తెలంగాణ

పాత కాంట్రాక్టర్లకే పనులు ఎందుకు?: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కాంగ్రెస్ నేతలు, కాంట్రాక్టర్లు వేల కోట్ల రూపాయలను దోచుకుతిన్నారని మంత్రి హరీష్‌రావు చెబుతున్నా, మళ్లీ అదే కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పజెబుతారని టి.అసెంబ్లీలో టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల మేలుకే పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని చెబుతున్న ప్రభుత్వం చత్తీస్‌గఢ్ నుంచి కరంటు కొనేందుకు 12 ఏళ్ల వరకూ ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకుందని ప్రశ్నించారు. కాగా, భర్తలకు దూరంగా ఉంటున్న ఒంటరి మహిళలకు కూడా పించన్లు మంజూరు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.