రాష్ట్రీయం

మాజీ ఎంపి రాజయ్య బెయిల్ పిటిషన్ తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపు
వరంగల్, డిసెంబర్ 10: మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్యకు వరంగల్ జిల్లా న్యాయస్థానం గురువారం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. నవంబర్ 4న సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమళ్ల సజీవ దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌తో పాటు సనా అనే మరో మహిళ వరంగల్ సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ఏ-3 ముద్దాయిగా ఉన్న రాజయ్య మొదటి సారిగా ఆయనతో పాటు ఆయన భార్య మాధవి బెయిల్ పిటిషన్ పెట్టుకోగా కోర్టు తిరస్కరించింది. రెండో సారి కూడా రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, మొదటి సారిగా కొడుకు అనీల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఇంకా సాక్ష్యాలు సేకరించాల్సి ఉన్నందున నిందితులు బయటకు వస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రాసిక్యూషన్ విజ్ఞప్తి మేరకు.. రెండో అదనపు జిల్లా జడ్జి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిందితులకు మరో 14 రోజులు రిమాండ్‌ను పొడిగించారు.