల ఆకర్షణ.. సాంకేతిక హంగులు.. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ మినహాయిస్తే దేవ్‌లో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

-త్రివేది