Others

అది లేనందుకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య కాలంలో ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్న హీరోయిన్ రెజీనానే. ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ వాలిపోతోంది. ఇటీవల చీరలమ్ముతానంటూ తిరిగింది. అది కూడా ఓ మంచి కాజ్ కోసం చేస్తున్నానని చెప్పింది. ఇవన్నీ ఎందుకూ? అన్న డౌట్ సాధారణంగా ఎవరికీ రాదు. ఎందుకంటే -ఆమెకు మంచి హిట్‌పడి చాలాకాలమైందన్న విషయం చాలామందికి తెలుసు కనుక. హీరోయన్ ఇంట్లో కూర్చుంటే వర్కవుట్ అవ్వదు కనుకే, వార్తల్లోకి వస్తోందని కామెంట్ చేస్తున్న వాళ్లు చాలామందే. నిజానికి రెజీనాకి సినిమాలకు కొరత లేదు. తనతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్లకంటే కాస్త వెనకేవున్నా, గ్యాప్ లేకుండా మాత్రం సినిమాలు చేస్తూనే ఉంది. కాకపోతే, చెప్పుకోదగ్గ హిట్టే దొరకడం లేదు. అందుకే గ్లామర్‌ను ఒలకబోస్తూ పలు సందర్భాలను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. చక్కనమ్మ ఏం చేసినా అది గ్లామరే.