Others

రెచ్చిపోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా ఓటమి ఎదురైనప్పుడు గెలుపుకోసం చేసే ప్రయత్నంలో ఎవరైనా సరే రెచ్చిపోవాల్సిందే! ప్రస్తుతం అనీషా ఆంబ్రోస్ పరిస్థితి అలానే ఉంది. అందమైన లుక్‌తో అందర్నీ ఆకట్టుకునే అనీషాకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి, చేజారిపోతున్నాయి. అలియాస్ జానకి చిత్రంలో హీరోయిన్‌గా నటించాక ఒక్కటీ ఆమె ఖాతాలో పడలేదు. ఆ సినిమా ప్రభావమో లేక అమ్మడి జాతక ప్రభావమోగానీ ఒక్కటంటే ఒక్కటీ గుర్తింపు పాత్ర లభించలేదు. గోపాల గోపాల సినిమాలో టీవీ రిపోర్టర్‌గా మెరిసినా జనాలు పట్టించుకోలేదు. అనుకోకుండా పవన్‌కళ్యాణ్ సర్దార్ సినిమాలో ఆమె హీరోయిన్ అని ప్రకటన వచ్చింది. ఏమైందో ఏమోగానీ వెంటనే అనీషాను తప్పించి, కాజల్‌ను ట్రాక్ ఎక్కించారు. దీంతో ఓటమిపాలైనట్లుగా అనీషా ఎదురుదెబ్బ తిన్నది. దాంతో ఇక లాభం లేదని ఈమధ్య బ్యాక్‌లెస్ డ్రెస్‌లతో ఎక్కడికి వెళ్లినా అందర్నీ సమ్మోహనపరుస్తోంది. ఏంటి అనీషానేనా అన్న లెవల్లో రెచ్చిపోతోంది. ఇంత బాగావున్న ఈ అమ్మాయికి హీరోయిన్ అవకాశాలు ఎందుకు రావడంలేదని వారి నోటితోనే పలికిస్తోంది. అదీ తెలివంటే!