రాష్ట్రీయం

రంగనాథ్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రముఖ నటుడు రంగనాథ్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్న ఆయన శనివారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. రంగనాథ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన భార్య ఆరేళ్లక్రితం మరణించారు. భారీరూపం, కంచుకంఠం, స్పష్టమైన ఉచ్చారణతో తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రంగనాథ్ మరణం అందరినీ కలచివేసింది. చెన్నైలో పుట్టి, రైల్వేలో టిక్కెట్ కలెక్టర్‌గా ఉద్యోగం చేసి సినిమాల్లోకి వచ్చిన రంగనాథ్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలబడ్డారు. హీరోగా, విలన్‌గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 300 సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించిన ఆయన మంచి కవికూడా. బుద్ధిమంతుడు సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసిన రంగనాథ్, జమీందారుగారి అమ్మాయి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం వంటి హిట్ సినిమాల్లో హీరోగా అలరించారు. 2009 నుంచి సినిమాల్లో అవకాశాలు లభించకపోవడం, కుటుంబ సభ్యులు తన గురించి శ్రద్ధ తీసుకోకపోవడంతో ఆయన జీవితంపై విరక్తిచెందారని సన్నిహితులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు రంగనాథ్‌ను కలిసేందుకు వచ్చారు. ఎంతసేపు తలుపుకొట్టినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి వంటగది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. సమీపంలోనే నివాసముంటున్న ఆయన కుమార్తెకు సమాచారం చెప్పడంతో ఆమె వచ్చి అశోక్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇదిలావుండగా తనవద్ద ఉన్న కొన్ని బాండ్‌లు తనకు సేవచేసిన వారికే చెందాలని గోడపై రాసినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే పలువురు చిత్రరంగ ప్రముఖులు రంగనాథ్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.