రివ్యూ

ప్రేక్షకులే టార్గెట్! (ఎటాక్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు
ఎటాక్

తారాగణం: మనోజ్, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, నవీన్, సురభి, అభిమన్యుసింగ్, పూనమ్‌కౌర్, మంజుభార్గవి
కెమెరా: అంజి
సంగీతం: రవిశంకర్.
నిర్మాతలు:
శే్వతలానా, తేజ, సి.వి.రావు,
దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
---

చెడు ఎక్కడైనా చెడే. చుట్టూ చెడ్డవాళ్లే ఉన్నప్పుడు ఆ చెడు మంచిగానే మన్నన పొందుతుంది. చెడ్డ పనులు చేయడమే వృత్తిగా ఎంచుకున్నప్పుడు, ఆ చెడులోనే కలిసిపోవడం సహజం. కత్తితో యుద్ధం చేసేవాడు కత్తికి బలైనట్లే, నేర వృత్తిలో ఉన్నవాడు చివరికి నేరంతోనే హతమవుతాడన్న సూక్తిని ఎటాక్ చెప్పే ప్రయత్నం చేసింది. సార్వత్రిక ప్రతిజ్ఞావాక్యం ఎప్పుడూ ఖచ్చితత్వంతోనే ఉంటుంది. కానీ దానికి అన్వయాలే రకరకాలుగా ఉంటాయి. ఒక్కో వ్యక్తి ఒక్కోలా అర్థం చేసుకుంటాడు. అప్పుడు సన్నివేశాలు, సంఘటనలు మారిపోతాయి. అవి పాజిటివ్ థింకింగ్‌తో ఉంటే ఒకలా, నెగెటివ్ ఆలోచనలతో మరోలా కనిపిస్తాయి. ఎదురుగా వున్నవి ఎప్పుడూ నిజం కాదు, అలాగని అబద్ధమూ కాదు. ఎటాక్ చూస్తే అలాంటి ఫిలాసఫీ వొళ్లంతా నిండిపోవడం ఖాయం.
కథేంటి?
గురురాజ్ (ప్రకాష్‌రాజ్) ఒకప్పుడు పెద్ద రౌడీషీటర్. అలాంటి జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేసి ముగ్గురు కొడుకులతో సాధుజీవిగా బ్రతికేస్తుంటాడు. ఓ స్థలానికి సంబంధించిన వివాదంలో గురురాజ్‌పై ఆగంతకులు ఎటాక్ చేసి ప్రాణం తీస్తారు. వారెవరో కనుక్కొని హతమార్చాలని ప్రయత్నించే గురురాజ్ పెద్ద కొడుకు కాళీ (జగపతిబాబు) కూడా హత్యకు గురవుతాడు. ఈ హత్యలకు కారకులెవరో అంతుచిక్కదు. రెండో కొడుకు భూపి (నవీన్ వడ్డె), మూడో కొడుకు రాధ (మంచు మనోజ్)లు ఈ గొడవలన్నీ వదిలేసి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటారు. కానీ అన్న హత్యతో రెచ్చిపోయిన రాధ, ఈ హత్యల వెనుక వున్న సూత్రధారిని కనిపెట్టి, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మిగతా శత్రువర్గాన్నంతా ఒక్కొక్కరిపై ఎటాక్ చేస్తూ ఎలా పగ తీర్చుకున్నాడన్నదే మిగతా కథ.
ఎలా వుంది?
ఆమధ్య వచ్చిన దండుపాళ్యం ప్రేరణతో అలాంటి సన్నివేశాల సమాహారంగా ఇలాంటి చిత్రాన్ని రూపొందించినట్టు వుంది. మొదటినుండి ప్రతి సీను కృత్రిమంగా రామెటీరియల్ కుప్పపోసినట్లుగా సాగుతుంది. చెడ్డవాడిని శిక్షించకపోవడం మహాపాపం అన్న కానె్సప్ట్‌తో మొదలయ్యే ఈ సినిమా, ప్రతి చెడ్డవాడిని టార్గెట్ చేసినట్టుగానే అమాయకుడైన ప్రేక్షకుడిని కూడా టార్గెట్ చేసింది. తెరపై సాగే బీభత్స, భయానక సన్నివేశాలకుతోడు ఎటాక్.. ఎటాక్ అంటూ సాగే భయంకర స్వరంతో సాగే పాటలు గగుర్పాటుకు గురిచేస్తాయ. అడ్డంగా నరికే ధర్మాన్ని, అధర్మాన్ని పూజించులాంటి సంఘ వ్యతిరేక ప్రేలాపనలతో సినిమా అంతా బీభత్సంగా సాగింది. తనకు చెడు చేసిన మనిషిని శిక్షించాలని ‘దేవుడితో మనిషి కూర్చుని రాయించుకున్న ధర్మసూత్రం’ ఎక్కడుందో గానీ ఈ సినిమాలో మాత్రం కనిపించింది. ఏమైనా మనిషి రాయించుకున్న ధర్మ సూత్రాలు మనిషే కాలరాస్తున్నాడు కదా? మొదటినుండి సినిమా పాత చింతకాయ పచ్చడి కథాకథనాలతో రాబోయే సన్నివేశాలు ఎలాంటివో ఊహించేస్తూ ప్రేక్షకుడు తాను విజయం సాధించానని ఆనందపడిపోతుంటాడు. ఎందుకంటే గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసినవే. కొత్తదనం కథలో గానీ కథనంలో గానీ ఎక్కడైనా మచ్చుకైనా కనబడదు. ఇలాంటి కథాబలం లేని సినిమాలకు రామ్‌గోపాల్‌వర్మ లాంటి దర్శకుడు సరికొత్త ట్రీట్‌మెంట్ ఇస్తే ఆ సన్నివేశాలు బలంగా తయారయ్యేవేమో? అంత కష్టం కూడా పడదల్చుకోలేదు. జస్ట్ ఎటాక్ అని వదిలేస్తే ప్రేక్షకులకు అది ఎట్రాక్ట్ అయిపోతుంది అనుకున్నట్టున్నాడు. రౌడీయిజాన్ని హీరోయిజమ్ అనుకోవద్దు అని సినిమాలో ఓ డైలాగ్ పెట్టారు. నిజమే -పేజీల సంభాషణలు, పుంజీడు సన్నివేశాలు కలిపేస్తే అది సినిమా కాదన్న కొత్త సూత్రాలు ఈ సినిమా చూసి మనమూ రాసేసుకోవచ్చు. చావదురా పగ అని నేపథ్య ‘ఖో’రస్ సంగీతం చెవులల్లో సీసం పోసినట్లే సాగింది. నటీనటుల్లో అభిమన్యుసింగ్ సచ్చూగా సినిమాను తన అధీనంలోకే తీసుకున్నాడు. మొత్తం సినిమా అంతా అతనిపైనే సాగింది. ఎంతమంది హీరోలున్నా అందరూ డమీల్లాగే కనిపించారు. పూనమ్‌కౌర్ తన పాత్రవరకు ఓకే. సురభి వచ్చినప్పుడల్లా బోరుకొట్టిన సన్నివేశాలన్నీ ఒకదానితర్వాత ఒకటి పేర్చేశారు. ఎడిటింగ్ చాలా చేయచ్చు. సంగీతం రెండు చెంపలు వాయించినట్లుగా చెవుల్లో గింగురుమంటుంది. మంజుభార్గవి వున్నా వృధాపాత్ర. ఒక్క కెమెరా పనితనం సినిమాలో హైలెట్‌గా వుంటుంది. ముఖ్యంగా నగరాన్ని ఆకాశంలోనుండి చూపిన విధానం బావుంది. ప్రకాష్‌రాజ్ పాత్ర మొదట్లోనే గతించినా, మధ్యమధ్యలో గీతోపదేశం చేసినట్లుగా కనిపిస్తూనే వుంటుంది. ఇది కూడా విసిగించే అంశం. దర్శకత్వ పరంగా ఎటువంటి మెరుపులను మెరిపించలేకపోయింది ఎటాక్. ఇలాంటి సినిమాలు వరుసపెట్టి వదులుతున్నా, వర్మ ఇంకా గొప్ప సినిమాలు తీయగలడని కలకాలం మనం నమ్ముతూనే ఉండాలేమో.

-శేఖర్