రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..85 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరుడైన భరతుడు చాలాసేపటికి తిరిగి స్పృహలోకి వచ్చి లేచి, మంత్రుల మధ్య కన్నీటితో ఉన్న దీనురాలైన తల్లిని చూసి ఆవిడని నిందించాడు.
‘‘నేను ఎన్నడూ రాజ్యాన్ని కోరుకోలేదు. నీతో కూడా ఎన్నడూ ఈ ఆలోచన చేయలేదు. రాజు నాకు రాజ్యం ఇవ్వడానికి అంగీకరించిన విషయం కూడా నాకు తెలీదు. నేను, శతృఘు్నడు చాలా దూరదేశంలో ఉన్నాం కదా! మహాత్ముడైన రాముడు వనవాసానికి వెళ్ళినట్లు నాకు తెలీదు. సీత, లక్ష్మణుడు ఎలా దూరంగా పంపేయబడ్డారో నాకు తెలీదు.’’22
మహాత్ముడైన భరతుడు ఇలా అరవడం విన్న ఓ భటుడు కౌసల్యకి అతను వచ్చిన సంగతి వెళ్ళి చెప్పాడు.
‘‘క్రూరమైన పనిచేసిన కైకేయి కొడుకు భరతుడు వచ్చాడు. దూరాలోచనగల ఆ భరతుడ్ని చూడాలని అనుకుంటున్నాను.’’2 కౌసల్య వెంటనే సుమిత్రతో చెప్పింది.
రంగుమారి, మలినమైన శరీరంతో కృశించి ఉన్న కౌసల్య తర్వాత వణికిపోతూ భరతుడు ఉన్నచోటికి బయలుదేరింది. రాముడు తమ్ముడైన భరతుడు శతృఘు్నడితో కలిసి కౌసల్య ఇంటి వైపు బయలుదేరాడు. వారి ఇంట్లో దుఃఖంతో, స్పృహ తప్పి, నేల మీద పడి ఉన్న పూజ్యురాలు, మంచి మనసుగల కౌసల్యని చూసి భరత, శతృఘు్నలు ఏడుస్తూ అతికష్టంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి కౌగలించుకున్నారు. విచారించే కౌసల్య భరతుడితో చెప్పింది.
‘‘కైకేయి చేసిన క్రూరకార్యంతో రాజ్యం కావాలని కోరుకున్న నీకు, ఏ శతృబాధా లేని రాజ్యం లభించింది. ఎంత ఆశ్చర్యం! చెడ్డ ఆలోచనలు గల కైకేయి నా కొడుకు నారచీరలు కట్టుకుని అడవికి వెళ్ళేట్లు ఏ ప్రయోజనాన్ని ఆశించి చేసింది? ఉత్తమ కీర్తి, అదృష్టం గల నా కొడుకు ఉన్న చోటికే కైకేయి నన్ను కూడా పంపేయడం మంచిది. లేదా నేనే స్వయంగా సుమిత్రతో కలిసి అగ్నిహోత్రాన్ని ముందుంచుకుని రాముడున్న చోటికి సంతోషంగా వెళ్ళిపోతాను. నీకు ఇష్టమైతే నువ్వే స్వయంగా పురుషశ్రేష్టుడైన నా కొడుకు తపస్సు చేసే చోటికి నన్నిప్పుడే తీసుకెళ్ళు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్న, ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండిన, అతి విశాలమైన ఈ రాజ్యాన్ని ఆవిడ నీకు ఇప్పించింది కదా?’’22
పుండులో సూది గుచ్చినట్లు ఇలా అనేక మాటలతో నిందించబడిన, ఏ పాపం ఎరగని భరతుడు చాలా బాధపడ్డాడు. అవి విని తల తిరిగిపోయి ఆమె పాదాల మీదపడి అనేక విధాలుగా విలపించి మూర్ఛపోడు. త్వరలో తెప్పరిల్లి అలాగే ఉండిపోయాడు. తర్వాత భరతుడు దోసిలి పట్టి నమస్కరిస్తూ అనేక విధాలైన శోకాలు పీడిస్తూండగా ఏడ్చే కౌసల్యతో చెప్పాడు.
‘‘అమ్మా! ఏ విషయమూ తెలీని, ఏ పాపం ఎరగని నన్నీవిధంగా ఎందుకు నిందిస్తున్నావు? నాకు రాముడు మీద ఎంత అధికమైన, స్థిరమైన ప్రేమ ఉందో నీకు తెలుసు కదా? సత్యసంధుడు, సత్పురుషుల్లో గొప్పవాడైన అన్నగారు ఎవరి అనుమతితో అరణ్యానికి వెళ్ళాడో వారికి శాస్త్రాలు అనుసరించే స్థిరమైన బుద్ధి లేదు. అన్నగారు అరణ్యానికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, నాకు పాపాత్మునికి సేవచేసిన పాపం, సూర్యుడికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసిన పాపం, నిద్రించే ఆవుని కాలితో తన్నిన పాపం వచ్చుగాక! అన్నగారు నా సమ్మతి మీద అరణ్యానికి వెళ్ళినట్లైతే, యజమాని తన సేవకుడి చేత చాలా పని చేయించుకుని అతనికి ఏమీ ధనం ఇవ్వకపోతే కలిగే పాపం నాకు కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, ప్రజలని తన సంతానంలా పరిపాలించే రాజుకి ద్రోహం చేసే వారికి ఎలాంటి పాపం కలుగుతుందో నాకు అలాంటి పాపం కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, యాగం చేయించడానికి దక్షిణలన్నీ ఇస్తానని మునులకి మాటిచ్చి, తర్వాత నేను అలా అనలేదని అబద్ధం ఆడేవాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, ఏనుగులతోను, గుర్రాలతోను, రథాలతోను నిండిన యోధులతో వ్యాకులమైన రణరంగానికి వెళ్ళి, శూరుల ధర్మం పాటించకుండా వెన్ను చూపి పారిపోయి వచ్చినవాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, ధీమంతుడైన ఆచార్యుడు ప్రయత్న పూర్వకంగా ఉపదేశించిన సూక్ష్మ విషయాలు గల శాస్తా న్ని విస్మరించిన వాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, బలిష్టమైన చేతులు, భుజాలు గల, సూర్యచంద్రులతో సమానమైన తేజస్సుగల ఆ రాముడు రాజాధీశుడై సింహాసనం మీద కూర్చుని ఉండగా చూసే భాగ్యం నాకు కలుగదు. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, పితృ, అతిథి, పూజలేమీ లేకుండానే పాయసం, పులగం, మేక మాంసం తినేవాడికి గురువులని అవమానించే దయావిహీనుడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. రాముడు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, నాకు ఆవులని కాళ్ళతో తన్నిన పాపం, స్వయంగా పెద్దవారిని దూషించిన పాపం కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, ఓ వ్యక్తి తనపై ఉన్న నమ్మకంతో రహస్యంగా తన మిత్రులు, ఇతరుల గురించి చెప్పిన దూషణ విషయాలు వారికి చెప్పేవాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, నేనను ఎవరికీ ఎలాంటి ఉపకారం చేయని వాడిగాను, కృతజ్ఞత లేని, ఆత్మహత్య చేసుకున్న, సిగ్గులేని, లోకంలో అందరి చేతా ద్వేషించబడే వాడిగా అవుతాను. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, ఇంట్లో భార్యా పుత్రులు, ఇతర పరివారం ఉండగా ఒక్కడే విందు భోజనం చేసినవాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, తగిన భార్యని పెళ్ళిచేసుకోక, సంతానం లేక, ధర్మసమ్మతమైన పనులు చేయనివాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, రాజుని, స్ర్తీలని, బాలలని, ముసలివాళ్ళని చంపడం, పోషించదగ్గ వారిని విడిచిపెట్టడం వల్ల కలిగే పాపం నాకు వస్తుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, అమ్మకూడని లక్క, మధువు, మాంసం, లోహం, విషయం అమ్మి వ్యాపారం చేస్తూ నిత్యం దారాపుత్రాదులని పోషించేవాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళడానికి నా సమ్మతి ఉంటే, శతృపక్షాలు రెండింటికి భయం కలిగించే యుద్ధం తారాస్థాయిలో ఉండగా వెన్ను చూపి పారిపోతూ చంపబడ్డ యోధుడికి కలిగే పాపం నాకు కలుగుతుంది.’’
‘‘అన్నగారు అడవికి వెళ్ళాలని కోరేవాడు కుండ పెంకుని చేత్తో పట్టుకుని, చిరిగిన దుస్తులని కట్టుకుని, బిచ్చం ఎత్తుకుంటూ పిచ్చివాడిలా భూమిమీద తిరుగుగాక. అన్నగారు అడవికి వెళ్ళాలని కోరేవాడు కామక్రోధాలకి లొంగి నిత్యం మద్యపానం, స్ర్తీలు, జూదం మొదలైన వ్యసనాలలో ఆసక్తుడు ఆగుగాక. నేను రాముడి వనవాసాన్ని అంగీకరించినట్లైతే ఇందాక చెప్పినవారికి ఎంత పాపం కలుగుతుందో అంత పాపం కలుగుతుంది. అన్నగారు అడవికి వెళ్ళాలని కోరినవాడి మనసు ధర్మంగా నడుచుకోదు. వాడు అధర్మాన్ని ఆచరిస్తూ అపాత్ర దానం చేస్తాడు. అన్నగారు అడవికి వెళ్ళాలని కోరినవాడు సంపాదించుకున్న అనేక విధాలైన వేలకొద్దీ ధనాలని దొంగలు దొంగిలించుదురుగాక. రాముడి అరణ్యవాసానికి నేను కారణమైతే ఎంత పాపం చేస్తే కూడబెట్టుకున్న ధనమంతా దొంగలు దొంగిలిస్తారో అంత పాపం నాకు కలుగుగాక. అన్నగారు అడవికి వెళ్ళడానికి అనుమతించిన వాడికి ఉభయ సంధ్యాకాలాల్లో నిద్రించే వాడికి కలిగే పాపం కలుగుగాక. అన్నగారు అడవికి వెళ్ళడానికి కారణమైన వాడికి ఇతరుల ఇళ్ళని కాల్చేసినవాడికి కలిగే పాపం, గురుభార్యతో సంగమించినవాడికి కలిగే పాపం, మిత్ర ద్రోహం వల్ల కలిగే పాపం కలుగుగాక. నేను అన్నగారి అరణ్యవాసానికి కారణమైనట్లైతే దేవతలకి, పితృదేవతలకి, తల్లిదండ్రులకి శుశ్రూష చేయనివారికి కలిగే పాపం కలుగుగాక.’’22 (అయోధ్యకాండ 75వ సర్గ, 46వ శ్లోకం దాకా)
ఆశే్లషకి హరిదాసు చెప్పిన తప్పులని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకపోయింది. కారణం అతను హరికథకి వచ్చే 75వ సర్గని చదివి రావడంతో అవి తెలిసాయి.
మీరా తప్పులను కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
శతృఘు్నడి భార్య పేరు ఏమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
సాల వృక్షాన్ని తెలుగులో ఏమంటారు? కానుగ చెట్టు
1.దుర్మార్గురాలైన సరే తల్లి బిడ్డకి మంగళకరమైంది అనే దృష్టితో వాల్మీకి భరతుడు ‘మంగళకరమైన’ తన తల్లి పాదాలని తాకి అని రాసాడు. మంగళకరమైన అన్న మాటని హరిదాసు చెప్పలేదు.
2.కైకేయి భరతుడి ‘తలని వాసన చూసి’ అని వాల్మీకి రాసాడు. ఆ రోజుల్లో పిల్లల మీద పెద్దలు ప్రదర్శించే ప్రేమ చిహ్నం అది. ‘కౌగిలించుకుని’ అని మాత్రమే హరిదాసు చెప్పాడు.
3.తాతగారింటి నించి బయలుదేరిన ఏడు రోజులకి భరతుడు అయోధ్యని చేరాడు. కాని భరతుడు తల్లితో ‘ఆరు రోజులైంది’ అని చెప్పాడని హరిదాసు తప్పుగా చెప్పాడు.
4.కైకేయి భరతుడికి ‘ఇష్టమైన విషయాన్ని చెప్తోందనే భ్రమతో’ రాముడు నారచీరలు ధరించి, సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యానికి వెళ్లాడు’ అని చెప్పింది. కాని హరిదాసు వాల్మీకి చెప్పిన ఆ భ్రమని చెప్పడంలో విస్మరించాడు.
6.గతంలో చెడ్డ పని చేసిన కొందరు రాజకుమారులకి రాజు దేశ బహిష్కరణ శిక్షని విధించడం గురించి వాల్మీకి ఇక్కడ అన్యాపదేశంగా చెప్తూ, భరతుడు ‘తన వంశం గొప్పతనం తెలిసిన వాడవడంతో’ రాముడు ఏదైనా అధర్మమైన పని చేసాడా? అని తల్లిని ప్రశ్నించాడు. కాని హరిదాసు పైన ఉదహరించినది చెప్పడం విస్మరించాడు.
6.హరిదాసు చెప్పినవి ఐదు తప్పులే. రచయిత ఆరు తప్పులు అని చెప్పడం ఆరో తప్పు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి