Others

నాకు నచ్చిన పాట -- రామయ తండ్రి.. ఓ రామయతండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1972లో విడుదలైన సంపూర్ణ రామాయణం బాపు దర్శకత్వంలో అద్భుతంగా రూపొందింది. ఉత్తమ విలువలను ప్రదర్శిస్తూ, దర్శక నిర్మాతలు సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా నిర్మించారు. శ్రీరామకథను పెద్దగా వివరించాల్సిన పనిలేదు. శ్రీరాముడు సీతాదేవితో నారచీరలు ధరించి, సరయు నదిని దాటే సమయంలో గుహుడు పాడిన పాట ‘రామయ తండ్రి.. ఓ రామయ తండ్రి, మా నోములన్ని పండినాయి రామయ తండ్రి, మా సామి వంటె నీవేలే రామయ తండ్రి’ అన్న పాట నాకెంతో ఇష్టమైనది. గుహుడు తన భక్తిని, రాముడిని నది దాటించే సమయంలో చక్కగా వెలిబుచ్చాడు. నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలుపెడితే ఏవౌతాదో తంట’ అంటూ రాముడి కాళ్లు కడిగే ఉద్దేశంతో ‘దయచేసి ఒక్కమారు కాళ్లు కడగనీయమంట.., మూడు మూర్తులా నీవు నారాయణమూర్తివంట’ అంటూ శ్లాఘించాడు. శివుని విల్లు ఒక దెబ్బకే విరిచావంట, పరశురాముడంతటోణ్ణి పారదోలినావంట’ అని రాముణ్ణి కీర్తిస్తూ ‘అందరినీ దరిజేర్చూ మా రాజువే.. అద్దరిని చేర్చమని అడుగుతుండవే’ అని ప్రశ్నించి మళ్లీ సమాధానం కూడా తానే చెబుతాడు. ‘నువ్వు దాటలేక కాదులే రామయ తండ్రి, నన్ను దరిచేర్చగ వచ్చినావు రామయ తండ్రి’ అంటూ భక్తి పారవశ్యంలో తాదాత్మ్యంతో పాడతాడు. ఈ పాటను కొసరాజు రాయగా కెవి మహదేవన్ సంగీతంలో ఘంటసాల కర్ణపేయంగా ఆలపించారు. భక్తిరసం తొణికిసలాడిన ఈ మధుర గీతం రామాయణ గాథను చక్కగా ఆవిష్కరిస్తుంది. అందుకే ఈ పాటంటే చాలా ఇష్టం.
-పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం