రివ్యూ

భావోద్వేగ ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాత్ర *** బాగుంది
***
తారాగణం: మమ్ముట్టి, జగపతిబాబు, రావురమేష్, అనసూయ, సచిన్ ఖేద్కర్, సుహాసిని, పోసాని తదితరులు
సంగీతం:కె
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకత్వం: మహి వి రాఘవ్
***
మహానటి తర్వాత తెలుగులోనూ బయోపిక్ సినిమాల క్రేజ్ పెరిగింది. కొద్దిరోజుల క్రితమే -యన్‌టిఆర్ జీవిత కథతో ‘కథానాయకుడు’ ఆడియన్స్ ముందుకొచ్చింది. తాజాగా మహానేతగా, తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం ఏర్పర్చుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితంలోని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ థియేటర్లకు వచ్చింది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన యాత్ర ఎలాసాగిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
***
కథ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ దిగ్గజ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికలకు ముందు రాష్టవ్య్రాప్తంగా చేసిన పాదయాత్ర ఆధారంగా నాటి రాజకీయ సామాజిక పరిస్థితుల్ని చూపించడంతో మొదలవుతుంది కథ. అప్పటి చంద్రబాబు సర్కారు ఎన్నికల్లో విజయంపై ధీమాతో ముందస్తుకు సిద్ధం కాగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల్లో నెగ్గుకురావడం సాధ్యంకాదన్న భావనతో కాంగ్రెస్ నేతలుంటారు. అలాంటి సమయంలో అసలు జనం సమస్యలేంటో, వాళ్లు ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి వైఎస్ పాదయాత్ర మొదలుపెడతాడు. సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందికర ఘట్టాలను దాటుకెళ్తాడు. యాత్రలో వైఎస్సార్‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ప్రజలు అప్పుడు ఏయే సమస్యలతో సతమతం అవుతున్నారు? జనం సమస్యలకు వైఎస్సార్ స్పందించిన తీరు.. చివరకి ప్రజల గుండెల్లో మహానేతగా ఎలా ఎదిగాడు? 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన అద్వితీయ ప్రతిభ? ఇలా.. అప్పటి రాజకీయ వాతావరణాన్ని చూడాలంటే యాత్రకు బయల్దేరాలి.
సినిమాకు అతి పెద్ద ఆకర్షణ మమ్ముట్టి. వైఎస్ పాత్రలో ఒదిగిన తీరు ఆయన అనుభవాన్ని రుచి చూపించింది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విషయంలో వైఎస్‌ను అనుకరించకుండా, ఆ పాత్ర తాలూకు ఆత్మను ఆవిష్కరించటానికే ప్రయత్నించాడు మమ్ముట్టి. నటుడి గొప్పతనాన్ని చూపించగలిగాడు. ఇది వైఎస్‌మీద తీసిన సినిమా అయినప్పటికీ, ఆయన అభిమానులేకాక సామాన్య ప్రేక్షకులూ ఎక్కువ శాతం సినిమాతో మమేకం కావడానికి మమ్ముట్టి కారణమయ్యాడు. స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు, క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేశాయి. మొత్తానికి మంచి ఎమోషనల్ కంటెంట్‌తో దర్శకుడు ప్రతి ప్రేక్షకుడి గుండెనూ టచ్ చేశాడు. మిగతా నటీనటులకు పెద్ద పాత్రలేవీ లేవు. కెవిపి రామచంద్రరావుగా రావురమేష్, వైఎస్ సతీమణి విజయమ్మగా సుశ్రీత, సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని తదితరులు ఆయా పాత్రల ఔన్నత్యాన్ని ప్రదర్శించారు. సచిన్ ఖేద్కర్, పృధ్వీ, పోసాని.. ఇతర నటీనటులు చిత్రానికి ఎక్కడా మైనస్ కాలేదు.
సినిమా సాంకేతిక ప్రమాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ‘కే’ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. పాటలు, ముఖ్యంగా నేపథ్య సంగీతంతో భావోద్వేగాలను పీక్స్‌కు తీసుకెళ్లగలిగాడు. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలను ఎక్కడా ఎంచలేం. అన్ని విభాగాలను సమర్థవంతంగా ముందుకు నడిపించటంలో దర్శకుడు మహి వి రాఘవ్ పనితనం కనిపించింది. రచయితగా, దర్శకుడిగా చిత్రానికి పూర్తి న్యాయమే చేయగలిగాడు. మంచి కథ, బలమైన భావోద్వేగ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. వైఎస్ గురించి తానేం చెప్పదల్చుకున్నాడో అదే విషయాన్ని ఆడియన్స్‌కు ఒప్పించటంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌ను డీల్ చేసిన విధానం బావుంది. కాకపోతే కథ విషయంలో దర్శకుడు విధించుకున్న ‘పాదయాత్ర’ పరిమితి ఎంతవరకూ వర్కౌట్ అవుతుందన్న సందేహాలు తలెత్తుతాయి.
సినిమా వైఎస్ బయోపిక్ కాదు. కేవలం ఆయన రాజకీయ జీవతంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన, రాజకీయ జీవితానికి కొత్త ఊపిర్లూదిన ఘట్టం చుట్టూ నడిచే ఒక ఎమొషనల్ జర్నీ మాత్రమే. కేవలం పాదయాత్ర చుట్టూ కథ అల్లి సినిమా తీయాలనుకోవడం దర్శకుడు చేసిన సాహసమే. వైఎస్‌ను గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తారన్నది ఊహించిన విషయమే. పాదయాత్ర ద్వారా వైఎస్ మహానేతగా ఎలా ఎదిగాడన్న విషయాన్ని ప్రధానంగా హైలెట్ చేస్తుందీ యాత్ర. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాల ఆలోచనకు పడిన బీజాలనూ ప్రభావవంతంగా చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. వ్యవసాయాన్ని నమ్ముకుని రైతులు ఎంత దయనీయ స్థితికి చేరిన వైనాన్ని చూసి చలించిపోయి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించడం, ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్, అర్హులందరికీ పింఛను లాంటి పథకాల దిశగా వైఎస్ అడుగులు వేయడం లాంటి విషయాలను యాత్రలో హైలైట్ చేశాడు. వైఎస్ పాదయాత్ర మొదలెట్టడానికి ముందు కథను నడిపించిన విధానం ఆసక్తి రేకెత్తిస్తుంది. యాత్రను ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. అధిష్ఠానాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్రను ప్రారంభించిన జననేతగా, మహానేత వైఎస్ పాదయాత్రకు సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ థీమ్‌తోపాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మంచి ప్రతిభను కనబర్చిన దర్శకుడు, ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు మాత్రం నెమ్మదిగా సాగించాడు. సినిమాటిక్ శైలిని ఊహించుకుని వెళ్లే ఆడియన్స్‌కు మాత్రం నిరాశ తప్పదు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలను చొప్పించకుండా దర్శకుడు తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయడానికే ఆసక్తి చూపించాడు. తెలుగుదేశం పార్టీమీద అక్కడక్కడా సెటైర్లుపడ్డాయి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మార్క్ ‘బ్రీఫ్డ్ మి’ పదం ఎలా పాపులరైందో సెటారికల్‌గా ప్రస్తావించాడు. సినిమాలో ఎక్కడా చంద్రబాబు కనిపించడు. కానీ, ఆయన ప్రస్తావన సాగుతుంది. విశేషమేమంటే, సినిమాలో తెలుగుదేశం పార్టీకంటే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని విలన్‌లాగా చూపించడం విశేషం. అయితే వైఎస్‌ను అభిమానించే వాళ్లకు బాగా కనెక్టయ్యే చిత్రమిది.

-త్రివేది