రివ్యూ

రఫ్పాడించిన ర్యాపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గల్లీబోయ్ *** బాగుంది
***
తారాగణం: రణ్‌వీర్‌సింగ్, ఆలియా భట్, విజయ్‌రాజ్, కల్కీ కొచ్లిన్, విజయ్ వర్మ తదితరులు
ఎడిటర్: నితిన్ బెయిద్
సినిమాటోగ్రఫీ: జె ఓజా
డైలాగ్స్: విజయ్ వౌర్య
నిర్మాతలు: రితేష్ సిద్వానీ, జోయా అక్తర్, ఫరాన్ అక్తర్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జోయా అక్తర్
***
కొత్త కథలను తెరపైకి తెచ్చేందుకు బాలీవుడ్ చేసే కసరత్తులు ప్రతిసారీ కొత్తగానే ఉంటాయి. కథాంశం చిన్నదే కావొచ్చు, దానిచుట్టూ జీవితాన్ని అల్లడంలో బాలీవుడ్ దర్శకులది ప్రత్యేక శైలి. దీనికితోడు వాస్తవికతకు దగ్గరగావుండే కథలతో సినిమాను తెరకెక్కించేటపుడు చూపించాల్సిన నిజాయితీనీ బాలీవుడ్ చిత్రాల్లో చాలాకాలంగా చూస్తున్నాం. ఇలాంటి కోణంలో వచ్చిన చిత్రమే -గల్లీబోయ్. ముంబయిలో ర్యాప్ బ్యాండ్ నిర్వహించే గల్లీ గ్యాంగ్ సింగర్లు డివైన్, నేజీల స్ఫూర్తి ఈ చిత్రానికి ఇతివృత్తం. -దానికి కొంచెం బావోద్వేగ ప్రేమ మిళితం చేసి తెరకెక్కించారు దర్శకురాలు జోయా అక్తర్. కవి, పాటల రచయిత జావెద్ అక్తర్, స్క్రీన్ రైటర్ హానీ ఇరానీల కూతురిగా జోయా ఇప్పటికే ఇండస్ట్రీలో తనేంటో ప్రూవ్ చేసుకుంది. జిందగీ న మిలేగి దుబారా, బాంబే టాకీస్ చిత్రాలతో తన స్టామినాను చూపించి ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న జోయా చేసిన మరో మేజిక్ -గల్లీబోయ్.
ఇక రణ్‌వీర్ సింగ్ ప్రూవ్‌డ్ ఆర్టిస్ట్. ఆలియా భట్ అందుకు తక్కువేం కాదు. ఇద్దరు టాలెంటెడ్ ఆర్టిస్టుల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం గల్లీ బోయ్. టైటిల్‌తోనే జోయా సెనే్సషన్ చేయడంతో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. దీనికితోడు బాలీవుడ్‌లో పూర్తి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం కావడంతో -సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తూ వచ్చారు. తమ్ముడు ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ చిత్రమైన కథను తెరకెక్కించిన నిర్మాతలు. ఇప్పటికే బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఈ గల్లీ స్టోరీ -వాలెంటైన్స్ రోజున ఆడియన్స్ ముందుకొచ్చింది. గల్లీ బోయ్‌ని దర్శకురాలు జోయా అక్తర్ ఎలా చూపించిందో చూద్దాం.
ఇందులో రణ్‌వీర్‌సింగ్ మురాద్ షేక్ పాత్ర పోషించాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చాలామంది తండ్రుల లాగే మురాద్ తండ్రి (విజయ్‌రాజ్)కీ ఓ కలుంటుంది. కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నది అతని కోరిక. కానీ మురాద్‌కు చదువంటే -ర్యాప్ సంగీతమే. ర్యాప్ మ్యూజిక్ అంటే మురాద్‌కు పిచ్చి. ఆ వ్యామోహంతోనే ఓ బ్యాండ్స్ ఏర్పాటుచేసి తన టాలెంట్ ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతుంటాడు. కానీ మురాద్ వేషధారణ చూసి ఎవ్వరూ దగ్గరికి రానివ్వరు. అలాంటి మురాద్‌కు సఫీనా (అలియా భట్) పరిచయమవుతుంది. ప్రేమలో పడతారు. అప్పటినుంచి మరాద్‌కు అన్ని విషయాల్లో సపోర్ట్‌గా నిలబడుతుంది సఫీనా. సఫీనా సాయంతో మురాద్ ర్యాపర్‌గా సక్సెస్ అయ్యాడా? వీళ్లిద్దరి ప్రేమ వర్కౌటైందా?లాంటి ప్రశ్నలకు తెరపైనే సమాధానం దొరుకుతుంది.
పూర్తిగా ర్యాప్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా తెరకెక్కడం బాలీవుడ్‌లో ఇదే ప్రథమం. రణ్‌వీర్, ఆలియా జోడీ, దర్శకురాలు జోయా టాలెంట్ కారణంగా సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటిని ఏమాత్రం వమ్ము చేసుకోకుండా నిజాయితీ చిత్రాన్ని తెరకెక్కించింది జోయా. ‘ఇంట్లో ప్రోత్సాహం లేని ఓ ర్యాపర్ జీవితంలోకి వచ్చిన గాళ్‌ఫ్రెండ్ అతన్ని ఎలా ప్రభావితం చేసిం’దన్న చిన్న పాయింట్ చుట్టూ జీవితాన్ని అల్లడంలో జోయా సక్సెస్ సాధించింది. ‘ఎవ్రి డాగ్ గెట్స్ హిజ్ ఓన్ డే’ కానె్సప్ట్‌ని -‘అప్నా టైం ఆయేగా’ పాటతో పదే పదే గుర్తు చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లిన విధానం బావుంది. నిజానికి సినిమా విడుదలకు ముందే -పాట వైరల్ అవ్వడం కూడా ‘గల్లీబోయ్’ గట్టెక్కడానికి కారణమైంది.
ఇక మ్యూజిక్ చుట్టూ లవ్ మ్యాజిక్ నడిపించటం కూడా జోయా ప్రతిభకు అద్దంపట్టింది. ఈ మ్యాజిక్ కారణంగానే -సంగీతంపట్ల పెద్దగా ఆసక్తి లేనివాళ్లూ కథను ఫాలో అయిపోతారు. సో, సాధారణ ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ అనిపించదు. ఆలియా, రణ్‌వీర్ పాత్రల్ని డిజైన్ చేయటంలో జోయా తీసుకున్న సహజత్వ జాగ్రత్త సినిమాకు పూర్తిగా ప్లస్. ఒకవిధంగా వీళ్లిద్దరి పెర్ఫార్మెనే్స సినిమాకు అస్సెట్. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
మురాద్ పాత్రలోకి రణ్‌వీర్ పరకాయ ప్రవేశం చేసేశాడు. స్క్రీన్‌పై రణ్‌వీర్‌ని చూస్తున్నామన్న భావన ఎక్కడా రానివ్వలేదు. సఫీనా పాత్రలో ఆలియా చాలెంజింగ్ పెర్ఫార్మెన్స్ చూపించింది. ఒకపక్క రణ్‌వీర్‌ని ఆటపట్టిస్తూనే, అతన్ని కామెంట్ చేసేవాళ్లకు వార్నింగ్‌లు ఇస్తూ ఆలియా చేసిన అల్లరి ఆకట్టుకుంది. అటు పెర్ఫార్మెన్స్‌పరంగా, ఇటు కెమిస్ట్రీపరంగా రెండు పాత్రలూ బ్యాలెన్సింగ్‌తో నడవటంతో -స్టోరీ డ్రామా అత్యద్భుతంగా పండింది. మిగిలిన పాత్రల్నీ ఎక్కడా ఎంచి చూపించలేం.
సాంకేతికంగానూ -గల్లీబోయ్ ఓ కొత్తదానానే్న రుచి చూపించింది. ప్రధానంగా ఎడిటర్ నితిన్ బెయిద్ పనితనం అద్భుతం. సంగీతపరమైన చిత్రంలో సాగదీతకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా షార్ట్‌ఎడ్జ్ ఎడిటింగ్ పనితనాన్ని చూపించారు. జె ఓజా సినిమాటోఫ్రీ, సంభాషణలు అందించిన విజయ్ వౌర్య పనితానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నిర్మాతలు రితేష్ సిద్వానీ, జోయా అక్తర్, ఫరాన్ అక్తర్ -ఓ మంచి సినిమానే కాదు, ఏడాది ఆరంభం నుంచి వచ్చిన చిత్రాల్లో ఓ తెలివైన చిత్రాన్ని ఆడియన్స్‌కి అందించారు.

-మహాదేవ