Others

అది నిజము కాదులే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు
నన్ను వదలి నీవు పోలేవులే!

తారాగణం: కోలా బాలకృష్ణ, వామిక, పార్వతీ నాయర్ తదితరులు
సంగీతం: అమృత్,
నిర్మాత: కోలా భాస్కర్,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీరాఘవ,
దర్శకత్వం: గీతాంజలీ శ్రీరాఘవ
--

ఎలాంటి ఇబ్బందులొచ్చినా భార్యాభర్తల మధ్య బంధం ఒకరినుంచి ఒకరిని విడదీయ లేనిదని మరోసారి ‘నన్నువదలి నీవుపోలేవులే’ చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆ చెప్పే ప్రక్రియ ‘మోటు’గా ఉంది. అది రాఘవ మార్కులో! అదేమిటో చూద్దాం..
కాన్సర్ బాధితురాలైన తల్లి కోరిక ప్రకారం మనోజ (వామిక) ఇష్టం లేకపోయినా ప్రభు (కోలా బాలకృష్ణ)ని పెళ్లిచేసుకుంటుంది. అయితే అనంతరం వారిమధ్య అసహజంగా దొర్లిన సంఘటనలూ, అవి విడాకులు వరకూ వెళ్లిన విధానం, తిరిగి ఆ ఇద్దరూ ఒకటవడం తదితరాలతో ముగుస్తుంది కథ. సమాజంలో అన్ని వివాహాలూ విధిగా ఇద్దరి భాగస్వాములకూ ఇష్టమయ్యే జరగవు. కానీ జీవనం సాఫీగా ఉండాలంటే సర్దుబాటుతత్వం అవసరం. కానీ ఇందులో ఆ సర్దుబాటుతనానికి వీలుకాని పరిస్థితులు చేరాయి. వివాహానికి ముందు తన భార్యకు మరొకరితో సంబంధాలున్నాయేమోనన్న అనుమానం వికృతరూపం దాల్చి చంపడానికి వస్తాడు ప్రభు. అలాగే ఇంకో సందర్భంలో తాగిన మైకంలో భార్యకిష్టం లేకపోయినా బలవంతం చేస్తాడు. ఇలాంటి సందర్భాలప్పుడు అనంతరం తప్పకుండా పరిణామాలు డైవర్స్‌కీ వెళ్తాయి. దాన్నుంచి తిరిగి కాపురం పట్టాలపైకి తీసుకురాడం ఇందులో జరిగినా అది ఒప్పుకోలు విధంగా చిత్రించలేదు! అసలు ఓ రకంగాచూస్తే జరిగిన సంఘటనలూ మనోజకిచ్చిన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. తానెంతో ప్రేమించిన తరుణ్‌తో వివాహానికి పూర్వం సెక్స్ కోరికను వెల్లడించిన కారణంగా విడిపోయిన వ్యక్తిత్వంకల వనితగా మనోజను చూపారు. కానీ చివరకు అదే తరుణ్ (తరుణ్ తత్వం తెలిసీ)ని తనని ప్రపోజ్ చేయమని కోరుతుంది. అప్పుడూ తరుణ్ తనతో మారుమాట్లాడకుండా పది రోజులు ఒంటరిగా గడపాలని షరతు విధిస్తాడు. ఇదీ ఒప్పుకుంటుంది మనోజ. మరి ఉన్నత వ్యక్తిత్వంగల మనోజ అలా ఒంటరిగా అతనితో వెళ్లడానికీ (అతని సంగతి తెలిసీ) ఒప్పుకోడం పరస్పర విరుద్ధ అంశం. అదే రీతిలో అంతటి ప్రిన్సిపుల్స్‌గల అమ్మారుూ, వైన్ అంటే మహాఇష్టం వంటి నేచర్ గలిగి ఉండడమూ విచిత్రమే. ఇక ప్రచార, ప్రసారాల మాధ్యమాల ద్వారా అనేకానేక సీరియల్స్, సినిమాలూ చూసేసిన ఈనాటి అత్యాధునిక సగటు ప్రేక్షకునికి ప్రతీదీ విడమరచి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కథానాయకుడు, కథానాయికని బలవంతం చేసే ప్రక్రియ అంత విస్తారంగా చూపక్కరలేదు. దీనివల్ల ప్రేక్షకుడికి వికారం కల్గుతుంది తప్ప ఎలాంటి ఉత్కంఠ కలగదు. ఇంకో రకంగా అంటే కథానాయిక వ్యక్తిత్వాన్ని ఆమె బోయ్‌ఫ్రెండ్ మానస్ ద్వారా తెలుసుకున్న (మనోజ పెళ్లికిముందు అనంతర కార్యక్రమాలకు ఇష్టపడదు...) ఇంకా నాయకుడు తన పంథాను మార్చుకోడం జరగదు. అంటే దీన్నిబట్టి సినిమాలో చెప్పదల్చుకున్న దానిపై క్లారిటీని కన్‌ఫర్మ్ చేయడంకన్నా, కన్‌ఫ్యూజన్‌ని కంటిన్యూ చేయడం అన్నదానిపైనే దర్శకురాలు ఆధారపడ్డారు అన్నది తెలిసిపోతోంది.
ప్రథమార్థంలో భార్యాభర్తల మధ్య వచ్చిన పొరపొచ్చాలు చూపడానికి సమయం వెచ్చించారు. తిరిగి వారిని కలపడానికి చేసిన ప్రక్రియతో ద్వితీయార్థం నడుస్తుంది. ఆ ప్రక్రియ చాలా సాగదీసినట్లుగా కనిపించింది. అందుకే బార్‌లో అనవసరమైన పాట తదితరాలు చూపారు. వాస్తవానికి ఈ పాటను తొలగించవచ్చు.
నటీనటుల్లో నిశ్చయంగా ముందు చెప్పుకోవాల్సిన పెర్‌ఫార్మెన్స్ మనోజగా నటించిన వామికదే. పాత్రకున్నా భిన్నవ్యక్తిత్వాన్ని విస్మరించి చూస్తే రోల్‌లో ఉన్న షేడ్స్‌నన్నీ చక్కగా పలికించింది. తర్వాత ప్రభు పాత్రధారి కోలా బాలకృష్ణ కూడా తనకున్న పరిధిలో బానే నటించాడు. మిగిలిన పాత్రలన్నీ కథ నడవడానికి ఉపకరించేవే తప్ప ప్రాముఖ్యమున్నవేం కావు. పాటల బాణీలన్నీ తమిళ వాసనే కొట్టాయి. ఉన్నంతలో ‘ఎనె్నన్నో తెలుపగా...’ పాట ఓ మోస్తరుగా ఉంది. ‘నువ్వు పెళ్లైన తర్వాత నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా చికెన్‌గున్యా ఇచ్చావు’ అన్న మాటల్లో అక్కడక్కడ సందర్భానుసారంగా మెరపులొచ్చాయి. సాధారణంగా అంతకుముందు పాప్యులర్ అయిన పాట పల్లవి సినిమాకు పేరుగా పెట్టినపుడు, ఆ ప్రజాదరణ పొందిన బాణీని చిత్రం మొత్తంపై ఒక్కసారైనా ఉపయోగించడం జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా కొన్ని దశాబ్దాల క్రితం విడుదలైన ‘మంచి మనసులు’ (నాగేశ్వరరావు, సావిత్రి తారాగణంగా వచ్చినది) చిత్రంలో బహుశా ప్రజాదరణ పొందిన ‘నన్నువదలి నీవు పోలేవులే!’ పాటలోని పల్లవిని ఈ చిత్రం పేరుగాపెట్టినా ఆ పాటను ఒక్కసారి కూడా నేపథ్యంలో కనీసం మ్యూజిక్‌గానైనా వినిపించకపోడం చెప్పుకోతగ్గ అంశం. రొటీన్‌గా వచ్చే ప్రేమలూ, పెళ్ళిళ్లూ వగైరా బాట పట్టకుండా వివాహానంతరం జంటల్లో వచ్చే సంకటాలు విశే్లషించడం వంటివి కొత్తదనాన్ని అందించేదేనైనా, ఆ విధానంలో సున్నితత్వాన్ని స్పృశించి వుంటే ‘నున్న వదలి’ని ప్రేక్షకులు వదలకుండా వీక్షించే వారేమో!

-అనే్వషి