రివ్యూ

రన్-- చతికిలపడ్డాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు రన్

తారాగణం:
సందీప్‌కిషన్, అనీషా అంబ్రోస్, పోసాని కృష్ణమురళి, షకలక శంకర్, రాంప్రసాద్, బాబి సింహ , కాశీ విశ్వనాథ్, బంటి సతీష్ తదితరులు
సినిమాటోగ్రఫీ:
రాజశేఖర్
సంగీతం: సాయకార్తీక్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి, కిషోర్, అజయ్ సుంకర,
దర్శకత్వం: అని కనె్నగంటి
తమిళంలో సూపర్ హిట్ అయిన నేరం చిత్రానికి రీమేక్- రన్. అని కనె్నగంటి దర్శకత్వం, అనీష అంబ్రోస్ అందం, అనిల్ సుంకర సమర్పణ ఎవరినెలా ఆకట్టుకుందో చూద్దాం.
ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని కొత్త జాబ్‌ను వెతికే ప్రయత్నంలో ఉన్న కుర్రాడే సంజు (సందీప్ కిషన్). చిన్ననాటి స్నేహితురాలైన అమూల్య (అనీష అంబ్రోస్)తో ప్రేమలో ఉంటాడు. జాబ్ లేదనే కారణంగా అమూల్య ఫాదర్ శ్రీనివాసులు (కాశీ విశ్వనాథ్) వీరి పెళ్ళికి ఒప్పుకోడు. డబ్బు వడ్డీకి తీసుకుని, చెప్పిన టైంకి ఇవ్వకపోతే ప్రాణంతీసి బాడీ పార్ట్స్ అమ్ముకునైనా అప్పు వసూలు చేసుకునే కిరాతకుడు వడ్డీ రాజు (బాబీసింహా). సంజు తన చెల్లి పెళ్ళికోసం వడ్డీ రాజు దగ్గర అప్పుతీసుకుంటాడు. కట్ చేస్తే డబ్బు తిరిగి ఇవ్వాల్సిన టైం వస్తుంది. సంజు డబ్బుతో బయలుదేరుతాడు. అదే టైంలో రెండు ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవే అమూల్య సంజుకోసం ఇంటినుంచి వచ్చేయడం, సంజుదగ్గర ఉన్న డబ్బుని దొంగల బాచ్ కొట్టేయడం. ఇక అక్కడినుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది...? సంజు ఒకే టైంలో దొంగలు కొట్టేసిన డబ్బుని దక్కించుకోవడానికి ఏంచేసాడు? అమూల్యని ఎలా దక్కించుకున్నాడు? వడ్డీరాజు డబ్బుకోసం సంజుని ఎలా ఇబ్బందుల్లో తోసాడు? అన్నదే అసలు కథ.
సైలెంట్‌గా కనిపిస్తూ, చేసేవన్నీ చేసేసే టైపు పాత్రలో సందీప్ కిషన్ కనిపించాడు. కాస్త అండర్‌ప్లే చేసే ఈ పాత్రని అసలు చేయలేకపోయాడు. కొన్నిచోట్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే, కొన్నిచోట్ల అవసరమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేకపోయాడు. అనీషా అంబ్రోస్ మాత్రం క్యూట్ లుక్స్‌లో కనిపించింది. ప్రేమ సన్నివేశాల్లో హావభావాలు బాగా పలికించింది. సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత మాత్రం లేదు. ఇక సినిమాకి కీలకమైన పాత్ర చేసింది బాబీ సింహా.. తమిళ వెర్షన్‌లో చేసిన పాత్రని మళ్ళీ చేయడంలో చాలావరకూ సక్సెస్ అయ్యాడు. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నా కుదరలేదు. అమ్మాయిని బుట్టలో వేసుకునే పాత్రలో మహాత్ రాఘవేంద్ర ఓకే అనిపించాడు. ఇక ఎస్‌ఐ పద్మావతిగా బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళిలు అక్కడక్కడా నవ్వించారు.
ఇక స్క్రీన్‌ప్లే తమిళ వెర్షన్‌లో ఎలా ఉందో యాజిటీజ్‌గా అలానే ఉంది. సినిమా ప్రారంభం టైం అనే కానె్సప్ట్ గురించి చెబుతూ ఆసక్తికరంగా స్టార్ట్‌చేసి, అంతే ఆసక్తికరంగా సినిమాని నడిపించాడు. మొదటి అర్ధ్భాగంలో కొన్నికొన్ని స్లోసీన్స్ ఉన్నా ఫ్లోలో పరవాలేదనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బాంగ్‌కి ఇక టార్గెట్ ఏంమిటో తెలిసిపోవడం, కొత్తగా జత చేసిన సీన్స్ బోర్‌కొట్టడంతో సెకండాఫ్ స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తుంది. సూపర్ హిట్ కానె్సప్ట్‌ని డైరెక్టర్ అనిల్ కనె్నగంటి మిస్‌యూస్ చేశాడనిపిస్తుంది. మిగతా టెక్నికల్ టీంలో రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. హైదరాబాద్‌లోని లొకేషన్స్‌ని, గల్లీలని ఎఫెక్టివ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించి విజువల్స్‌తో ఆకట్టుకున్నాడు. మ్యూజికల్ డైరెక్టర్ సాయికార్తీక్ అందించిన పాటలు బాగున్నా సినిమాలో లెంగ్త్ పెంచేసి బోర్‌కొట్టించాయి. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్ ఎం.ఆర్.వర్మ ఫస్ట్‌హాఫ్‌ని మేనేజ్ చేసినా సెకండాఫ్‌ని మేనేజ్ చేయలేక సాగదీసేసి ఆడియన్స్ బోర్ కొట్టించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఒరిజినల్ వెర్షన్‌లోని ఫీల్‌ని మిస్‌చేసి చేసిన సినిమా ఇది. కంటెంట్‌ని వదిలేసి కమర్షియాలిటీకి ప్రాధాన్యతనిచ్చి చేసే రీమేక్ సినిమా ప్రేక్షకులను మెప్పించినట్లు, హిట్ అయినట్టు దాఖలాలు లేవు. రీమేక్ అనగానే తెలుగులో చేసే మొదటి తప్పు, ఒరిజినల్ ఫీల్‌ని వదిలేసి ఇక్కడి ఆడియన్స్‌కోసం నానా హంగామా దట్టించడం, పంచ్‌ల కామెడీ కోసం ఒరిజినాలిటీని చంపేయడం. అదే తప్పు ఈ సినిమాలోనూ జరిగింది. అందుకే పరిగెత్తాల్సిన సినిమా కాస్తా పాకినట్టు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కమర్షియల్ అంశాలను అందించాలని పాటలను, కామెడీని బలవంతంగా జొప్పించారు. సినిమాలో డైరెక్టర్ తెగ కామెడీ ఉందని ఫీల్ అయినా ఆడియన్స్ మాత్రం నవ్వలేకపోయారు. పైగా సినిమాకి కీలకం అయిన వడ్డీ రాజు పాత్రని సీరియస్‌గా కాకుండా కామెడీగా మార్చడం కంటెంట్‌ని తప్పుదోవ పట్టించింది. అలాగే దొంగల ముఠా బాచ్‌కోసం కమెడియన్స్‌ని నటీనటులుగా ఎంచుకోవడం అస్సలు సెట్‌కాని విషయం.

-త్రివేది