రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 105 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(అయోధ్యకాండ సర్గ 105వ సర్గ 33వ శ్లోకం నించి)
*
రాముడు తను చెప్పేది ఇలా కొనసాగించాడు.
‘తనపై ఆధారపడ్డ వాళ్లని పోషించడం, ప్రజల్ని బాగా పాలించడం, ధర్మంగా ధనాన్ని ఆర్జించడం, శుభమైన పనులని చేయడం, ఉత్తమమైన దక్షిణలు ఇచ్చి యాగాలు చేయడం. వీటి వల్ల మన తండ్రి స్వర్గానికి వెళ్ళాడు. మహారాజు అనేక రకాల యాగాలతో దేవతలని పూజించి ఎక్కువ కాలం జీవించి పుష్కలంగా భోగాలని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. నాయనా! దీర్ఘాయుష్షుని, ఉత్తమ భోగాలని అనుభవించి సత్పురుషుల చేత గౌరవం అందుకున్న, స్వర్గస్థుడైన మన తండ్రి గురించి బాధ పడక్కర్లేదు. ఆయన జీర్ణమైన మానవ దేహాన్ని విడిచి, బ్రహ్మలోకంలో కూడా సంచరించగల దివ్య దేహాన్ని పొందాడు. శాస్త్ర జ్ఞానం, అధిక బుద్ధి గల దశరథుడి వంటి ప్రాజ్ఞుడి గురించి నీ వంటి వాడు కాని, నా వంటి వాడు కాని దుఃఖించకూడదు. ధీమంతుడికి ఎలాంటి ఇమ్బంది వచ్చినా ఇలాంటి అనేక విధాలైన శోకాలని, విలాపాలని, రోదనలని ధైర్యంతో విడవాలి. మాటల్లో నేర్పు గల భరతా! నువ్వు తేరుకో. విచారించకు. వెళ్లి అయోధ్యని పాలించు. జితేంద్రుడైన మన తండ్రి నీకా విధంగా ఆజ్ఞాపించాడు. పవిత్ర కర్మలు గల తండ్రి ననే్నమి ఆజ్ఞాపించాడో అది నేను చేస్తాను. భరతా! నేను మహారాజు ఇచ్చిన ఆజ్ఞని ఉల్లంఘించకూడదు. నువ్వు కూడా దాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఆయనే మనకి బంధువు. మన తండ్రి. అందువల్ల నేను అడవిలో నివసిస్తూ ధర్మాత్ముడైన తండ్రి చేసిన పూజనీయమైన ఆజ్ఞని పాలిస్తాను. పరలోకంలో సుఖం కావాలని కోరుకునే మానవుడు ధార్మికుడై, క్రూరత్వం లేకుండా గురుసేవ చేయాలి. మన తండ్రి ఎంత ఉత్తమ చరిత్ర కలవాడో తెలుసుకుని నువ్వు కూడా నీ స్వధర్మాన్ని నిర్వర్తించు.’
మహాత్ముడు, సమర్థుడైన రాముడు ఇలా ‘తండ్రి ఆజ్ఞని పరిపాలించు’ అని భరతుడితో మంచి అర్థాలు గల మాటలు చెప్పాడు. (అయోధ్య కాండ సర్గ 105వ సర్గ 33వ శ్లోకం నించి)
ఆ భాగీరథీ నదీ తీరంలో రాముడు ఇలా మంచి మాటలు చెప్పి వౌనం వహించాడు. అప్పుడు ధార్మికుడైన భరతుడు స్వభావం చేత వాత్సల్యం కలవాడైన రాముడితో ధర్మసమ్మతం, ఆశ్చర్యకరమైన మాటలు చెప్పాడు.
‘ఓ శతృసంహారకా! నీకు దుఃఖం వల్ల బాధ కాని, సుఖం వల్ల సంతోషం కాని లేవు. అలాంటి నీతో సమానమైన వాడు ఈ లోకంలో ఎవరున్నారు? నువ్వు వృద్ధులకి ఇష్టమైన వాడివి. వాళ్లని కలిసి అనుమానాలని తీర్చుకుంటూంటావు. మరణించిన వారి విషయంలో, జీవించి ఉన్న వారి విషయంలో, చెడ్డ వాడి విషయంలో, మంచివాడి విషయంలో రాగద్వేషాలు లేని బుద్ధి కలవాడికి ఈ లోకంలో ఏది దుఃఖాన్ని కలిగిస్తుంది? వస్తువుల్లో లేదా ప్రజల్లోని తారతమ్యాన్ని చక్కగా గుర్తించగలిగే నీ వంటి వాడు ఇలాంటి దుఃఖాన్ని పొంది బాధ పడకూడదు. నువ్వు దేవతలతో సమానమైన బలం గలవాడివి. సత్యమైన ప్రతిజ్ఞ గలవాడివి. అన్నీ తెలిసిన వాడివి. అన్నీ చూడగల వాడివి. బుద్ధిమంతుడివి. ప్రపంచం యొక్క ఉత్పత్తి, వినాశనాల లాంటి వాటి గురించి తెలుసుకో గలిగిన నీ వంటి ఉత్తమ గుణవంతుడు, సహింప శక్యం కాని ఇలాంటి దుఃఖంతో (అది నిన్ను తాకకపోయినా) బాధపడటం తగదు.
‘దుష్టురాలైన నా తల్లి నా కోసం చేసిన ఈ పాపకార్యం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను అనుగ్రహించు. పాపపు పని చేయడం వల్ల శిక్షకి అర్హురాలైన నా తల్లిని పెద్దలు వారించడంతో చంపలేక పోతున్నాను. పవిత్రమైన వంశంలో పుట్టి, పవిత్రమైన కర్మలని ఆచరించిన దశరథుడి కొడుకునైన నేను ధర్మం తెలిసి కూడా లోకనిందితమైన ఈ అధర్మ పనిని ఎలా చేస్తాను? దశరథుడు నాకు గురువు. క్రియాశీలుడు, వృద్ధుడు, తండ్రి, దేవత వంటి వాడు. ఆయన ఇప్పుడు లేడు కూడా. పోయిన వారి గురించి చెడు మాట్లాడకూడదు కదా? ఇందువల్ల తండ్రిని నేను సభలో నిందించడం లేదు. ధర్మాలు తెలిసిన ఓ రామా! ధర్మజ్ఞుడైన ఎవరైనా స్ర్తిని సంతోషపెట్టటానికి ధర్మార్థాలకి విరుద్ధమైన ఇలాంటి పాపపు పనిని చేస్తాడా? వినాశకాలంలో మంచి, చెడు ఆలోచించరనే ప్రాచీనమైన లోకోక్తి ఉంది. రాజు ఇలా ప్రవర్తించి ఆ లోకోక్తి నిజమే అని నిరూపించాడు. మన తండ్రి కోపం చేతో, అజ్ఞానం లేదా సాహసం చేతో ధర్మాన్ని అతిక్రమించాడు. అందువల్ల నువ్వు కర్తవ్యాన్ని బాగా ఆలోచించి ఆయన చేసిన ధర్మ విరుద్ధమైన పనిని వెనక్కి తిప్పాలి. తండ్రి చేసిన ఉత్తమ కార్యాన్ని మాత్రమే అభినందించే కొడుకే కొడుకు. అలా కాకపోతే అతను కొడుకే కాదు. అందువల్ల నువ్వు అలాంటి మంచి కొడుకువి అవు. లోకంలోని బుద్ధిమంతులంతా నిందించిన, తండ్రి చేసిన పాపకర్మ నిన్ను పొందకూడదు. నువ్వు కైకేయిని, నన్ను, తండ్రిని, మన బంధుమిత్రులని, పట్టణ, గ్రామ ప్రజలని, సమస్తమైన ఈ రాజ్యాన్ని రక్షించు. అరణ్యం ఎక్కడ? క్షత్రియ ధర్మం ఎక్కడ? జటలెక్కడ? కిరీటం ఎక్కడ?
‘నువ్వు ఇలాంటి విరుద్ధమైన పనులని చేయకూడదు. రాజ్యాభిషిక్తుడు అవడమే క్షత్రియుడి ప్రధాన ధర్మం. అందువల్లే అతను ప్రజలని పాలించ గలుగుతాడు. ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే రాజ్యపాలన రూపంలోని ధర్మాన్ని విడిచి క్షత్రియుడు ఎవడైనా అనుమానం కలిగించేది, చెడ్డ లక్షణాలు కలది, కాలాంతరానికి సంబంధించింది, అనిశ్చితమైనదైన ధర్మాన్ని ఆచరిస్తాడా? లేదా శ్రమ వల్ల కలిగే ధర్మానే్న నువ్వు ఆచరించాలని కోరుకుంటే, నాలుగు వర్ణాలని ధర్మానుసారంగా పరిపాలించే శ్రమని పొందు. నాలుగు ఆశ్రమాల్లో గృహస్థావ్రమం శ్రేష్ఠమైందని ధర్మవేత్తలు చెప్తారు కదా? అలాంటి గృహస్థాశ్రమాన్ని ఎలా విడిచి పెడతావు?
‘నేను విద్య చేత, స్థానం, జన్మ చేత కూడా నీకంటే చిన్నవాడిని. అలాంటి నేను నువ్వుండగా ఈ భూమిని ఎలా పాలించగలను? చిన్నవాడినైన నేను బుద్ధి చేత, గుణాల చేత, స్థానం చేత కూడా చాలా తక్కువైన వాడిని. నువ్వు లేకపోతే నేను జీవించాలని కూడా కోరుకోను. ఓ రామా! తండ్రి నించి వచ్చిన నిష్కంటకమైన ఈ రాజ్యాన్ని అంతటినీ బంధుసమేతుడివై ధర్మానుసారంగా, ఏమరుపాటు లేకుండా పరిపాలించు. సమస్తమైన అమాత్యాదులు, మంత్రకోవిదులైన వశిష్ఠుడు మొదలైన ఋత్విక్కులు నీకు ఇక్కడే వేద మంత్రాలతో రాజ్యాభిషేకం చేస్తారు. బలం చేత అన్ని లోకాలని జయించిన, దేవతా సహితుడైన దేవేంద్రుడిలా నువ్వు రాజ్యాభిషిక్తుడివై మేమంతా వెంట రాగా అయోధ్యని పాలించడానికి కదులు. దేవ, ఋషి, పితృ ఋణాలనే మూడు ఋణాలని తీరుస్తూ, శత్రువులని బాధిస్తూ, మిత్రుల కోరికలని తీరుస్తూ నువ్వే నన్ను పాలించాలి. పూజ్యుడా! ఇప్పుడు నువ్వు రాజ్యాభిషిక్తుడు అవడం వల్ల నీ మిత్రులంతా సంతోషిస్తారు. నీ శత్రువులంతా భయపడి దిక్కులు పట్టి పారిపోవాలి. నా తల్లికి జనుల వల్ల కలిగిన శాపాలని తొలగించి, పూజ్యుడైన తండ్రిని కూడా పాపాల నించి రక్షించు. నేను తల వంచి ప్రార్థిస్తున్నాను. విష్ణుమూర్తి ప్రాణుల మీద దయ చూపించినట్లుగా నా పైన, సమస్త బంధువుల మీద దయ చూపించు. నా ప్రార్థనని కాదని నువ్వు అరణ్యానికే వెళ్లేట్లయితే నేను కూడా నీ వెంటే వస్తాను.’
భరతుడు అలా సవినయంగా ప్రార్థిస్తున్నా, గొప్ప మనస్థైర్యం గల, భూ మండలానికి ప్రభువైన రాముడు తండ్రి మాట మీదే స్థిరంగా నిలిచి, అయోధ్యకి తిరిగి వెళ్లడానికి అంగీకరించలేదు. రాముడిలోని ఆశ్చర్యకరమైన ఆ మనస్థైర్యాన్ని చూసి అంతా విచారంతోపాటు సంతోషాన్ని కూడా పొందారు. రాముడు అయోధ్యకి రావడం లేదే అని దుఃఖించారు. అతని స్థితప్రజ్ఞతని చూసి సంతోషించారు. అలా మాట్లాడే భరతుడిని ఋత్విక్కులు, నిగమ సముదాయాల నాయకులు, దుఃఖం వల్ల కన్నీటి బొట్లు కూడా మిగలని తల్లులు స్తుతించారు. వారంతా రాముడ్ని సవినయంగా ప్రార్థించారు.

(అయోధ్య కాండ సర్గ 106వ సర్గ)

ఓ వైష్ణవుడు మంగళహారతి తర్వాత హరిదాసుతో చెప్పాడు.
‘దాసుగారు! మీ గాత్రం అద్భుతం. మీ మాట వినసొంపుగా ఉంది. అంతా చక్కగా చెప్పారు. కాని ఆరు చిన్న తప్పులని చెప్పారు.’

ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?

1.సీతని కౌసల్య తల్లి కూతుర్ని కౌగలించుకున్నట్లుగా కౌగలించుకుంది. ఈ ముఖ్యమైన ఉపమానాన్ని హరిదాసు చెప్పలేదు.
2.రాముడు వశిష్టుడి పాదాలని ఇంద్రుడు బృహస్పతి పాదాలని తాకినట్లుగా తాకాడు. కాని హరిదాసు బృహస్పతి బదులు ‘విశ్వామిత్రుడి’ అని తప్పు చెప్పాడు.
3.్భరతుడు పరిశుద్ధుడైన మహేంద్రుడు బ్రహ్మ దగ్గర కూర్చున్నట్లుగా రాముడి దగ్గర కూర్చున్నాడు. ఈ ఉపమానాన్ని హరిదాసు చెప్పలేదు.
4.‘నా తల్లి మాటలు మన్నించి’ నాకు రాజ్యాన్ని ఇచ్చావు’ అని భరతుడు చెప్పాడు. కాని హరిదాసు తప్పుగా ‘మన తండ్రి మాటలు మన్నించి’ అని చెప్పాడు.
5.ఓ చోట ఏనుగులు ఘీంకరించు గాక అని వాల్మీకి చెప్తే హరిదాసు తప్పుగా ‘గర్జించు గాక’ అని తప్పుగా చెప్పాడు.
6.‘మహాసముద్రంలో ఓ కట్టె మరో కట్టెతో కలిసి దగ్గరగా ఉండి కొంత కాలానికి విడిపోతుంది’ అని వాల్మీకి చెప్పిన ఉపమానం ఆధ్యాత్మిక జగత్తులో ప్రసిద్ధం. దీన్ని హరిదాసు చెప్పలేదు.
==========================================================
మీకో ప్రశ్న

గాయత్రి మంత్రంలోని ఐదవ బీజాక్షరం ‘వ’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
===============================================================
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

గాయత్రి మంత్రంలోని నాల్గవ బీజాక్షరం ‘తు’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
అయోధ్యకాండ 14-36లోని చతురస్వో రథ శ్రీ్శమాన్ నిస్ర్తీంసో ధను రుత్తమం శ్లోకంలో.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి