రివ్యూ

గమ్యంలేని గమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* కొత్తగా మా ప్రయాణం
*
నటీనటులు: ప్రియాంత్, యామిని భాస్కర్, భాను, కారుణ్య చౌదరి, జీవ తదితరులు
సంగీతం: కార్తీక్ కుమార్ రొడ్రీగ్
ఎడిటర్: నందమూరి హరి
నిర్మాణం: నిశ్చయ్ ప్రొడక్షన్స్, శ్రీనిధి స్టూడియోస్
దర్శకత్వం: రమణ మొగిలి
*
ప్రియాంత్, యామిని భాస్కర్ జంటగా రమణ మొగిలి దర్శకత్వంలో నిశ్చయ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరెకెక్కిన చిత్రం -కొత్తగా మా ప్రయాణం. చిన్న బడ్జెట్‌తో వచ్చిన చిత్రంలో -ప్రేమికుల ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం.
కథ
కార్తీక్ (ప్రియాంత్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా అమ్మాయిలతో తిరుగుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. ముక్కుసూటి మనస్తత్వం. హార్డ్‌కోర్ అయిన ఇతగాడు కీర్తి (యామినీ భాస్కర్)ను చూసి ప్రేమలో పడతాడు. ప్రేమా పెళ్లిపై అస్సలు నమ్మకం లేని కార్తీక్, కీర్తితోకలిసి సహజీవనం చేద్దామని వెంటపడుతుంటాడు. కార్తీక్‌లాగా కీర్తికీ పెళ్లిపై సరైన అభిప్రాయం లేకపోవడంతో, సహజీవనానికి సై అంటుంది. అలా ఇద్దరూ కమిట్‌మెంట్ చేసుకుని సహజీవనం మొదలెడతారు. తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరికీ అభిప్రాయభేదాలు వస్తాయి. వాటికితోడు కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఇద్దరు విడిపోతారు. తరువాత మళ్లీ కలిసారా? దానికోసం కార్తీక్ ఏంచేసాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
కథలోని మూలాంశం ఆకట్టుకున్నంత బలంగా సినిమాలోని ఆర్టిస్టులు ఆకట్టుకోలేకపోయారు. హీరో ప్రియాంత్ తనను తను ప్రూవ్ చేసుకోడానికి గట్టిగానే ప్రయత్నించాడు. కొన్ని సన్నివేశాల్లో ఓకే అనిపించినా, కీలక సన్నివేశాల్లో మాత్రం అనుభవరాహిత్యం కనిపించింది. హీరోయిన్‌తో రొమాంటిక్ సన్నివేశాల్లో ఓకే అనిపించాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే కీర్తి పాత్రలో యామిని భాస్కర్ ఆకట్టుకుంది. నటనతోపాటు రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె ఒకింత తెగువనే చూపించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటన హైలెట్ అనిపిస్తుంది. మిగిలిన తారాగణం ఉన్నంతలో ఫరవాలేదు అనిపించారు.
సంగీత దర్శకుడు కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించింది. పాటల్లో ఒకటి తప్ప మిగతావన్నీ వృధాగానే ఉన్నాయనిపిస్తుంది. ఫొటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేశాయి. కథాపరంగా నేటి యువత ఆలోచనల నేపథ్యంలో దర్శకుడు మంచి కథ తీసుకున్నప్పటికీ, దాన్ని ఆసక్తికరమైన కథనంగా చూపించలేకపోయాడు. సహజీవనానికి సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు కానీ, దాన్ని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా మలచలేకపోయారు. హీరో హీరోయిన్ల మధ్య ఘర్షణల తాలూకు సన్నివేశాలు తేలిపోయాయి. కొన్ని కీలక సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు, ముద్దులకు హద్దులేకపోవడం విసిగించింది. ముఖ్యంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 సినిమాలను మించిపోయాయి. సంభాషణల మరీ దారుణం. మొత్తంగా సినిమాకు హీరో పాత్రే మైనస్. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా ఏకోణంలోనూ ఆకట్టుకునేలా సాగలేదు. ఒకటి రెండు ఎమోషనల్ సన్నివేశాలు హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలే చూడగలుగుతాం. హీరోను మాస్ హీరోలా చూపించే ప్రయత్నంలో ఓవర్‌యాక్షన్ మరీ ఎక్కువైంది. ఓ రొటీన్ కథను అంతకంటే రొటీన్‌గా తెరకెక్కించిన విధానం ప్రేక్షకుడిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. *