రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..76 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశరథుడు కొద్దిసేపటికి మేలుకుని శోకంతో బాధపడే మనసుతో ఆలోచించసాగాడు. రామలక్ష్మణులని అడవికి పంపడంతో ఆ దశరథుడ్ని గొప్ప ఆపద ఆక్రమించింది. రాముడు భార్యతో కలిసి అడవికి వెళ్ళాక దశరథుడికి పూర్వం తను చేసిన పాపం జ్ఞాపకం వచ్చి దాన్ని నల్లటి కళ్ళుగల కౌసల్యకి చెప్పదలచుకున్నాడు. రాముడ్ని అరణ్యానికి పంపేసిన ఆరో రోజు అర్ధరాతి దశరథుడికి తను పూర్వం చేసిన పాపం గుర్తుకువచ్చింది. పుత్ర శోకంతో పీడించబడే అతను తను చేసిన పాపపు పనిని తలచుకుంటూ, పుత్ర శోకంతో బాధపడే కౌసల్యతో చెప్పాడు.
‘‘మంచిదానివైన ఓ కౌసల్యా! అందమైన పెద్ద పెద్ద మోదుగ చెట్ల పూలని చూసి దాని పళ్ళు బాగుంటాయని వాటి మీద ఆశతో ఒకడు జామ తోటని నరికి మోదుగ చెట్లని పెంచుతాడు. చివరికి దాని పళ్ళని చూడగానే విచారిస్తాడు. తను చేసే కర్మకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోకుండా కర్మ చేసేవాడు మోదుగ చెట్టుకి నీళ్ళుపోసి పెంచినవాడిలా దుఃఖిస్తాడు. నేను జామ తోటని నరికి మోదుగ చెట్లకి నీళ్ళు పోసి పెంచాను. చెడు బుద్ధి గల నేను ఫలాలు లభించే సమయంలో రాముడ్ని దూరంగా పంపేసి ఇప్పుడు విచారిస్తున్నాను.
‘‘నేను యవ్వనంలో ఉన్నప్పుడు శబ్దాన్ని బట్టి బాణంతో కొట్టగల నవ యువకుడ్ని అని పేరు పొందాను. ధనస్సుతో ఈ పాపం చేసాను. కౌసల్యా! తెలీకుండా విషం తిన్న చిన్న పిల్లాడికి విచారం కలిగినట్లుగా నాక్కూడా ఇప్పుడు స్వయంగా చేసుకున్న కర్మ తాలూకు విచారం కమ్ముకుంది. ఎవరో ఓ వ్యక్తి పలాశ చెట్టుని చూసి మోసపోయినట్లుగా నేను కూడా శబ్దాన్ని లక్ష్యంగా చేసుకుని కొట్టగలిగే ఫలాల గురించి తెలుసుకోలేకపోయాను.’’
‘‘కౌసల్యా! మన పెళ్ళైన కొత్తల్లో మదం, కామాలని పెంపొందించే వర్షరుతువు వచ్చింది. సూర్యుడు భూమిలో ఉన్న రసాలని తీసుకుని కిరణాలతో ప్రపంచాన్ని తపింపచేసి, ప్రేతాలు సంచరించే భయంకరమైన దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. వెంటనే వేడి మటుమాయమై నిగనిగలాడే మేఘాలు కనపడ్డాయి. అప్పుడు కప్పలు, చక్రవాకాలు, నెమళ్ళు అన్నీ సంతోషించాయి. గాలులకి, వర్షానికి తడిసిన రెక్కల పై భాగాలతో పక్షులు స్నానం చేసినట్లై, కదిలిపోతున్న చెట్ల పై భాగాల మీదకి అతి కష్టం మీద చేరుతున్నాయి. కురిసిన నీటిని ఇంకా కురుస్తున్న నీళ్ళు కప్పివేయగా మదించిన లేళ్ళు గల పర్వతం సముద్ర ంలా ఉంది. జలప్రవాహాలు నిర్మలమే ఐనా పర్వతాల పైన ఉన్న ధాతువుల సంపర్కం వల్లవాటి బూడిద కలిసి తెల్లగా, ఎర్రగా మారి పాముల్లా ప్ర వహిస్తున్నాయి. అంతవరకూ నిర్మలంగా ఉన్న ప్ర వాహాలు కూడా వర్షాకాలం రాగానే కరిగిపోయి ఎర్రబడ్డ నీటితో దారి తప్పి ప్రవహిస్తున్నాయి. ఆనందకరమైన ఆ వర్షాకాలంలో వేటాడాలని రథానె్నక్కి సరయూ నది తీరం వైపు వెళ్ళాను. అక్కడ నేను సరైన ఆలోచన లేక తోచిన విధంగా చేస్తూ రాత్రి నదిలో నీళ్ళు తాగడానికి రేవుకి వచ్చే దున్నని కాని, ఏనుగుని కాని, మరేదైనా క్రూరమృగాన్ని కాని చంపాలని బాణాన్ని సిద్ధంగా ఉంచుకుని ఆ రాత్రి ఓ రహస్య ప్ర దేశంలో దాక్కున్నాను. నదీ తీరానికి వచ్చి ఓ వన్య మృగాన్ని, ఓ క్రూర మృగాన్ని అవి చేసే శబ్దాన్ని బట్టి గుర్తించి చంపాను. ఇంతలో చీకట్లో కంటికి కనపడని ప్రదేశంలో నీళ్ళు నింపే కుండ శబ్దం ఘీంకరించే ఏనుగు శబ్దంలా వినిపించింది. ఆ ఏనుగుని కొట్టాలనే కోరికతో నేను మెరిసే పాములాంటి పదునైన బాణాన్ని తీసి ఆ ధ్వని వైపు గురి చూసి వదిలాను. అది మర్మస్థానంలో గుచ్చుకుని నీళ్ళలో పడిపోయిన ఓ వనవాసి ‘అయ్యో! అయ్యో!’ అని అరిచిన అరుపు ఆ తెల్లవారుఝామున స్పష్టంగా వినిపించింది. ‘తపస్సు చేసుకునే నా వంటి వాడిమీద ఈ బాణాన్ని ఎవరు ప్రయోగించారో కదా?’ అన్న మనిషి మాటలు వినపడ్డాయి.’’
‘‘నేను నీళ్ళని తీసుకెళ్ళడానికి రాత్రి ఈ నిర్జనమైన నదికి వచ్చాను. నన్ను బాణంతో ఎవరు కొట్టారో? నేను ఎవరికి ఏం అపకారం చేసాను? హింసను వదిలి అడవిలో లభించే వాటితో అడవిలోనే జీవించే నా వంటి రుషిని ఆయుధంతో చంపడానికి కారణం ఏమిటి? జటలు, నారచీరలు, కష్ణాజినాలని ధరించిన నన్ను చంపాలని ఎవరు కోరుకున్నారు? అతనికి నేనేం అపకారం చేసాను? అతను ఎవరో కాని కేవలం అనర్థాన్ని మాత్రమే కలిగించే వ్యర్థమైన పని చేసాడు. ఏ ఒక్కడూ ఇతన్ని గురుపత్నితో సంబంధం కలిగి ఉన్నవాడిలా భావించి మెచ్చుకోడు. చచ్చిపోతున్నందుకు నా గురించి నాకు పెద్దగా విచారం లేదు. నా తల్లిదండ్రులు గురించి మాత్రమే విచారిస్తున్నాను. నేను నా ముసలి దంపతులని చాలాకాలంగా పోషిస్తున్నాను. నేను మరణించాక వాళ్ళు ఎలా జీవిస్తారో కదా? నా తల్లిదండ్రులు, నేనూ కూడా ఒక్క బాణంతో చంపబడ్డాం. ఆ మనోనిగ్ర హం లేని పరమ మూఢుడు ఎవరో కదా?’’
దీనమైన ఆ మాటలని వినగానే ధర్మం మీద ఆసక్తిగల నాకు చాలా బాధ కలిగింది. నా చేతుల్లోంచి ధనస్సు, బాణాలు జారి నేలమీద పడ్డాయి. ఆ విధంగా ఆ రాత్రి విలపించే అతని దీనమైన మాటలని విని శోకవేగంతో తొట్రుపడే నా మనసు వికలమైంది. బలం తరిగిపోయి, మనసులో బాగా దుఃఖిస్తూ నేను అక్కడికి వెళ్ళి, సరయూ నదీతీరంలో బాణం ములుకుతో బాధించబడే నేల మీద పడున్న ముని కుమారుడ్ని చూసాను. అతని జుట్టు చెదిరి ఉంది. కలశంలోని నీళ్ళు దూరంగా పడిపోయాయి. అతని శరీరమంతా బురదతో, రక్తంతో కప్పబడి ఉంది. భయపడి, దిగులుగా ఉన్న నన్ను అతను తన తేజస్సుతో కాల్చేయదలచుకున్నాడా అన్నట్లుగా కళ్ళని పైకెత్తి చూసి కోపంగా చెప్పాడు.
‘‘రాజా! నా తల్లిదండ్రుల కోసం నీటిని తీసుకెళ్ళే నన్ను ఇలా కొట్టావేం? అడవిలో నివశించే నేను నీకేం అపకారం చేసాను? నా మర్మస్థానంలో ఓ బాణంతో కొట్టడం చేత ముసలివాళ్ళు, గుడ్డి వాళ్ళైన నా తల్లిదండ్రు లని కూడా చంపినట్లయింది కదా? దాహంతో ఉన్న బలహీనులు, గుడ్డివాళ్ళైన నా తల్లిదండ్రులు నా కోసం ఎదురుచూస్తూ నీటిని తీసుకువస్తాననే ఆశతో అతి కష్టంగా దాహాన్ని ఆపుకుని ఉంటారన్నది సత్యం. నేనీవిధంగా నేల మీదపడి ఉన్నట్లు నా తండ్రికి తెలీదు. దీన్ని బట్టి తపస్సుకి కాని, శాస్త్ర జ్ఞానానికి కాని ప్రయోజనం ఏమీ లేదని నిశ్చయంగా చెప్పచ్చు. శక్తిలేని, నడవడానికి కూడా బలం లేని నా తండ్రి ఇది తెలిసినా ఏం చేయగలడు? పక్కనే ఉన్న చెట్టుని నరికేస్తూంటే మరో చెట్టు దాన్ని ఎలా రక్షించలేదో అలాగే అతను ఏమీ చేయలేడు. దశరథా! కోపంతో రగిలిన అగ్ని అడవిని కాల్చేసినట్లుగా నా తండ్రి నిన్ను కాల్చకుండా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళి ఇది మా నాన్నకి చెప్పు. ఈ కాలిబాట నా తండ్రి ఆశ్రమానికి వెళ్తుంది. నువ్వు వెళ్ళి ఆయన్ని బతిమాలుకో. అప్పుడు ఆయన నిన్ను శపించకుండా వదులుతాడు. రాజా! నా శరీరం నుంచి ఈ బాణాన్ని తీసేయ్. పదునైన నీ బాణం నా మర్మస్థానాన్ని మృదువైన, ఎతె్తైన తీరాన్ని నీటివేగం పీడించినట్లుగా పీడిస్తోంది. తొందరగా ఈ బాణాన్ని ఊడబెరుకు. నువ్వు వేసిన బాణం నా ప్రాణాన్ని అడ్డుకుంటోంది. అది ఉన్నంతవరకూ నేను చావను.’’
బాణాన్ని లాగకపోతే అతను ప్రాణాలు పోక బాధపడతాడు. తీసేస్తే పోతాడు. అప్పుడు ఏం చేయాలనే ఆలోచన నాలో కలిగింది. ఆ మునికుమారుడు విచారంతో బాధపడే నా మనసులోని ఆలోచనని గ్రహించి, బాధతో కృంగిపోతూ, అవయవాలన్నీ మెలికలు తిరుగుతూంటే, నేల మీద దొర్లుతూ, చావుకి దగ్గరై, చాలా బాధపడుతూ అతి కష్టంగా చెప్పాడు.
‘‘నేను ధైర్యంతో శోకాన్ని అణగదొక్కి గట్టి మనసు చేసుకున్నాను. బ్రహ్మహత్యా పాపం చేసానని బాధపడకు. దేశాన్ని పాలించే ఓ రాజా! నేను బ్రాహ్మణుడ్ని కాను కాబట్టి బాధపడకు. నేను శూద్రుడికి, వైశ్య స్ర్తీకి పుట్టినవాడిని.’’
మర్మస్థానంలో బాణం తగిలి నేల మీద దొర్లే అతను అతి కష్టం మీద నాతో ఈ మాటలు చెప్పాడు. శరీరం ముడుచుకుని అతని కదలికలు తగ్గాయి. వెంటనే నేనా బాణాన్ని లాగగానే ఆ తపస్వి కళ్ళెత్తి నా వైపు చూసి భయపడుతూ ప్రా ణాలు విడిచాడు. కౌసల్యా! మర్మస్థానంలో తగిలిన బాధతో విలపిస్తూ ఆగకుండా ఊపిరి పీలుస్తూ, నీళ్ళల్లో తడిసి సరయూ నదీ తీరంలో పడి ఉన్న అతన్ని చూడగానే నాకు చాలా దుఃఖం కలిగింది.’’(అయోధ్య కాండ సర్గ 63)
ఇంటి దగ్గర ఆ సర్గని చదువుకుని వచ్చిన ఆశే్లష అమ్మమ్మ మీనమ్మ వెంటనే హరిదాసుతో చెప్పింది.
‘‘ ఏమయ్యోయ్. ఇవాళ హరికథలో ఐదు తప్పులు చెప్పావు. ఇలా ఐతే ఎలా’’
రామాయణం డిటెక్టివ్‌గా మీరా తప్పులని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
మోదుగ చెట్లని సంస్కృతంలో ఏమంటారు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
తిక్కన సోమయాజి రాముడి మీద రాసిన పుస్తకం పేరేమిటి?
నిర్వచనోత్తర రామాయణం
1. కౌసల్య దశరథుడితో చెప్పిన మాటలు ‘మరో జంతువు ముట్టుకున్న ఆహారాన్ని పెద్దపులి తినదు. అలాగే రాముడు ఇతరులు అనుభవించిన రాజ్యాన్ని అంగీకరించడు’ హరిదాసు చెప్పలేదు.
2. కౌసల్య భార్యకి గల మూడు గతుల గురించి చెప్పాక ‘నాలుగో గతి ఏదీ లేదు’ అని కూడా చెప్పింది. దీన్ని హరిదాసు చెప్పలేదు.
3. తనని నిందించే కౌసల్యతో దశరథుడు ‘్ధర్మదఋష్టి గల స్తీ లకి గుణవంతుడైనా, గుణంలేని వాడైనా భర్తే ప్రత్యక్ష దైవం కదా?’ అని చెప్పిన ముఖ్యమైన నీతి వాక్యాన్ని హరిదాసు చెప్పలేదు.
4. రాముడు అడవికి వెళ్ళి నేటికి ఐదు రోజులైందని లెక్కలు చెప్తున్నాయి అని వాల్మీకి రాసాడు. తప్పుగా హరిదాసు‘పదిరోజులు’ అని చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి