రివ్యూ

కంగన విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది *** మణికర్ణిక
***
తారాగణం: కంగన రనౌత్, అంకితా లోఖండే, అతుల్ కులకర్ణి, జిషు సేన్ గుప్తా, సురేష్ ఒబెరాయ్, డానీ డెంగోజాపా
సంగీతం: శంకర్-ఇసాన్-లాయ్
సినిమాటోగ్రఫీ: కిరణ్ డియోహన్స్, జ్ఞానశేఖర్
కథ: విజయేంద్రప్రసాద్
ఎడిటింగ్: రామేశ్వర్, సూరజ్ జగ్తప్
నిర్మాణం: జీ స్టూడియోస్, కమల్ జైన్, నిశాంత్ పిట్టి
దర్శకత్వం: క్రిష్ , కంగనా రనౌత్
***
క్వీన్ చిత్రంతో బాలీవుడ్‌లో తనేంటూ నిరూపించుకుంది కంగనా రనౌత్. ఆ ఒక్క చిత్రంతోనే -నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలకు తానే ఏకైక ఆప్షన్ అయ్యింది కూడా. కంగన ఎంచుకునే కథల దగ్గర్నుంచీ, వాటి ప్రజెంటేషన్ వరకూ అంతా వైవిధ్యమే. ఆ కోణం నుంచే -్భరత వీరనారి లక్ష్మీబాయి పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఝాన్సీ రాణి పాత్రలో ఆమె చేసిన తాజా చిత్రమే -మరణికర్ణిక. నిజానికి సినిమా ఆరంభమైన దగ్గర్నుంచీ వివాదాలే చుట్టుముట్టాయి. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ -ప్రాజెక్టులో అభిప్రాయభేదాలు తలెత్తడంతో తప్పుకున్నారు. మిగతా భాగాన్ని లీడ్ రోల్ పోషించిన కంగన భుజానికెత్తుకుంది. అలా ఈ చిత్రం -సంయుక్త దర్శకత్వంలో వచ్చినట్టయ్యింది. ఇక -చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తున్నారన్న వివాదాలు ప్రాజెక్టును చుట్టుముట్టాయి. వివాదాలను ఎదుర్కొంటూనే -చిత్రీకరణ పూర్తి చేశారు. అటు సుప్రీం కోర్టునుంచి, ఇటు సెన్సార్ విభాగాల నుంచి క్లీన్ చిట్ రావడంతో -ఎట్టకేలకు ఎలాంటి అవాంతరాలు లేకుండానే శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది మణికర్ణిక. వివాదాలను అధిగమించిన మణికర్ణిక, ఆడియన్స్‌ను మెప్పించిందా? ఝాన్సీ పాత్రలో కంగనా ఆకట్టుకుందా? చూద్దాం.
బెనారస్ ప్రాంతం బితూర్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి మణికర్ణిక (కంగనా రనౌత్). ఝాన్సీ చక్రవర్తి గంగాధర్ రావు (జిషు సేన్ గుప్తా)ను పెళ్లాడుతుంది. రాణిగా రాజ్యానికి వచ్చిన తరువాత మణికర్ణిక పేరు లక్ష్మీబాయిగా మారుతుంది. అలా రాణీ లక్ష్మీబాయిగా ఝాన్సీ ప్రజలతో మమేకపై, సమర్థత కలిగిన వీరవనితగా పేరు తెచ్చుకుంటుంది.
అప్పటికే భారత దేశంలోకి అడుగుపెట్టిన బ్రిటీషర్లు -ఈస్ట్ ఇండియా కంపెనీని విస్తరిస్తుంటారు. ఆ విస్తరణలో ఝాన్సీ రాజ్యంపైనా బ్రిటీషర్ల కన్ను పడుతుంది. బలవంతంగా రాజ్యాన్ని వశం చేసుకునే బ్రిటీష్ ప్రయత్నాలను తిప్పికొడుతుంది లక్ష్మీబాయి. కనీసం చర్చలకు కూడా ఆస్కారం ఇవ్వకపోవడంతో, బ్రిటీషర్ల అహం దెబ్బతింటుంది. కుటిల యత్నాలు, బలప్రయోగంతో ఝాన్సీని వశపర్చుకునేందుకు ప్రణాళిక రచిస్తారు. ఈ పరిణామాలను ఝాన్సీ రాణి ఎలా ఎదుర్కొంది? స్వాతంత్య్ర సమరాన్ని ఎలా సాగించింది? ఎలాంటి పరాక్రమాన్ని ప్రదర్శించింది? చోటుచేసుకున్న సంఘటనలేంటి? వీటిని సమాధానమే -మణికర్ణిక చిత్రం.
బ్రిటీషర్లు రాకమునుపు దేశ కాలమాన పరిస్థితుల్ని బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్‌తో చెప్పించారు. అక్కడినుంచే సినిమా మొదలవుతుంది. కథకు ముందుభాగాన్ని వాయిస్‌ఓవర్‌తో నడిపిస్తూనే -కథాంశమైన మణికర్ణిక నుంచి సినిమా ఆరంభమవుతుంది. ప్రథమార్థంలో మణికర్ణిక బాల్యాన్ని చక్కగా చూపించారు. అందచందాలు, సాహసోపేత నిర్ణయాలు, చలాకీతనం.. ఇలా మణికర్ణిక ఎదుగుదలను చూపిస్తూనే, పెళ్లి తరువాత ఝాన్సీలో ఆమె రాణీవాసాన్ని చూపించారు. ద్వితీయార్థం నుంచే అసలు కథ ఆరంభమవుతుంది. ఝాన్సీని హస్తగతం చేసుకోడానికి బ్రిటీషర్లు చేసిన కుట్రలను ఝాన్సీ రాణి ఎలా తిప్పికొట్టిందో చూపించారు. అలగే యుద్ధ సమయంలో లక్ష్మీబాయి వీరోచిత పోరాటం కళ్లకుకట్టారు. చరిత్రలో చదువుకున్న లక్ష్మీబాయి గాథ కళ్లముందు సాగుతున్నట్టే అనిపిస్తుంది. పదిమందికీ తెలిసిన చారిత్రక అంశానే్న కాకుండా, ఝాన్సీ కుటుంబంలోని అంతర్గత అంశాలు, ఎదుర్కొన్న ఇబ్బందులనూ చిత్రీకరించి కథను రక్తికట్టించారు. అలాగే, మీరట్ సిపాయి తిరుగుబాటు సహా 1800 కాలంనాటి సంఘటనలనూ కథలోకి ఇమడ్చటంతో సినిమా ఆసక్తిని పెంచింది. ఇప్పటి వరకూ చారిత్రక కథనంలానే చదువుకున్న లక్ష్మీబాయి కథలో -పాత్రలు పురుడుపోసుకుని చాతుర్య సంభాషణలతో సాగుతుండటం ఆసక్తికరం అనిపించింది. అక్కడక్కడా అతిగా కనిపించే విజువల్ ఎఫెక్టులను ఒకింత పక్కనపెడితే -ఝాన్సీ రాజ్యం, ఆనాటి సంఘటనలు, లక్ష్మీబాయి వీరోచిత ఘట్టాలను విజువల్‌గా అద్భుతంగా తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాల్లో ఆ కాలంనాటి ఆయుధాలనే ఉపయోగించామంటూ చిత్రబృందం ప్రకటించినట్టేగానే ఆయా సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడింది. కిరణ్ డియోహన్స్, జ్ఞానశేఖర్‌ల సినిమాటోగ్రఫీ ప్రేక్షకుడి చేయిపట్టుకుని ఆ కాలంలోకి తీసుకెళ్లినట్టే అనిపిస్తుంది. సన్నివేశాల చిత్రీకరణ బలంగా సాగటం, అందుకు తగినట్టు శంకర్-ఇసాన్-లాయ్‌ల నేపథ్య సంగీతం సినిమాకు అదనకు బలాన్నిచ్చాయి. నిర్మాణ విలువల్ని ఎంచాల్సిన పని లేదు. ఈ చిత్రంతో కంగన్ మరోసారి విశ్వరూపం చూపించింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలోకి కంగన పూర్తిగా ఒదిగిపోయింది. బాల్యం, యువ్వనాన్ని చూపిన ఘట్టాల్లో చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించి, రణరంగాన కత్తి దూస్తూ రౌద్రరూపం దాల్చిన లక్ష్మీబాయి పాత్రకు అద్భుతమైన వేరియేషన్స్ చూపించి మెప్పించింది. మణికర్ణిక జీవితంలోని ఒక్కో పార్శ్వానికి ఒక్కో తరహాలో కంగన కనిపించటం చిత్రంలోని ప్రత్యేకత. కంగన నట జీవితానికి మణికర్ణిక మరో మైలురాయి అనొచ్చు. లక్ష్మీబాయి భర్త గంగాధర్‌రావు పాత్రలో జిషుసేన్ గుప్తా, గౌస్‌ఖాన్ పాత్రలో డానీ డెంగోజపా, ఘల్కరీబాయి పాత్రలా అంకితా లోఖడే, ఇతర పాత్రధారులూ సినిమాకు పూర్తి న్యాయం చేయగలిగారు. మొత్తంగా మణికర్ణిక -కంగన నట జీవితంలో ఓ మణిపూసే.

-ఉత్తమ్