తెలంగాణ

రెవెన్యూ సిబ్బందిపై మరో పెట్రో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరు శివారు తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోదాడి జరిగి న హత్యోదంతాన్ని మరువక ముందే మరో ఘటన ఇదే తరహాలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి రెవెన్యూ సిబ్బందిపై కనకయ్య అనే రైతు పెట్రో దాడికి పాల్పడ్డాడు. భూమి పట్టాలు ఇవ్వటం లేదంటూ అటెండర్ దివ్య, ఇతర సిబ్బందిపై పెట్రోల్ పోశాడు. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. అన్నదమ్ముల వివాదం కారణంగా భూమి పట్టాలు ఇవ్వలేక పోతున్నట్లు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీసులు కనకయ్యను అదుపులోనికి తీసుకున్నారు.