బిజినెస్

‘పతంజలి’ ప్రచారంలో బాబా రామ్‌దేవ్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ సంస్థలతో పోటాపోటీగా టీవీల్లో ప్రకటనలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: యోగా గురువు బాబా రామ్‌దేవ్ తన ఆయుర్వేద ఔషధాల గురించి ప్రజలకు తెలియజేసి, అమ్మకాలను పెంచుకోవడానికి భారీ ఎత్తున టెలివిజన్‌ల ద్వారా చేపట్టిన ప్రచారంలో బహుళజాతి సంస్థలతో పోటీ పడుతున్నారు. గత నెల నవంబర్ 21 నుంచి 27 లోపు పతంజలి అన్న పేరుతో చేపట్టిన ఆయుర్వేద మందులకు సంబంధించి 12,629 సార్లు ఉత్పత్తుల బొమ్మలతొప్రకటనలు జారీ చేశారు. ఈ క్రమంలో పతంజలి సంస్థ బహుళజాతి సంస్థలైన క్యాడ్‌బరీ, ఫేయిర్ అండ్ లలీతో పోటాపోటీగా నిలిచి తృతీయ స్థానంలో నిలబడినట్లు బ్రాడ్‌కాస్ట్ రిసెర్చ్ కౌన్సిల్ అనే అధ్యయన సంస్థ తెలియచేసింది. ఇదిలావుంటే బాబా రామ్‌దేవ్ సంస్థ వచ్చే సంవత్సరంలో తమ ఉత్పత్తులు, వ్యాపార కార్యకలాపాల ప్రచారం కోసం 300 కోట్ల రూపాయలను కేటాయించింది. బాబా రామ్‌దేవ్ 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కలిగి ఉన్నారు. ఔషధాల తయారీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల ఆటా నూడుల్స్‌ను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినది తెలిసిందే.